stents rates
-
స్టెంట్ల ధరల్లో మార్పులు
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది అనంతరం గుండె శస్త్రచికిత్సల్లో(యాంజియోప్లాస్టీ) వాడే కరోనరీ స్టెంట్ల గరిష్ట ధరల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. సవరించిన ధరల మేరకు బేర్ మెటల్ స్టెంట్ల(బీఎంఎస్) ధర రూ. 7,400 నుంచి రూ. 7,660కి పెరగగా, డ్రగ్‌తో కూడిన స్టెంట్ల(డీఈఎస్)ధర రూ. 30,180 నుంచి రూ. 27,890కి తగ్గింది. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని, 2019 మార్చి 31 వరకూ అమల్లో ఉంటాయని జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల నియంత్రణ విభాగం (ఎన్పీపీఏ) తెలిపింది. ఇప్పటికే స్టోర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న స్టెంట్లకు కూడా తాజా ధరలే వర్తిస్తాయంది. డీపీసీఓ(డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్) 2013, షెడ్యూల్ 1 ప్రకారం కరోనరీ స్టెంట్లు ముఖ్యమైన డ్రగ్స్ కేటగిరీలోకి వస్తాయని, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటి ధరల నియంత్రణ కొనసాగాల్సిన అవసరముందని పేర్కొం ది. స్టెంట్లపై తయారీదారులు జీఎస్టీ విధించవచ్చని, అయితే ఎమ్మార్పీ ధరకు అదనంగా ఏ ఇతర చార్జీలు ఉండవంది. -
హృదయ స్పందనలపై మార్కెట్ 'స్టంట్'
-
హృదయ స్పందనలపై మార్కెట్ 'స్టంట్'
► స్టెంట్ల ధరను కేంద్రం తగ్గించడంతో కంపెనీల కొత్త నాటకం ► ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు విక్రయించలేమని స్పష్టీకరణ ► మార్కెట్ నుంచి స్టెంట్లను వెనక్కి తీసుకుంటున్న వైనం ► సర్కారుపై ఒత్తిడి తెచ్చి, ధరలు పెంచుకునేందుకు కంపెనీల ఎత్తులు ► ఆసుపత్రుల్లో నాణ్యమైన స్టెంట్లు లేక రోగుల ఇబ్బందులు ► తగ్గించిన ధరలకే విక్రయించేలా కంపెనీలను ఒప్పించాలని నిపుణుల సూచన ► కంపెనీల ఒత్తిడికి లొంగితే పేద రోగులకు నష్టం తప్పదని వెల్లడి స్టెంట్ అంటే? ఆధునిక జీవనశైలి కారణంగా హృద్రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ధమనుల ద్వారా శరీరం నుంచి గుండెకు రక్తం సరఫరా అవుతుంది. ఈ ధమనుల్లో కొవ్వు చేరితే గుండెకు చేరే రక్తం తగ్గిపోతుంది. కొవ్వుతో ధమనుల్లో ఏర్పడే అడ్డుగోడలను బ్లాకేజ్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో స్టెంట్ అమర్చుతారు. రోగి కాళ్లు లేదా చేతులకు ఓ చిన్న రంధ్రం చేసి రక్తనాళాల ద్వారా సన్నని తీగలాంటి ట్యూబ్‌ను లోపలికి పంపిస్తారు. దీన్నే క్యాథడ్రెల్ అంటారు. క్యాథడ్రెల్ ద్వారా స్టెంట్‌ను గుండె నాళాల్లోకి పంపుతారు. తర్వాత స్టెంట్‌ను బ్లాకేజ్ మధ్యలో అమర్చితే గుండెకు రక్తం సరఫరా సాఫీగా జరుగుతుంది. కేవలం రూ.30 వేల విలువైన వస్తువును రూ.2 లక్షలకు ఎవరైనా అమ్ముతారా? అలా అమ్మితే కొనేవాళ్లుంటారా? హృద్రోగులకు అవసరమైన స్టెంట్లను దేశంలో ఇన్నాళ్లూ ఇదే ధరకు విక్రయించారు. స్టెంట్ల తయారీ కంపెనీలతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, డాక్టర్లు కలసి భారీగా సొమ్ము చేసుకున్నారు. పేద రోగులు మాత్రం మరో దిక్కులేక స్టెంట్ల కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు. కొందరు ఆస్తులు సైతం అమ్ముకున్నారు. స్టెంట్ల పేరిట జరుగుతున్న దోపిడీపై దేశవ్యాప్తంగా గగ్గోలు రేగింది. సంపన్నులు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరికీ తక్కువ ఖర్చుతో నాణ్యమైన స్టెంట్లను అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) రంగంలోకి దిగింది. స్టెంట్ల తయారీకి అయ్యే వాస్తవ ఖర్చుపై అధ్యయనం చేసింది. ఒక్కో స్టెంట్ తయారీకి రూ.30 వేల కంటే ఎక్కువ ఖర్చు కాదని తేల్చింది. ఎసెన్షియల్ మెడిసిన్స్ జాబితాలోకి స్టెంట్ కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్’ జాబితాలో స్టెంట్‌ను కూడా చేర్చింది. ఈ జాబితాలో చేర్చిన వస్తువుల ధరలను కంపెనీలు నిర్ణయించలేవు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించాల్సి ఉంటుంది. స్టెంట్ల ధరలపై ఫిబ్రవరి 13న ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో రూ. 30 వేల నుంచి రూ.75 వేల వరకు ధర ఉన్న మెటల్ స్టెంట్‌ను ఇకపై రూ.7,260కే అమ్మాలని మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ ధర గతంలో రూ.40 వేల నుంచి రూ.2 లక్షలు పలికేది. ఇప్పుడు దాన్ని రూ.29,600కే విక్రయించాలని కేంద్రం స్పష్టం చేసింది. వేధిస్తున్న ప్రీమియం బ్రాండ్ల కొరత స్టెంట్ల ధరను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించడంతో.. భారీగా సొమ్ము చేసుకునే అవకాశం లేక బడా కంపెనీలు కొత్త నాటకానికి తెరతీసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలను మళ్లీ పెంచే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కంపెనీలు ఆసుపత్రుల నుంచి స్టెంట్లను వెనక్కి తీసుకుంటున్నాయి. తగ్గించిన ధరలకు స్టెంట్లను విక్రయించలేమని చెబుతున్నాయి. ముఖ్యంగా విదేశీ కంపెనీలు రీలేబులింగ్ పేరుతో తమ స్టెంట్లను మార్కెట్‌నుంచి వెనక్కి రప్పిస్తున్నాయి. దీంతో ఆసుపత్రుల్లో మేలురకం స్టెంట్ల కొరత ఏర్పడింది. ప్రీమియం బ్రాండ్(నాణ్యమైన) స్టెంట్లు అందుబాటులో లేక హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో ఏంజియోప్లాస్టీ చికిత్సలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిఏటా లక్ష మంది హృద్రోగులు స్టెంట్లు వేయించుకుంటున్నారు. కంపెనీల ఒత్తిడికి లొంగొద్దు ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత లేకుండా స్టెంట్ల ధరలను తగ్గించడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. తగ్గించిన ధరలకే విక్రయించేలా విదేశీ కంపెనీలను సైతం ఒప్పించిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తే బాగుండేదని పేర్కొంటున్నారు. కంపెనీల ఒత్తిడికి లొంగకుండా నిర్దేశించిన ధరలకే నాణ్యమైన స్టెంట్లను సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేద రోగులు నష్టపోకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్టెంట్ల కంపెనీలకు భారత్ అతిపెద్ద మార్కెట్. ఆయా కంపెనీలు ఇక్కడున్న అవకాశాలను ఎక్కువ కాలం వదులుకోలేవని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి, ఇంకెన్నో రోజులు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయలేవని అంటున్నారు.