లగ్గం రెడీ | Hero Sudheer Babu Launched Laggam Release Date Poster | Sakshi
Sakshi News home page

లగ్గం రెడీ

Published Sun, Sep 29 2024 1:09 AM | Last Updated on Sun, Sep 29 2024 1:09 AM

Hero Sudheer Babu Launched Laggam Release Date Poster

సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, రోహిణి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘లగ్గం’. రమేష్‌ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 25న ఏషియన్‌ సురేష్‌ సంస్థ ద్వారా రిలీజ్‌ అవుతోంది. 

ఈ రిలీజ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు హీరో సుధీర్‌బాబు. ‘‘తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడతారు’’ అన్నారు రమేష్‌ చెప్పాల. ‘‘ప్రతి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు వేణుగోపాల్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement