
దివంగత, బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను మూడు రోజుల క్రితం రక్తపోటు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆమె పరిస్థితి విషమించడంతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చెర్పించినట్లు కుటుంబ సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. దీంతో వైద్యులు ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కీ (ఐసియు) తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా జూలై 7ను ఆమె భర్త, నటుడు దిలీప్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే.
సైరా బాను ఇటీవల తన భర్త దిలీప్ కుమార్‌ను కోల్పోవడంతో అనారోగ్యానికి గురయ్యారని ఆమె సన్నిహితులు చెప్పారు. కాగా సైరా-దిలీప్లది ప్రేమ వివాహం. వారి వైవాహిక బంధంలో దిలీప్‌కు సైరా వెన్నుముకగా నిలిచారు. ఆయన ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు దగ్గరుండి ఆమె సేవలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment