అదా శర్మ
‘‘షూటింగ్ కోసం సెట్‌లోకి వెళ్తుంటే యుద్ధభూమిలోకి వెళ్తున్న భావన కలుగుతోంది’’ అంటున్నారు హీరోయిన్ అదా శర్మ. లాక్‌డౌన్ తర్వాత తొలిసారి షూటింగ్‌లో పాల్గొంటున్నారామె. ఈ విషయం గురించి అదా మాట్లాడుతూ – ‘‘బ్యాక్ టు సెట్. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత నేను తొలిసారి సెట్‌లోకి అడుగుపెట్టాను. ఓ వాణిజ్య ప్రకటన కోసం ఒక్కరోజు షూటింగ్ చేయాలి. సెట్‌లో ఇరవైమంది మాత్రమే ఉన్నారు. అందరూ మాస్క్‌లు ధరించారు. శానిటైజ్ అయ్యారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని సెట్‌లోకి అడుగుపెడుతుంటే యుద్ధభూమిలోకి వెళ్తున్నట్లు ఉంది. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌కు వెళ్తున్న అతికొద్ది నటీనటుల జాబితాలో నా పేరు కూడా ఉంటుందనుకుంటున్నాను’’ అని అన్నారు.
∙సెట్‌లో అదా శర్మ
Comments
Please login to add a commentAdd a comment