కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG) శస్త్రచికిత్స నుంచి కోలుకోవడం అంటే హృదయ ఆరోగ్యం వైపు వేస్తున్న తొలి అడుగు. ఇక్కడ అంత పెద్ద సర్జరీ తర్వాత త్వరితగతిన కోలుకోవడంలో తీసుకునే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. సరైన పోషకాహారంపై దృష్టిసారిస్తే త్వరితగతిన కోలుకోవడమే గాక మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఇక్కడ సర్జరీ తర్వాత లిక్విడ్ డైట్‌తో ప్రారంభించి..కోలుకున్న వెంటనే రెగ్యులర్ డైట్‌ని ఫాలో అవ్వడానికి ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే..?మళ్లీ ఘన పదార్థాలు తీసుకునేటప్పుడూ ఆకలి లేకపోవడం, వికారం లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను ఎదురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చంటే..
గుండెకు ఉపకరించే ఆరోగ్యకరమైన ఆహారాలు..
హృదయాన్ని ఆరోగ్యకరంగా ఉండేలా చేసే అత్యుత్తమమైన ఆహారాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండేవి తీసుకోవాలి. ఇవి గుండెల్లో మంటను తగ్గిస్తాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు..
మీలో కొలస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం.అందుకోసం వేయించిన ఆహారాలు, మాంసాహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవోకాడోస్, నట్స్, గింజలు,సాల్మన్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలను తినండి. అలాగే వేరుశెనగ, బియ్యం ఊక, పొద్దుతిరుగుడు లేదా ఆవాల నూనెలను వంటనూనెలుగా ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉప్పు తగ్గించండి..
రక్తపోటుని నిర్వహించేందుకు ఉప్పు తక్కువుగా తీసుకోవడం అత్యంత ముఖ్యం. అధిక సోడియం ప్రాసెస్ చేసిన ఆహారాలు, క్యాన్డ్ సూప్‌లు, స్నాక్స్‌కి బదులుగా ఉప్పులేని భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రోటీన్ ప్యాకేజీలు
రికవరీకి లీన్ ప్రోటీన్లు కీలకం, ఎందుకంటే అవి కణజాల మరమ్మత్తు, కండరాల బలానికి సహాయపడతాయి. పౌల్ట్రీ, చేపలు, చిక్కుళ్ళు, టోఫు, తక్కువ కొవ్వు వంటి లీన్ సోర్స్‌లను ఎంచుకోండి. కండరాల రిపేర్‌కు తోడ్పడేందుకు, అలాగే నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ప్రతి భోజనంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి.
హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి..
సర్జరీ తర్వాత కోలుకోవాలంటే హైడ్రేటెడ్ ఉండటం అత్యంత కీలకం. శరీరం బాగా పనిచేసేలా రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. చక్కెర పానీయాలు, కెఫిన్‌లను నివారించండి.
డైటీషియన్ సలహాలు తీసుకోవడం..
సర్జరీ తర్వాత ఎలాంటి ఆహారం మంచిదనేది మన వైద్య చరిత్ర తెలిసిన డైటీషియన్‌ని అడగడం మంచిది. అది మనకు ఎలాంటి సమస్యలు రాకుండా నివారించడమే గాకుండా ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు ఉపకరిస్తుంది.
బాడీ పరిస్థితిని అర్థం చేసుకోండి..
దీర్ఘకాలిక గుండె ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమైనదో అలాగే మనం తీసుకునే ఫుడ్‌కి శరీరం ఎలా రియాక్షన్ ఇస్తుందనేది గమనించడం అంతే ముఖ్యం.అలాగే ఎప్పటికప్పుడూఆరోగ్య సంరక్షణ నిపుణులు సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవడం కూడా విస్మరించొద్దని సూచిస్తున్నారు నిపుణులు.
(చదవండి: నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్)
Comments
Please login to add a commentAdd a comment