
సాక్షి, శ్రీకాకుళం: ఆపదలో ఉన్న చిన్నారికి సినీ నటుడు సుధీర్‌బాబు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండగా నిలిచారని జిల్లా సుధీర్‌బాబు సేవా సమితి గౌరవాధ్యక్షుడు ఉంకిలి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన డి.మోసె, లక్ష్మి దంపతుల కుమార్తె సంస్కృతి జాస్మిన్‌కు గుండె ఆపరేషన్ కోసం మే నెలలో రూ.1.70లక్షలు చెల్లించారని, తాజాగా చిన్నారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ.1.50 లక్షలను శ్రీకాకుళంలోని హెడ్‌పోస్టాఫీసులో ఫిక్సిడ్ డిపాజిట్ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబుకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అద్యక్షుడు మహ్మద్ షాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment