హిందీ ‘క్షణం’లో సల్మాన్! | Salman Khan - Sajid Nadiadwala Teaming Up For Kshanam Remake? | Sakshi
Sakshi News home page

హిందీ ‘క్షణం’లో సల్మాన్!

Published Wed, Mar 16 2016 10:27 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

హిందీ ‘క్షణం’లో సల్మాన్!

హిందీ ‘క్షణం’లో సల్మాన్!

ఈ మధ్యకాలంలో విడుదలైన థ్రిల్లర్ మూవీస్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘క్షణం’. మామూలు బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లు కురిపించింది. అడివి శేష్, అదా శర్మ, అనసూయ, సత్య ముఖ్య తారలుగా రవికాంత్ దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా దక్కించుకోనున్నారట. హిందీ రీమేక్‌లో సల్మాన్ ఖాన్‌ని నటింపజేయాలనుకుంటున్నారని సమాచారం. సాజిద్ ఇంతకుముందు రవితేజ ‘కిక్’ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌తో హిందీలో రీమేక్ చేసి, ఘనవిజయాన్నందుకున్నారు. ఇప్పుడు ‘క్షణం’ని కూడా ఆయనతోనే తీయాలని బలంగా అనుకుంటున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement