కాలు విరిగి వెళ్తే.. గుండె ఆపరేషన్ చేశారు..
నాలుగు రోజులకే మృతి..
కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం
సిరిసిల్ల: ఇంట్లో జారి పడితే కాలు విరిగింది. చికిత్స కో సం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. గుండె బలహీనంగా ఉంది.. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తామని ఆపరేషన్ చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది. పట్టణంలోని అసిఫ్‌పురకు చెందిన ఎస్.కె.కరీం(65) తినుబండారాలు అమ్ముతూ జీవించేవాడు. పక్షం రోజుల కిందట ఇం ట్లో జారి పడి కాలు విరిగింది. దీంతో బంధువులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడి వైద్యులు కాలుకు వైద్యం చేయకుండా ‘గుండె బలహీనంగా ఉంది. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేస్తాం.’ అని గుండె ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన నాలుగు రోజులకే శుక్రవారం కరీం మరణిం చాడు. ఆరోగ్యం ఉన్న వ్యక్తికి గుండె ఆపరేషన్ చేసి ప్రైవేటు వైద్యులు చంపేశారని, బాధ్యులైన ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరారు. అతడికి భార్య హమీద, కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.