ముంబై : గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. గతంలో ఉద్ధవ్ ఠాక్రే యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళాల్లో బ్లాకుల్ని తొలగించుకున్నారు.
తాజాగా, మరోసారి సమస్య ఉత్పన్నం కావడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారని , డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే మే 2016లో లీలావతి హాస్పిటల్‌లో యాంజియోగ్రఫీ ప్రక్రియ చేయించుకున్నారు. అంతకుముందు జూలై 20, 2012న గుండె ఎనిమిది స్టెంట్‌లను అమర్చారు.
కాగా, శనివారం ముంబైలోని శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై నిప్పులు చెరిగారు. నేటి ‘హైబ్రిడ్ బీజేపీ’ అంశంపై ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచించాలని అన్నారు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆలయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2019లో బీజేపీ హిందుత్వ సంస్కరణపై నమ్మకం లేనందునే ఆ పార్టీతో విడిపోయానని, అయితే తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాన్ని తాను ఎప్పటికీ వదులుకోలేదని థాకరే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment