న్యూఢిల్లీ: దాదాపు ఏడాది అనంతరం గుండె శస్త్రచికిత్సల్లో(యాంజియోప్లాస్టీ) వాడే కరోనరీ స్టెంట్ల గరిష్ట ధరల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. సవరించిన ధరల మేరకు బేర్ మెటల్ స్టెంట్ల(బీఎంఎస్) ధర రూ. 7,400 నుంచి రూ. 7,660కి పెరగగా, డ్రగ్‌తో కూడిన స్టెంట్ల(డీఈఎస్)ధర రూ. 30,180 నుంచి రూ. 27,890కి తగ్గింది.
ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని, 2019 మార్చి 31 వరకూ అమల్లో ఉంటాయని జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల నియంత్రణ విభాగం (ఎన్‌పీపీఏ) తెలిపింది. ఇప్పటికే స్టోర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న స్టెంట్లకు కూడా తాజా ధరలే వర్తిస్తాయంది. డీపీసీఓ(డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్) 2013, షెడ్యూల్ 1 ప్రకారం కరోనరీ స్టెంట్లు ముఖ్యమైన డ్రగ్స్ కేటగిరీలోకి వస్తాయని, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటి ధరల నియంత్రణ కొనసాగాల్సిన అవసరముందని పేర్కొం ది. స్టెంట్లపై తయారీదారులు జీఎస్టీ విధించవచ్చని, అయితే ఎమ్మార్పీ ధరకు అదనంగా ఏ ఇతర చార్జీలు ఉండవంది.
Comments
Please login to add a commentAdd a comment