'షారుక్ టెక్ట్స్ బుక్ లాంటి వాడు'
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ను అభిమానులే కాదు, సహచర నటీనటులు కూడా అభిమానిస్తారు. షారుక్ ను అభిమానించే జాబితాలో తాజాగ బాలీవుడ్ హీరో శ్రేయాస్ తల్పాడే చేరిపోయాడు. ఓం శాంతి ఓం చిత్ర షూటింగ్ సమయంలో షారుక్ పనితీరు తనకు స్పూర్తిగా నిలిచింది అని తల్పాడే అన్నాడు. భావి తరాల హీరోలకు షారుక్ ఓ టెక్ట్స్ బుక్ లాంటి వాడు అని శ్రేయాస్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఓ నటుడిగానే కాకుండా ఓ నిర్మాతగా కూడ తనకు స్పూర్తిగా నిలిచాడు అని అన్నారు.
'ఓం శాంతి ఓం' చిత్రంలో షారుక్ స్నేహితుడిగా శ్రేయాస్ తల్పాడే నటించారు. 'ఇక్బాల్', 'వెల్ కమ్ టూ సజ్జన్ పూర్', 'గోల్ మాల్ 3', 'హౌజ్ ఫుల్ 2' చిత్రాల్లో శ్రేయాస్ తన నటనతో ఆకట్టుకున్నారు. మరాఠి చిత్ర సీమంలో ఇటీవల సనాయ్ చాఘదే, బాజీ చిత్రాల్ని నిర్మించారు. బాజీ చిత్రంలో శ్రేయాస్ సూపర్ హీరోగా కనిపించనున్నారు.