Heart operation
-
రక్త'నాలా'ల్లో పూడికలు.. తీసివేతలు
చాలామంది వాడుకలో బైపాస్ ఆపరేషన్ అనే మాట నలుగుతుంటుంది. కానీ దాని అసలు అర్థం ఏమిటి, అందులో ఏం చేస్తారు, బైపాస్ శస్త్రచికిత్స అయినవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాలను తెలుసుకుందాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, వాటిని తొలగించి రక్తసరఫరా సాఫీగా జరడానికి వీలుకల్పించేందుకు చేసే శస్త్రచికిత్సను ‘సీఏబీజీ సర్జరీ’ అంటారు. ఇందులో... అప్పటికే రక్తపు క్లాట్స్ ఏర్పడ్డ ధమనులను వదిలేసి, ఇతర రక్తనాళాల ద్వారా అంటే... బైపాస్ చేసిన మార్గం ద్వారా గుండెకండరానికి రక్తం అందేలా చేస్తారు. ఇలా రక్తం బైపాస్ మార్గంలో వెళ్లడానికి కృత్రిమంగా రక్తనాళాలను గ్రాఫ్టింగ్ చేస్తారు కాబట్టి వైద్యపరిభాషలో దాన్ని ‘కరొనరీ ఆర్టరీ బై΄ాస్ గ్రాఫ్టింగ్’ అంటారు. దానికి సంక్షిప్త రూపమే ఈ సీఏబీజీ . దీన్నే సాధారణ వాడుక భాషలో ‘బైపాస్ సర్జరీ’ అని వ్యవహరిస్తుంటారు. గ్రాఫ్టింగ్ కోసం ఉపయోగించే ఆ రక్తనాళాలను కాళ్లు లేదా చేతుల్లో ఉన్నవాటిని తీసి, క్లాట్స్ అడ్డంకులుగా ఏర్పడ్డ రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా అమర్చుతారు. అలా అమర్చిన రక్తనాళాల ద్వారా గుండె కండరానికి అందాల్సిన రక్తాన్ని బైపాస్ అయ్యేలా చేస్తారు. గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్ చేసే ప్రక్రియను రీ–వాస్క్యులరైజేషన్ అంటారు. సాధారణంగా ఒక బ్లాక్ (అడ్డంకి)ని బైపాస్ చేయడానికి ఒక రక్తనాళం అవసరం. ఛాతీకీ కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీస్ అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్ అయిన నాళాల వద్ద బైపాస్ మార్గంలా కలుపుతారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగానే కొన్ని రక్తనాళాలు ఏర్పరుస్తారు తప్ప ఈ శస్త్రచికిత్స వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్ అ΄ోహ పడకూడదు. అందుకే కొత్తగా వేసిన రక్తనాళాలూ మళ్లీ బ్లాక్ అయి΄ోయి పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉన్నందున బాధితులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే... బాధితులకు హైబీపీ ఉన్నట్లయితే రక్త΄ోటును ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్ సూచించిన మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే బాధితుల్లో డయాబెటిస్ ఉంటే, రక్తంలోని చక్కెర మోతాదులను అదుపులో ఉంచుకునేందుకు అవసరమైన మందులు వాడుతూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. పొగతాగడం, మద్యం అలవాట్లు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన మేరకు శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలిగించని విధంగా తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి.డా‘‘ జి. వెంకటేశ్ బాబు, సీనియర్ కన్సలెంట్, ప్లాస్టిక్ సర్జన్ (చదవండి: దుస్తుల నుంచి కర్రీ వాసనలు రాకూడదంటే..!) -
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే
ముంబై : గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. గతంలో ఉద్ధవ్ ఠాక్రే యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళాల్లో బ్లాకుల్ని తొలగించుకున్నారు. తాజాగా, మరోసారి సమస్య ఉత్పన్నం కావడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారని , డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే మే 2016లో లీలావతి హాస్పిటల్లో యాంజియోగ్రఫీ ప్రక్రియ చేయించుకున్నారు. అంతకుముందు జూలై 20, 2012న గుండె ఎనిమిది స్టెంట్లను అమర్చారు. కాగా, శనివారం ముంబైలోని శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై నిప్పులు చెరిగారు. నేటి ‘హైబ్రిడ్ బీజేపీ’ అంశంపై ఆర్ఎస్ఎస్ ఆలోచించాలని అన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆలయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2019లో బీజేపీ హిందుత్వ సంస్కరణపై నమ్మకం లేనందునే ఆ పార్టీతో విడిపోయానని, అయితే తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాన్ని తాను ఎప్పటికీ వదులుకోలేదని థాకరే చెప్పారు. -
హార్ట్ బైపాస్ సర్జరీ: రికవరీ కోసం తీసుకోవాల్సిన డైట్ ఇదే..!
కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG) శస్త్రచికిత్స నుంచి కోలుకోవడం అంటే హృదయ ఆరోగ్యం వైపు వేస్తున్న తొలి అడుగు. ఇక్కడ అంత పెద్ద సర్జరీ తర్వాత త్వరితగతిన కోలుకోవడంలో తీసుకునే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. సరైన పోషకాహారంపై దృష్టిసారిస్తే త్వరితగతిన కోలుకోవడమే గాక మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఇక్కడ సర్జరీ తర్వాత లిక్విడ్ డైట్‌తో ప్రారంభించి..కోలుకున్న వెంటనే రెగ్యులర్ డైట్‌ని ఫాలో అవ్వడానికి ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే..?మళ్లీ ఘన పదార్థాలు తీసుకునేటప్పుడూ ఆకలి లేకపోవడం, వికారం లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను ఎదురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చంటే..గుండెకు ఉపకరించే ఆరోగ్యకరమైన ఆహారాలు..హృదయాన్ని ఆరోగ్యకరంగా ఉండేలా చేసే అత్యుత్తమమైన ఆహారాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండేవి తీసుకోవాలి. ఇవి గుండెల్లో మంటను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు..మీలో కొలస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం.అందుకోసం వేయించిన ఆహారాలు, మాంసాహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవోకాడోస్, నట్స్, గింజలు,సాల్మన్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలను తినండి. అలాగే వేరుశెనగ, బియ్యం ఊక, పొద్దుతిరుగుడు లేదా ఆవాల నూనెలను వంటనూనెలుగా ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు తగ్గించండి..రక్తపోటుని నిర్వహించేందుకు ఉప్పు తక్కువుగా తీసుకోవడం అత్యంత ముఖ్యం. అధిక సోడియం ప్రాసెస్ చేసిన ఆహారాలు, క్యాన్డ్ సూప్‌లు, స్నాక్స్‌కి బదులుగా ఉప్పులేని భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.ప్రోటీన్ ప్యాకేజీలు రికవరీకి లీన్ ప్రోటీన్లు కీలకం, ఎందుకంటే అవి కణజాల మరమ్మత్తు, కండరాల బలానికి సహాయపడతాయి. పౌల్ట్రీ, చేపలు, చిక్కుళ్ళు, టోఫు, తక్కువ కొవ్వు వంటి లీన్ సోర్స్‌లను ఎంచుకోండి. కండరాల రిపేర్‌కు తోడ్పడేందుకు, అలాగే నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ప్రతి భోజనంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి..సర్జరీ తర్వాత కోలుకోవాలంటే హైడ్రేటెడ్ ఉండటం అత్యంత కీలకం. శరీరం బాగా పనిచేసేలా రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. చక్కెర పానీయాలు, కెఫిన్‌లను నివారించండి. డైటీషియన్ సలహాలు తీసుకోవడం..సర్జరీ తర్వాత ఎలాంటి ఆహారం మంచిదనేది మన వైద్య చరిత్ర తెలిసిన డైటీషియన్‌ని అడగడం మంచిది. అది మనకు ఎలాంటి సమస్యలు రాకుండా నివారించడమే గాకుండా ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు ఉపకరిస్తుంది. బాడీ పరిస్థితిని అర్థం చేసుకోండి..దీర్ఘకాలిక గుండె ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమైనదో అలాగే మనం తీసుకునే ఫుడ్‌కి శరీరం ఎలా రియాక్షన్ ఇస్తుందనేది గమనించడం అంతే ముఖ్యం.అలాగే ఎప్పటికప్పుడూఆరోగ్య సంరక్షణ నిపుణులు సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవడం కూడా విస్మరించొద్దని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్) -
‘యశోద’లో అరుదైన గుండె శస్త్రచికిత్స
కరీంనగర్: హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స చేసి, ఓ మహిళకు కొత్త జీవితాన్ని అందించినట్లు కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సత్యశ్రీధర్ తెలిపారు. బుధవారం కరీంనగర్‌లోని యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ పట్టణానికి చెందిన 54 ఏళ్ల చెన్నూరి లత గుండె దడ, నడిస్తే ఆయాసం, గట్టిగా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఏడాది క్రితం సోమాజిగూడలోని తమ ఆస్పత్రికి వచ్చిందన్నారు. ఆమెకు ఈసీజీ, 2డీ ఎకో, యాంజియోగ్రామ్ నిర్వహించగా పదే పదే గుండెపోటు వచ్చి, గుండె వ్యాకోచం చెందిందని గుర్తించినట్లు పేర్కొన్నారు. కార్డియాక్ రీమోడలింగ్ చికిత్స ద్వారా గుండె పరిమాణాన్ని తగ్గించామన్నారు. 6 గంటలపాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో ఆమెకు బైపాస్ సర్జరీ, కార్డియాక్ అనాటమీ పునరుద్ధరణ, మిట్రల్ వాల్వ్ రిపేర్ తదితర ప్రక్రియలు జరిపినట్లు తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకొని, ఏడాదిగా ఆరోగ్యంగా జీవిస్తోందన్నారు. గుండె వైఫల్యం అనేది అతికొద్ది మందిలో మాత్రమే వస్తుందని, అప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. అన్ని రకాల వైద్యులు, అధునాతన వైద్య సదుపాయాలు యశోద ఆస్పత్రిలో ఉండటం వల్లే ఇలాంటి ఆపరేషన్లు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. అనంతరం లత మాట్లాడుతూ.. తాను బతుకుతానని అనుకోలేదని, యశోద ఆస్పత్రి వైద్యులు అందించిన వైద్యంతో ఇప్పుడు సాధారణ జీవితాన్ని గడపడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
అర్ధరాత్రి ఆపన్నహస్తం.. గ్రీన్‌ఛానెల్‌తో గుండెను తరలించిన మెట్రో
సాక్షి,హైదరాబాద్: నగరవాసులకు అవసరమైన సహాయం చేయడానికి తామెప్పుడూ ముందే ఉంటామని మరోసారి ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైల్ నిరూపించింది. గతంలో ఫిబ్రవరి 2021లో ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ నుంచి ఓ ప్రాణం కాపాడటానికి గుండెను తరలించాలని ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ ఎస్ఓఎస్కు కాల్ వచ్చిందో అదే తరహాలో మరోసారి కాల్ వచ్చింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో.. సెప్టెంబర్ 26న తెల్లవారుజూమున గ్రీన్ ఛానెల్ ఏర్పాటుచేయడంతో నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌కు గుండెను రవాణా చేసింది. కాగా, గుండె తరలింపులో భాగంగా ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ డాక్టర్లు , ఇతర మెడికోలు.. రాత్రి ఒంటి గంట సమయంలో నాగోల్ మెట్రోస్టేషన్ వద్దకు గుండెను తీసుకువచ్చారు. అనంతరం, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి కేవలం 25 నిమిషాల్లోనే గుండెను ప్రత్యేక రైలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్‌కు చేర్చారు. తర్వాత, అంబులెన్స్ సాయంతో ఆసుపత్రికి చేర్చారు. ఈ స్పెషల్ ఆపరేషన్ కోసం లైన్-3 సెక్యూరిటీ అధికారులతో పాటుగా మెట్రో అధికారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగేలా చేశారు. ఈ సందర్భంగా ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రయాణీకుల సేవకు హైదరాబాద్ మెట్రో రైల్ కట్టుబడి ఉంటుంది. అవసరమైన సమయంలో వారికి సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. మా అవసరం ఎక్కువగా ఉన్నవారికి, అవసరమైన సమయంలో తోడుండాలనేది మా సిద్ధాంతం. ఈసారి కూడా మేము గ్రీన్‌ఛానెల్ ఏర్పాటుచేయడంతో పాటుగా వీలైనంత త్వరగా గుండెను తరలించి, ఓ ప్రాణం కాపాడాము. ప్రాణంతో ఉన్న అవయవాన్ని తరలించడంలో తోడ్పడిన డాక్టర్లు, హెచ్ఎంఆర్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము’ అని అన్నారు. కాగా, ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులోనే ఉన్నాయి. ఓవైపు.. క్రికెట్ అభిమానులకు తరలిస్తూనే.. అటు మెట్రో అధికారులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడం విశేషం. మ్యాచ్ సందర్భంగా దాదాపు 20వేల మంది క్రికెట్ ఫ్యాన్స్ మెట్రో ప్రయాణించినట్టు సమాచారం. -
స్టెంట్ వేశాక మళ్లీ పూడుకుపోతే..?
అన్ని అవయవాలకు అందినట్లే గుండెకు కూడా రక్తం నిరంతరం అందుతుండాలి. ఒక్కోసారి గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో పూడిక చేరినప్పుడు స్టెంట్లు వేసి, గుండె కండరానికి రక్తం నిరంతరాయంగా అందేలా చూస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇలా స్టెంట్లు వేసినప్పటికీ... అవి మళ్లీ పూడుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు అందుకు కారణాలను కనుగొని, స్టెంట్లలో ఏర్పడ్డ పూడికలను తొలగించి, ఆ రక్తనాళాలు మళ్లీ పూడుకుపోకుండా చేసేందుకు అందుబాటులో ఉన్న చికిత్సల గురించి కథనమిది. గుండెకు రక్తాన్ని చేరవేసే ప్రధాన ధమనుల్లో ఎక్కడైనా పూడికలు ఏర్పడినప్పుడు... సాధారణంగా యాంజియోప్లాస్టీ అనే చికిత్స ప్రక్రియ ద్వారా స్టెంట్ వేసి, సన్నబడ్డ రక్తనాళాన్ని మళ్లీ విచ్చుకునేలా చేస్తారు. అయితే స్టెంట్ వేశాక... మళ్లీ ఆ రక్తనాళం పూడుకుపోకుండా డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు సూచిస్తారు. ఉదాహరణకు మధుమేహాన్ని, అధికరక్తపోటును అదుపులో పెట్టుకోవడం, స్మోకింగ్, మద్యం అలవాట్లను పూర్తిగా మానేయడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, మళ్లీ కొవ్వు పేరుకోడాన్ని నివారించేందుకుగాను కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు చెబుతారు. అయితే స్టెంట్ వేశాక కొంతమంది బాధితులు ఈ నియమాలన్నింటినీ పాటించరు. దాంతో... నియమాలు పాటించని వారిలో మళ్లీ పూడికలు వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన లక్షణాలు హఠాత్తుగా ఛాతీలో నొప్పి చెమటలు పట్టడం వాంతులు దీర్ఘకాలికమై లక్షణాలు శ్వాసలో ఇబ్బంది ఛాతీలో అసౌకర్యం నడక, కదలికల సమయంలో ఆయాసం తమ కదలికలు కేవలం కొద్ది దూరాలకు మాత్రమే పరిమితమైపోవడం. నిర్ధారణ పరీక్షలు ఈసీజీ ఎకోకార్డియోగ్రామ్ కరొనరీ యాంజియోగ్రామ్ పూడికలు ఎక్కడ వస్తాయంటే...? ఒక్కోసారి ఇలా వేసిన స్టెంట్లోనే మళ్లీ పూడిక రావచ్చు. లేదా స్టెంట్‌కు పరిసర ప్రాంతాల్లో రెండోసారి పూడికలు రావచ్చు. స్టెంట్ వేశాక కూడా ఇలా రక్తనాళాలు తిరిగి మూసుకుపోవడానికి 3 నుంచి 5 శాతం వరకు అవకాశాలుంటాయి. ఇన్స్టెంట్ స్టెనోసిస్ అంటే... స్టెంట్ వేశాక ఏర్పడే పూడిక... స్టెంట్ లోపలగానీ లేదా దానికి 5 మిల్లీమీటర్ల పరిధిలోగానీ, స్టెంట్ అంచుల్లోగానీ ఏర్పడితే దాన్ని ఇన్స్టెంట్ స్టెనోసిస్ అంటారు. ఈ పూడికను కరొనరీ ఇమేజింగ్ పద్ధతుల ద్వారా దాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. కరొనరీ ఇమేజింగ్ అంటే ‘ఇంట్రావాస్క్యులార్ అల్ట్రాసౌండ్’ లేదా ‘ఆప్టికల కొహరెన్స్ టోమోగ్రఫీ’ అనే ఇమేజింగ్ ప్రక్రియలు. ఇలా స్టెంట్ లోపలగానీ లేదా చుట్టుపక్కల గానీ, అంచుల్లోగానీ పూడికలు మళ్లీ ఏర్పడటానికి కారణం... స్టెంట్ అవసరమైనంత మేరకు వ్యాకోచించకపోవడం అన్నమాట. ఇలా జరగడాన్ని ‘స్టెంట్ అండర్–ఎక్స్‌ప్యాన్షన్’ అంటారు. అలాగే స్టెంట్ ఫ్రాక్చర్‌కు గురికావచ్చు కూడా. స్టెంట్ పొడవు 30 మిల్లీమీటర్లకు మించినప్పుడు అది తిరిగి పూడుకుపోయే అవకాశాలు కొంతమేర ఎక్కువ. అలాగే ఒకటికి మించి... రెండు స్టెంట్లు వేసిన సందర్భాల్లోనూ ఒకదాని పైకి ఒకటి వచ్చేలా (ఓవర్‌ల్యాప్ చేస్తున్నట్లుగా) వేసిన సందర్భాల్లోనూ ఇలా మరోసారి పూడిక చేరేందుకు అవకాశాలు ఎక్కువ. అలాగే స్టెంట్ వేసినప్పుడు, అందులో ఎముకల తాలూకు అవశేషాలు పేరుకుని ఉన్నట్లయితే, స్టెంట్ అవసరమైన మేరకు వ్యాకోచించడానికి అది అడ్డంకిగా మారవచ్చు. అలాంటిప్పుడు దాన్ని సరిచేయకపోతే... ఆ తర్వాతి కాలంలో తిరగి పూడికలు ఏర్పడేందుకు అవకాశాలు ఎక్కువ. స్టెంట్ లోపల మరో స్టెంట్... ఈ ప్రక్రియను వైద్యులు చివరి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. సాధారణంగా స్టెంట్లోపల మరోస్టెంట్ వేయడం వల్ల రక్తనాళం మరింత ఇరుగ్గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా రక్తనాళం తిరిగి పూడుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మిగతా ఏ విధానాలూ పనిచేయని సందర్భాల్లో మాత్రమే అరుదుగా ఇలా రీస్టెంటింగ్ ప్రక్రియను చివరగా ఉపయోగిస్తారు. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్... స్టెంట్లలో రెండురకాలు ఉంటాయి. అవి... బేర్ మెటల్ స్టెంట్స్, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్. ప్రస్తుతం బేర్ మెటల స్టెంట్లు అందుబాటులో లేవు. అయితే ఈ బేర్ మెటల్ స్టెంట్లు తిరిగి పూడుకుపోయేందుకు అవకాశాలు ఎక్కువ. వీటిలో కణజాలం పెరగకుండా నిరోధించడం అసాధ్యం. అందుకే బేర్ మెటల్ స్టెంట్లకు బదులుగా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్లు వాడుకలోకి వచ్చాయి. ఈ స్టెంట్లలో ఉండే ఔషధ పదార్థం (డ్రగ్) మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు విడుదలవుతూ... స్టెంట్లోపల కణజాలం పెరుగుదలను నియంత్రిస్తుంది. తద్వారా ఇది చాలాకాలంపాటు పూడుకుపోకుండా ఉంటుంది. ఇలాంటి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్లు వేయించుకున్న రోగుల్లో, తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు కేవలం 3 నుంచి 5 శాతం మేరకే ఉంటాయి. కానీ బేర్ మెటల్ స్టెంట్లు వేయించుకున్నవారిలో తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు 30 శాతం వరకు ఉంటాయి. అందుకే ఇవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. లేజర్‌తో పూడిక తొలగింపు.... స్టెంట్లో కణజాలం మళ్లీ పెరిగి. అవి మళ్లీ పూడుకుపోయే కండిషన్‌ను ‘టిష్యూ హైపర్‌ప్లేసియా’ అంటరు. ఇలాంటి కండిషన్‌ను లేజర్‌తో చక్కదిద్దవచ్చు. తొలత లేజర్లను ఉపయోగించి పూడికను తొలగించాక... ఆ తర్వాత డ్రగ్ పైపూతగా ఉన్న బెలూన్ల సహాయంతో స్టెంట్ లోపలి పొరల్లోకి ఔషధపదార్థాన్ని పంపుతారు. ఇందుకోసం ‘పాక్లిటాక్సెల లేదా ‘సిరోలిమస్’ అనే ఔషధాలను (డ్రగ్స్)ను వైద్యులు ఉపయోగిస్తారు. ఇన్స్టెంట్ స్టెనోసిస్‌కు చికిత్స ఇలా... కరొనరీ ఇమేజింగ్ ద్వారా స్టెంట్ తగినంతగా వ్యాకోచించలేదని గుర్తిస్తే... అప్పుడు ఆ స్టెంట్ తాలూకు అండర్–ఎక్స్‌ప్యాన్షన్ కండిషన్‌కు చికిత్స చేసి, సరిదిద్దాల్సి ఉంటుంది. అంతే తప్ప పాత స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ ఏర్పటు చేయడం సరికాదు. కాబట్టి స్టెంట్ అండర్–ఎక్స్ప్యాన్షన్కు తగిన కారణాలను కనిపెట్టి, వాటిని సరిదిద్దాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో స్టెంట్ చుట్టూరా క్యాల్షియమ్ లేదా దృఢ కణజాలం పేరుకుపోయి స్టెంట్ తగినంతగా వ్యాకోచించడానికి అడ్డుపడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఒత్తిడితో కూడిన బెలూన్ల సహాయంతో స్టెంట్‌ను తిగిరి వ్యాకోచించేలా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో రొటాబ్లేషన్, కటింగ్ బెలూన్ల వంటి ప్రక్రియలతో స్టెంట్‌ను తగినంతగా వ్యాకోచించేలా చేయవచ్చు. -డాక్టర్ ఎ. శరత్‌రెడ్డి, సీనియర్ కార్డియాలజిస్ట్ -
ఈఎంఎం బ్లడ్ గ్రూప్.. ఎప్పుడైనా విన్నారా?
అహ్మదాబాద్: మనుషుల్లో బ్లడ్ గ్రూప్‌లు సాధారణంగా ఏ, బీ, ఓ, లేదా ఏబీ అని ఉంటాయని అందరికీ తెలుసు. కానీ, గుజరాత్‌కు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తిలో కొత్తరకం బ్లడ్ గ్రూప్ కనుగొన్నారు వైద్యులు. దేశంలోనే అరుదైన రక్తం కలిగిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అయితే.. ఇలా ప్రత్యేక రక్త సమూహం కలిగిన వ్యక్తులను గుర్తించటం ప్రపంచవ్యాప్తంగా ఇది 10వ కేసుగా పలు నివేదికలు వెల్లడించాయి. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తిలో 'ఈఎంఎం నెగెటివ్' బ్లడ్ గ్రూప్‌ను కనుగొన్నారు వైద్యులు. సాధారణంగా మానవ శరీరంలో నాలుగు రకాల బ్లడ్ గ్లూప్‌లు ఉంటాయి. అందులో ఏ, బీ, ఓ, ఆర్‌హెచ్, డఫ్పీ అంటూ 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. అలాగే.. ఈఎంఎం అధికంగా ఉండే 375 రకాల యాంటీజెన్లు ఉంటాయి. ఈఎంఎం నెగెటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు ఇతరులకు తన రక్తాన్ని ఇవ్వలేరు.. ఇతరుల నుంచి తీసుకోలేరు. ఎలా నిర్ధారించారు? రాజ్‌కోట్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరారు. గుండె ఆపరేషన్ చేయాల్సి రావటం వల్ల రక్తం అవసరమైంది. ఆసుపత్రిలోని ల్యాబ్‌లో రక్తం పరీక్షించగా గ్రూప్ తెలుసుకోలేకపోయారు. దీంతో రక్తం నమూనాలను సూరత్‌లోని రక్త నిధి సేకరణ కేంద్రానికి పంపించినట్లు అక్కడి వైద్యులు సన్ముఖ్ జోషీ తెలిపారు. ఆ రక్తాన్ని పరీక్షించగా ఏ గ్రూప్‌తోనూ సరిపోలలేదు. దీంతో వృద్ధుడితో పాటు అతడి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను అమెరికాకు పంపించినట్లు చెప్పారు జోషీ. దీంతో అరుదైన బ్లడ్ గ్రూప్‌గా తేలిందన్నారు. రక్తంలో ఈఎంద్ లేకపోవటం వల్ల దానిని ఈఎంఎం నెగెటివ్‌గా ఐఎస్బీటీ నామకరణ చేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 10 మంది మాత్రమే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 మందిలో మాత్రమే ఇలాంటి అరుదైన ప్రత్యేక బ్లడ్ గ్రూప్‌లను కనుగొన్నారు. తాజాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తిలో అలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్‌ను కొనుగొన్న నేపథ్యంలో ఆ సంఖ్య 10కి చేరింది. ఇదీ చూడండి: ప్లాస్టిక్‌ను తినేసే 'రోబో ఫిష్'.. సముద్రాల స్వచ్ఛతలో కీలక అడుగు! -
గుండెమార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్త పుంతలు
గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. మానవుల నుంచి మానవులకు గుండెమార్పిడి ఎప్పటినుంచో జరుగుతున్నదే. కానీ... ఓ వ్యక్తి బ్రెయిన్‌డెడ్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. అందుకే జంతువుల నుంచి కూడా గుండె సేకరించి, మనుషులకు అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట్లో ఓ చింపాంజీ నుంచి గుండె సేకరించి, ఓ చిన్నారికి అమర్చగా ఆమె18 నెలలు బతికింది. అలాగే ఇటీవల పంది నుంచి గుండె సేకరించి అమర్చిన వ్యక్తి రెండు నెలల పాటు జీవించాడు. ఇది కొద్దిపాటి పురోగతే. కానీ మరింత ప్రగతి సాధించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గుండెమార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్తపుంతలు చోటు చేసుకుంటున్నాయి. అవేమిటో చూద్దాం. గుండెమార్పిడి అనే మాట వినగానే భయాందోళన కలిగే రోజులు పోయాయి. గుండె పూర్తిగా విఫలమైన తర్వాత... ఇక అన్ని మార్గాలూ మూసుకుపోయినప్పుడు అత్యుత్తమ చివరిప్రయత్నంగా గుండె మార్పిడి చికిత్సను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారుగా మూడువేల గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అయితే డిమాండ్‌కు అనుగుణంగా దాతలు అందుబాటులో లేనందున అనేకమంది బాధితులు గుండె మార్పిడి కోసం వేచి ఉండాల్సి వస్తోంది. గుండెమార్పిడి శస్త్రచికిత్సల పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేనందువల్ల అవసరమైనప్పుడు గుండె మార్పిడిని ఆశ్రయించడానికీ లేదా అవయవ దాతలుగా నమోదు కావడానికి ఎక్కువమంది ముందుకు రావడం లేదు. గుండెమార్పిడి పురోగతిలో రకరకాల మైలురాళ్లివి... ∙డొనేషన్ ఆఫ్టర్ సర్క్యులేటరీ డెత్: మామూలుగా అవయవ దానం చేయాలంటే మెదడు చనిపోయినప్పటికీ గుండె కొట్టుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. కొన్నిసార్లు మెదడు చనిపోయిన తర్వాత అవయవాల్ని దానం కోసం బయటకు తీసే లోపలే గుండె కొట్టుకోవడం ఆగిపోతే మాత్రం ఆ అవయవాలు దానానికి పనికిరావు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి అమల్లోకి వచ్చిన ప్రక్రియే ‘డొనేషన్ ఆఫ్టర్ సర్క్యులేటరీ డెత్’! దీనివల్ల అవయదానం చేసేటప్పటికి గుండె ఆగిపోయినప్పటికీ అవయవాల్ని దానం కోసం వినియోగించుకోగలుగుతారు. మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్: గుండెమార్పిడి అవసరమైన వ్యక్తులలో గుండె బాగా బలహీనంగా ఉంటుంది. అందువల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్తసరఫరా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా గుండె మార్పిడి తర్వాత కూడా గుండె తప్ప మిగతా అవయవాలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు గుండె మార్పిడి శస్త్రచికిత్సకు ముందుగా... గుండెకి మరింత ఆలంబనగా ఉండేందుకు కొన్ని ఉపకరణాలు ఉపయోగపడతాయి. ఇవే‘మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్’ పరికరాలు. వీటిలో ఐ.ఏ.బి.పి., ఇంపెల్లా, ఎక్మో, ఎల్ వాడ్లు వంటివి ప్రధానమైనవి. వైఫల్యం చాలా ఎక్కువగా ఉన్న గుండెలకు మెకానికల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఈ పరికరాలు గుండె మార్పిడి ప్రక్రియ సఫలమయ్యే అవకాశాన్ని మరింత పెంచుతాయి. ఏబీఓ ఇన్‌కంపాటిబుల్ ట్రాన్స్‌ప్లాంట్: సాధారణంగా గుండెమార్పిడికి ముందు డోనార్ వయసు, జెండర్, బరువు జాగ్రత్తగా పరిశీలిస్తారు. వీటితోపాటు బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా దాతను ఎంపిక చేసుకోవడం అవసరం. అయితే ఇప్పుడిప్పుడే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా ట్రాన్స్‌ప్లాంట్ చేసే అవకాశం ఉందని వైద్యులు గుర్తిస్తున్నారు. ప్రయాణంలోనూ బ్రతికి ఉండే గుండె: సాధారణంగా దాత నుంచి తీసుకున్న గుండెను స్వీకర్త దగ్గరికి తీసుకు వెళ్లడానికి ఐస్ బాక్స్‌ను ఉపయోగిస్తారు. ఇందులో స్వీకర్తకు అమర్చేందుకు 6 గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ‘ఆర్గాన్ కేర్ సిస్టమ్’ అనే కీలక ఉపకరణం అందుబాటులోకి వచ్చింది. దాంతో దాత నుంచి బయటకు తీసిన తర్వాత కూడా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పాటు గుండె బతికే ఉంటుంది. ఇతర జీవజాతుల నుంచి గుండె మార్పిడి: మనుషుల నుంచి సేకరించే అవయవాలు గుండె మార్పిడికి సరిపోకపోవడంతో ఇతర జీవజాతుల నుంచి స్వీకరించిన గుండెని మనిషికి అమర్చడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒకేసారి రెండు ట్రాన్స్ప్లాంట్లు: అవసరాన్ని బట్టి కొంతమంది రోగుల్లో గుండెతోపాటు ఊపిరితిత్తులనూ మార్చాల్సి రావచ్చు. మరికొంతమందిలో గుండెతోపాటుగా కిడ్నీ లేదా లివర్ మార్చాల్సిన అవసరం పడవచ్చు. గతంలో పేషెంట్స్‌కి ఒకేసారి రెండు ట్రాన్స్ప్లాంట్లు చేయడం చాలా కష్టసాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు వేర్వేరు వైద్యవిభాగాలకు చెందిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు కలిసి పనిచేయడంతో ఇలాంటి ట్రాన్స్ప్లాంట్లూ సులువవుతున్నాయి. రిజెక్షన్ నివారణకు కొత్త పద్ధతులు సాధారణంగా బయట నుంచి వచ్చిన కొత్త గుండెను స్వీకర్త శరీరం అంత తేలిగ్గా అంగీకరించదు. అది తన సొంత అవయవం కాదంటూ నిరాకరిస్తూ ఉంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘రిజెక్షన్’ అంటారు. దీన్ని నివారించడానికి ఇప్పుడు కొత్త కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో సీఎస్ఐ ( సైరోలిమస్, టాక్రోలిమస్ వంటివి), ఎంటార్ ఇన్హిబిటార్స్, వాటితోపాటు స్టెరాయిడ్స్ కూడా ముఖ్యమైనవి. ఈ మధ్యనే చెక్–పాయింట్ మాలిక్యూల్స్ కూడా ‘ట్రాన్ప్లాంట్స్ రిజెక్షన్’ని నివారించడానికి ఉపయోగిస్తున్నారు. ఇవి కాకుండా థైమస్ గ్రంథి పనిచేయని పిల్లల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్తోపాటు అదే దాత నుంచి సేకరించిన థైమస్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేసినట్లయితే రిజెక్షన్ తక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. రిజెక్షన్‌ని గుర్తించడానికి తేలిక మార్గాలు: గతంలో గుండెమార్పిడి తర్వాత రిజెక్షన్‌ని గుర్తించడానికి... దాత గుండె బయాప్సీ మాత్రమే ఒకే ఒక మార్గం. అయితే ఇప్పుడు కొత్త కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. జీన్ ఎక్స్ప్రెషన్ ప్రొఫైల్ (జీఈపీ) ద్వారా ఓ మామూలు రక్తపరీక్షతోనే రిజెక్షన్‌ను గుర్తించవచ్చు. అది మాత్రమే కాకుండా దాత మూత్రం, రక్తంలో ‘సెల్ ఫ్రీ డిఎన్ఏ’ గుర్తించడం ద్వారా కూడా రిజెక్షన్‌ని తెలుసుకోవచ్చు. ఇమ్యూన్ టాలరెన్స్: మన రోగనిరోధక శక్తే... మనలోకి వచ్చిన కొత్త అవయవాన్ని నిరాకరిస్తూ ఉంటుంది. ఇలా జరగకుండా చూసేందుకు ట్రాన్స్‌ప్లాంట్ సమయంలో ఇమ్యూనిటీని తగ్గించే మందులు వాడుతుంటారు. ఇలాంటి మందులేమీ వాడకుండానూ, అలాగే రిజెక్షన్ కూడా రాకుండా చూసే పద్థతులను ‘ఇమ్యూన్ టాలరె¯Œ ్స’ అని పిలుస్తారు. దీన్ని సాధించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాత తాలూకు బోన్ మ్యారోను కూడా గుండెతో ట్రాన్స్‌ప్లాంట్ చేయడం వల్ల కూడా‘ఇమ్యూన్ టాలరె¯Œ ్స’కి అవకాశముంటుందని ఇటీవలి కొన్ని కొత్త పరిశోధనల వల్ల తెలుస్తోంది. ఇప్పుడు సక్సెస్ రేటూ ఎక్కువే... అందుకు కారణాలివి... మన దేశంలోనూ గతంలో పోలిస్తే ఇప్పుడు మరింత మెరుగ్గా, మరింత ఎక్కువ విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్సలో జరుగుతున్నాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత దాదాపు 88 శాతం మంది మొదటి ఏడాది బతికే అవకాశం ఉంటుంది. అంతేకాదు గుండెస్వీకర్తల్లో దాదాపు 75 శాతం మంది ఐదేళ్లకు పైగా జీవించడం విశేషం. ఈ సక్సెస్ రేటు ఇంత మెరుగ్గా ఉండటానికి అనేక కారణాలు దోహదపడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి... గతంలో పోలిస్తే మరింత మెరుగైన రీతిలో జరుగుతున్న శస్త్రచికిత్స ప్రక్రియలూ, అలాగే శస్త్ర చికిత్సల తరువాత వాడే కొత్త మందులు ప్రధానమైన కారణాలు. తగ్గుతున్న ఖర్చులు: గతంలో గుండెమార్పిడి శస్త్రచికిత్స అంటే... దాదాపు 35 నుంచి 40 లక్షలు అయ్యేవి. ఇప్పుడీ ప్రక్రియ అనేక ఆసుపత్రుల్లోకి అందుబాటులో రావడంతో రూ. 20 లక్షలకే చేయడం సాధ్యపడుతోంది. దీంతోపాటు ట్రాన్స్‌ప్లాంట్ అనంతర చికిత్స తాలూకు ఖర్చులూ కొంతమేర తగ్గడంతో... ఇది మరింత ఎక్కువమంది బాధితులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇలా కొత్తపురోగతులు వస్తుండటంతో ఖర్చు తగ్గుతుండటం అనేది చాలామంది బాధితులకు కనిపిస్తున్న ఓ భవిష్యత్ ఆశారేఖ. -డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
విశాఖలో హార్ట్ వాల్వుల తయారీ యూనిట్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆసియాలోనే అతి పెద్ద గుండె వాల్వుల తయారీకి విశాఖపట్నం కేంద్రం కానుంది. విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్)లో వివిధ రకాల వాల్వుల తయారీ యూనిట్ ఏర్పాటుకు ట్రాన్స్‌లూమినా సంస్థ ఇటీవల భూమిపూజ చేసింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ పనులను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. అనంతరం వాల్వుల తయారీ ప్రారంభించే అవకాశం ఉంది. అంటే 2023లో విశాఖపట్నం నుంచే హార్ట్ వాల్వులు తయారుకానున్నాయి. ఈ యూనిట్లో ట్రాన్స్‌కేథటర్, మిట్రల్, ట్రైకుస్పిడ్ వాల్వులను తయారు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి పెట్టనున్నారు? ఎంతమందికి ఉపాధి లభిస్తుందనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. బైపాస్ సర్జరీ అవసరం లేకుండానే.. వాస్తవానికి గుండె వాల్వులకు సమస్య వస్తే బైపాస్ సర్జరీ చేయడం పరిపాటి. ఈ ప్రక్రియలో ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి రావడంతోపాటు భారీగా కోతలు పడతాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కేథటర్ హార్ట్ వాల్వ్ ఇంప్లాంటేషన్ ప్రక్రియ ముందుకొచ్చింది. ఈ వాల్వుల వల్ల బైపాస్ సర్జరీ అవసరం లేకుండానే.. చిన్నపాటి రంధ్రంతో ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండా గుండె శస్త్రచికిత్స పూర్తిచేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ యూనిట్లో ప్రధానంగా ట్రాన్స్‌కేథటర్ వాల్వులను తయారు చేయనున్నట్టు ట్రాన్స్‌లూమినా కంపెనీ ఎండీ గుర్మీత్‌సింగ్ చాగ్ ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నూతన తరహా వాల్వుల తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు, నిపుణులతో సంప్రదించామని ఆయన వెల్లడించారు. -
చిన్నారి గుండెకు శ్రీవారి అభయం
తిరుపతి తుడా: చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు, సంబంధిత చికిత్సల కోసం ఇక పొరుగు రాష్ట్రాల్లోని మహానగరాలకు వెళ్లాల్సిన పనిలేదు. అత్యాధునిక వైద్య సామర్థ్యంతో చిన్నపిల్లల హృదయాలయాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి బర్డ్ ఆస్పత్రి వేదికగా శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ఏర్పాటు చేసింది. చిన్నారుల గుండెకు చిల్లులుపడి సరైన చికిత్స అందక ప్రాణాలను వదులుకునే పరిస్థితిని చూసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలించిపోయారు. ఇలాంటి పిల్లలకు ఉచితంగా చికిత్స అందించేలా ఆరోగ్యశ్రీని అమలు చేశారు. వేలమందికి పునర్జన్మను ప్రసాదించారు. చిన్నారుల గుండెకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని భావించారు. అదేబాటలో నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నపిల్లల కోసం ప్రత్యేక కార్డియాక్ సెంటర్ ఏర్పాటుకు సంకల్పించారు. ఈ బాధ్యతల్ని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డికి అప్పగించారు. ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ఆరునెలల్లో ప్రారంభానికి సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ చిన్నపిల్లలకు ప్రత్యేక కార్డియాక్ సెంటర్ ఇప్పటివరకు లేని లోటును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చారు. తిరుపతిలో ఏర్పాటైన శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ఈనెల 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. చిన్నపిల్లల కార్డియోథొరాసిక్ సర్జన్లు ముగ్గురు, కార్డియాక్ నిపుణులు, పీడియాట్రీషియన్లు, మత్తు వైద్యనిపుణులు ఐదుగురు వంతున, మెడికల్ ఆఫీసర్లు 10 మంది, నర్సులు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది 185 మందితో ఆస్పత్రిని సిద్ధం చేశారు. దేశంలోని ప్రముఖ చిన్నపిల్లల కార్డియాక్ వైద్యనిపుణుల సేవలను కూడా ఉపయోగించుకోనున్నారు. ఉచితంగా ఆస్పత్రికి వచ్చి చిన్నపిల్లలకు అరుదైన ఆపరేషన్లు చేసేందుకు వీలుగా వైద్య నిపుణులను ఆహ్వానిస్తూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ విధానం ప్రస్తుతం బర్డ్ ఆస్పత్రిలో విజయవంతంగా నడుస్తోంది. -
సుధీర్‌బాబు గొప్పమనసు, చిన్నారి గుండె ఆపరేషన్‌కు సాయం
సాక్షి, శ్రీకాకుళం: ఆపదలో ఉన్న చిన్నారికి సినీ నటుడు సుధీర్‌బాబు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండగా నిలిచారని జిల్లా సుధీర్‌బాబు సేవా సమితి గౌరవాధ్యక్షుడు ఉంకిలి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన డి.మోసె, లక్ష్మి దంపతుల కుమార్తె సంస్కృతి జాస్మిన్‌కు గుండె ఆపరేషన్ కోసం మే నెలలో రూ.1.70లక్షలు చెల్లించారని, తాజాగా చిన్నారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ.1.50 లక్షలను శ్రీకాకుళంలోని హెడ్‌పోస్టాఫీసులో ఫిక్సిడ్ డిపాజిట్ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబుకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అద్యక్షుడు మహ్మద్ షాజు తదితరులు పాల్గొన్నారు. -
సర్జరీ తర్వాత మాట సరిగా రావడం లేదు
నాకు ఈమధ్యే గుండెకు సంబంధించిన సర్జరీ అయ్యింది. ఆ తర్వాత నుంచి ఎంత ప్రయత్నించినా మాట సరిగా రావడం లేదు. ఆ మాట కూడా గాలిలా వస్తోంది. అంతకముందు నాకు ఎప్పుడూ గొంతుకు సంబంధించిన సమస్యలు లేవు. ఇదేగాక... తినేటప్పుడు, తాగేటప్పుడు, మింగే సమయంలో ఇబ్బందిగా ఉంది. గొంతుకు ఏదో అడ్డు పడినట్లుగా ఉంది. నాకు తగిన పరిష్కారం చూపండి.– కె.వి.జె. రాజు, గుంటూరు మీ సమస్యకు సంబంధించిన వివరాలు పరిశీలించాక మీకు స్వరపేటికలోని ఒక భాగం అయిన ‘వోకల్ ఫోల్డ్’లో సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్ హార్ట్ సర్జరీ), ట్రకియాస్టమీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్స్‌లో కొన్నిసార్లు వోకల్ఫోల్డ్కు ఒత్తిడి తగలడం లేదా అది దెబ్బతినడానికి అవకాశాలు ఎక్కువ. మీకు కూడా అలాగే జరిగినట్లుగా అనిపిస్తోంది. దీనివల్ల మీరు చెప్పిన విధంగానే మింగడం, మాట్లాడటంలో సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు వోకల్ ఫోల్డ్ పెరాలసిస్ రావడానికి అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి మొదట మీరు అనుభవజ్ఞులైన ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించండి. మీకు అవసరాన్ని బట్టి లారింగోస్కోపీ, ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అంతేకాదు... మీరొకసారి స్పీచ్ థెరపిస్ట్‌ను సంప్రదించి అవసరమైన ఎక్సర్సైజ్లు కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మాట్లాడుతుంటే నత్తి వస్తోంది... పరిష్కారంచూపండి నేను బీటెక్ చదువుతున్నాను. నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడుతుంటే నాకు నత్తిలా వస్తోంది. వేగంగా మాట్లాడటం కష్టమవుతోంది. నా చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది. భవిష్యత్తులో ఉద్యోగం, కెరియర్ గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉంటోంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా బాధపడుతున్నాను. నాకు తగిన పరిష్కారం చూపండి.– డి. విశాల్, సికింద్రాబాద్ మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. దీనికి గల ముఖ్యకారణాల్లో జన్యుపరమైన అంశం ప్రధానమైనది. మీరు మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోడానికి మొదట అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించవలసి ఉంటుంది. కొన్ని సార్లు అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. మీరు దీని గురించి మానసికంగా బాధపడితే ఈ సమస్య ఎక్కువవుతుంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషించండి. స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల నుంచి కౌన్సెలింగ్ తీసుకుని వారు చెప్పినట్లుగా ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. ముక్కులోఏదో అడ్డంపడినట్లుగాఉంటోంది... నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా ఈ సమస్య వదలడం లేదు. చాలా రకాల మందులతో పాటు డాక్టర్ సలహా మేరకు ముక్కులోకి చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు.– డి. శివరామ్, నేలకొండపల్లి ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్నిరకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. తరచూ జలుబు చేస్తోంది... తగ్గేదెలా? నాకు తరచూ జలుబు చేస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. రోజువారీ పనులు చేసుకోలేక పోతున్నాను. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికితోడు ఈ మధ్య చాలా నీరసంగా కూడా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.– కె.ఆర్. శ్రీనివాసమూర్తి, అమలాపురం మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య ఇబ్బంది పెడుతోంది అన్నారు కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దానివల్ల ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండుభాగాలను కూడా సమస్యకు గురిచేస్తుంది. మీరు చెప్పినట్లుగా యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. పైగా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. దాంతోపాటు మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. డాక్టర్ ఇ.సి. వినయ కుమార్హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్,అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం
‘అహ నా పెళ్ళంట!’ (1985) సినిమాతో వస్తూనే తెలుగు తెరౖపై నవ్వులు పూయించారు హాస్యనటులు బ్రహ్మానందం. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. దాదాపు వెయ్యిచిత్రాలు చేసిన బ్రహ్మానందం ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా నటుడిగా ఫామ్‌లో ఉన్నారు. ఇటీవలే ‘గ్రేట్ తెలుగు లాఫ్టర్ చాలెంజ్’ షోతో బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. గుండెలో నొప్పి అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్ని సంప్రదించారట బ్రహ్మానందం. శస్త్రచికిత్స ఇక్కడ చేయించుకుంటే అభిమానుల రాకపోకలు, వారి ఆందోళనతో ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఆయన ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. నేడు ఐసీయు నుంచి సాధారణ గదికి మారనున్నారు. ‘‘ఆదివారం ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో బ్రహ్మానందంగారిని ఆస్పత్రిలో జాయిన్ చేశాం. ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది’’ అని బ్రహ్మానందం కుటుంబ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు. -
గుండె చికిత్సలో రికార్డు
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి గుండె ధమనులు రెండూ పూర్తిగా పూడుకుపోవడం, అలాగే గుండెలోని చెడు, మంచి రక్తాలను వేరుచేసే గోడకు రంధ్రం ఏర్పడటం వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏకకాలంలో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత నిమ్స్ మాజీ కార్డియాలజీ హెడ్, ఇండో–యూఎస్ సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ విభాగ ప్రస్తుత హెడ్ డాక్టర్ శేషగిరిరావుకు దక్కింది. ఇటువంటి సంక్లిష్టమైన చికిత్స చేసిన విషయంపై వైద్య చరిత్రను, జర్నల్స్‌ను పరిశీలించామని, కానీ ఆపరేషన్ విజయవంతమైన రికార్డు ఎక్కడా నమోదు కాలేదని శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడం తమనే నివ్వెర పరుస్తోందన్నారు. పైగా తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేసినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు శుక్రవారం డాక్టర్ శేషగిరిరావు విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం పట్టణానికి చెందిన 81 ఏళ్ల అనసూయమ్మకు గుండెపోటు రావడంతో స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకొని ఇండో–యూఎస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చారన్నారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసి చూడగా రెండు ధమనులు మొదట్లోనే పూడుకుపోయాయన్నారు. ఇలా రెండూ పూడుకుపోవడం వెయ్యిలో ఒకరిద్దరు రోగులకు మాత్రమే వస్తుందన్నారు. పైగా బీపీ స్థాయి 60కి పడిపోవడంతో తాము కంగారు పడ్డామన్నారు. మరోవైపు గుండె గోడలకు రంధ్రం ఏర్పడటంతో పరిస్థితి విషమించిందన్నారు. కానీ వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముగ్గురు సభ్యుల వైద్యుల బృందం కలిసి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించామన్నారు. సాధారణంగా కాలి నుంచి ఆపరేషన్ చేస్తామని, కానీ ఈ కేసులో మెడ రక్తనాళాల నుంచి గుండెకు పడిన రంధ్రాన్ని పూడ్చామన్నారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కాలు విరిగి వెళ్తే.. గుండె ఆపరేషన్ చేశారు..
నాలుగు రోజులకే మృతి.. కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం సిరిసిల్ల: ఇంట్లో జారి పడితే కాలు విరిగింది. చికిత్స కో సం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. గుండె బలహీనంగా ఉంది.. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తామని ఆపరేషన్ చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది. పట్టణంలోని అసిఫ్పురకు చెందిన ఎస్.కె.కరీం(65) తినుబండారాలు అమ్ముతూ జీవించేవాడు. పక్షం రోజుల కిందట ఇం ట్లో జారి పడి కాలు విరిగింది. దీంతో బంధువులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కాలుకు వైద్యం చేయకుండా ‘గుండె బలహీనంగా ఉంది. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేస్తాం.’ అని గుండె ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన నాలుగు రోజులకే శుక్రవారం కరీం మరణిం చాడు. ఆరోగ్యం ఉన్న వ్యక్తికి గుండె ఆపరేషన్ చేసి ప్రైవేటు వైద్యులు చంపేశారని, బాధ్యులైన ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరారు. అతడికి భార్య హమీద, కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.