Battlefield
-
Tony Radakin: రోజుకు 1,500!
లండన్: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా యుద్ధక్షేత్రంలో భారీగా రక్తమోడుతోందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. సంబంధిత వివరాలను బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ ర్యాడకిన్ ఆదివారం వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది రష్యా సైనికులు చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని టోనీ చెప్పారు. ‘‘ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా మొదట్లో పలు ఉక్రెయిన్ ప్రాంతాలను వేగంగా ఆక్రమించుకుంది. కానీ తర్వాత యూరప్ దేశాల దన్నుతో, అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ప్రతిఘటనను పెంచింది. దీంతో ఇటీవలి కాలంలో సమరంలో సమిధలవుతున్న రష్యా సైనికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, శరీరభాగాలు కోల్పోవడమో జరిగింది. యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే ఒక్క నెలలో ఇంతటి నష్టం ఇదే తొలిసారి. పుతిన్ రాజ్యవిస్తరణ కాంక్షకు ఇప్పటిదాకా ఉక్రెయిన్ యుద్ధంలో 7,00,000 మంది రష్యా సైనికులు బలయ్యారు. ఆక్రమణతో రష్యా భూభాగం పెరుగుతోంది. జాతీయభావనను పెంచి పుతిన్ రష్యాలో మరింత పాపులర్ అయ్యారు. కానీ ప్రభుత్వ ఖజానా, సైన్యంపరంగా దేశానికి అపార నష్టం వాటిల్లుతోంది. రష్యా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 40 శాతాన్ని కేవలం ఈ యుద్ధం కోసమే పుతిన్ కేటాయిస్తున్నారు. ఇది దేశార్థికంపై పెను దుష్ప్రభావం చూపుతుంది. పుతిన్ యుద్ధోన్మాదం లక్షలాది మంది రష్యన్లను కష్టాలపాలుచేస్తోంది. యువతను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారు. ఎంతో మంది తమ ఆప్తులను యుద్ధభూమిలో కోల్పోతున్నారు’’ అని టోనీ అన్నారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. రష్యా 145, ఉక్రెయిన్ 70 డ్రోన్లతో దాడులు మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. రష్యా శనివారం రాత్రి 145 షహీద్ డ్రోన్లను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఒకే రాత్రిలో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 62 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నాయంది. మరో 67 డ్రోన్లు వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, 10 వరకు డ్రోన్లు గురితప్పి మాల్డోవా, బెలారస్, రష్యా ప్రాంతాలవైపు దూసుకెళ్లాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఆదివారం ఉదయం మాస్కో దిశగా ఉక్రెయిన్ ఆర్మీ అత్యధికంగా 34 డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఆరు ప్రాంతాలపైకి మొత్త 70 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది. ఈ సంఖ్యలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొంది. వీటన్నిటినీ కూల్చేశామని వివరించింది. డ్రోన్ శకలాలు పడి రెండో చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. -
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు. ఐరాస సదస్సులో మోదీ వ్యాఖ్యలు
-
గల్వాన్ లోయలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
న్యూఢిల్లీ: 2020 జూన్ 15. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ. భారత్, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–14. సరిగ్గా అక్కడే ఇరు దేశాల సైనికుల నడుమ భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. పదునైన ఆయుధాలతో చైనా జవాన్లు దాడి చేయగా, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా భారత సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ కొట్లాటలో తమ జవాన్లు ఎంతమంది బలయ్యారో చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. 40 మందికిపైగానే చనిపోయి ఉంటారని అంచనా. భారత్ వైపు నుంచి దాదాపు 20 మంది చనిపోయారు. రణక్షేత్రంగా రక్తంతో తడిసిపోయిన పీపీ–14 ఇప్పుడు క్రికెట్ మైదానంగా మారింది. పటియాలా బ్రిగేడ్‌కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీ నిర్వహించింది. సైనికులు సరదాగా క్రికెట్ ఆడారు. పీపీ–14కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ పోటీ జరిగింది. జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను భారత సైన్యం శుక్రవారం ట్విట్టర్లో పోస్టు చేసింది. గడ్డ కట్టించే తీవ్రమైన చలిలో పూర్తి ఉత్సాహంతో ఈ పోటీ జరిగిందని వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఉద్ఘాటించింది. జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా గురువారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే గల్వాన్‌లో భారత సైనికులు క్రికెట్ పోటీ నిర్వహించుకోవడం విశేషం. -
పుతిన్ ఎవర్ని చూసుకుని కయ్యానికి కాలు దువ్వుతున్నారు? వెనుక ఉన్నదెవరు?
Strategies On The Battlefield: ఉక్రెయిన్‌పై దండయాత్రతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏకాకిగా నిలిచారు పది రోజులైనా నిర్విరామంగా దాడులు చేస్తూ ప్రపంచ ప్రజల దృష్టిలో విలన్‌గా ముద్ర పడ్డారు. దురహంకారపూరిత నిర్ణయాలతో యుద్ధాన్ని నడిపిస్తూ అందరికీ ఆయనే కనిపిస్తున్నారు. మరి పుతిన్ వెనుక ఉన్నదెవరు ? కథనానికి కాలు దువ్వడంలోనూ, యుద్ధ రంగంలో వ్యూహాలు రచించడంలో పుతిన్ వెంట నడుస్తున్నదెవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్‌పై దాడిలో పుతిన్‌కు వీరందరూ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. సెర్గీ షొయిగు రక్షణ మంత్రి, వయసు 66 పశ్చిమ దేశాల మిలటరీ ముప్పు నుంచి రష్యాను కాపాడాలని, నాటోలో చేరాలని ఉబలాటపడుతున్న ఉక్రెయిన్ను నిస్సైనికీకరణ చేయాలన్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు మొదట్నుంచి వంత పాడుతున్నది ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ షొయిగు. పుతిన్‌కు మంచి మిత్రుడు. ఒకానొక సందర్భంలో సైబేరియాలో పుతిన్‌తో కలిసిమెలిసి సరదాగా చేపలు పడుతూ కూడా కెమెరాలకు చిక్కారు. పుతిన్ వారసుడు సెర్గీ అన్న ప్రచారం కూడా ఉంది. ఎలాంటి క్లిష్టమైన ఆపరేషన్లలో అయినా పుతిన్‌కు తోడుగా ఉంటారు. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న క్రెడిట్ ఆయనకే దక్కింది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం వ్యూహరచనలో కూడా ఆయనదే ప్రధాన పాత్ర. వలేరి జెరసిమోవ్ రష్యా సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వయసు 66 రష్యా సాయుధ బలగాల చీఫ్‌గా వలేరి జెరసిమోవ్ యుద్ధాన్ని ముందుండి నడిపిస్తున్నారు. 1999లో చెచెన్ యుద్ధ సమయం నుంచి మిలటరీ ప్రణాళికల్లో అందెవేసిన చెయ్యి. పుతిన్‌కి అత్యంత విధేయుడిగా ఉంటారు. ఉక్రెయిన్ యుద్ధ ప్రణాళిక ఆయన కనుసన్నుల్లోనే సాగుతోంది. గత నెలలో బెలారస్ మిలటరీ డ్రిల్స్ కూడా ఆయన పర్యవేక్షణలోనే సాగాయి. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురు కావడంతో, రష్యా సైనికులు నైతిక స్థైర్యాన్ని కోల్పోయారు. దీంతో వలేరి పనితీరుపై పుతిన్ అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. నికోలాయ్ పత్రుషెవ్ రష్యా భద్రతా మండలి కార్యదర్శి వయసు 70 పుతిన్‌కు అంతరంగికుల్లో నికోలాయ్ ఒకరు. 1970ల నుంచి వీరిద్దరి మధ్య గట్టి అనుబంధం ఉంది. పుతిన్ సలహాదారుల్లో దుందుడుకు చర్యలు తీసుకునే వారిగా పేరు పొందారు. సోవియెట్ యూనియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కేజీబీలో పుతిన్‌తో కలిసి సన్నిహితంగా పని చేశారు. ఇప్పటి రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎఫ్ఎస్బీ) చీఫ్‌గా 1999–2008 వరకు సేవలు అందించారు.ఒకప్పటి లెనిన్గ్రాడ్ (నేటి సెయింట్ పీటర్స్బర్గ్) మిత్రత్రయంలో మొదటి వారు. అంతర్జాతీయ వ్యవహారాలను సునిశిత దృష్టితో చూస్తారు. రష్యాని లొంగదీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని నమ్ముతూ వస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేయాలని పుతిన్ నిర్ణయించుకోవడానికి ముందు సమావేశమైన అంతరంగికుల్లో నికోలాయ్ ఒకరు. ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతున్నా ఉక్రెయిన్‌పై దాడికి ఆజ్యం పోయడంలో ఆయన పాత్ర ఎక్కువగా ఉంది. అలెగ్జాండర్ బోర్టనికోవ్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ డైరెక్టర్ వయసు 70 సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముం దు నుంచి పుతిన్ వెంటే అలెగ్జాండర్ ఉన్నారు. నికోలాయ్ పత్రుషెవ్ తర్వాత ఎఫ్ఎస్బీ డైరెక్టర్ పగ్గాలు చేపట్టారు. పుతిన్ మద్దతుతో చట్టాలను అమలు చేయడంలో ఎఫ్ఎస్బీని అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దారు. నికోలాయ్, అలెగ్జాండర్‌ల మధ్య గాఢమైన స్నేహం ఉంది. పుతిన్‌కు రెండు కళ్లుగా ఉన్నారు. భద్రతా సర్వీసుల మాటంటేనే పుతిన్‌కు ఎప్పుడూ వేదవాక్కు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగాలన్న నిర్ణయం అలెగ్జాండర్దేనని, ఆయన మాట మీదే పుతిన్ ఈ దుస్సాహసానికి దిగారన్న ప్రచారం ఉంది సెర్గీ నారిష్కిన్ ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎస్వీఆర్) డైరెక్టర్ వయసు 67 సోవియెట్ యూనియన్ గూఢచర్య విభాగం కేజీబీ నుంచి పుతిన్‌తో ఉన్న వారిలో నారిష్కిన్ మరో ముఖ్యుడు. ఇప్పటివరకు ఎక్కువ కాలం పుతిన్ వెంట ఉన్న ఘనత ఈయనకే దక్కుతుంది. నికోలాయ్, అలెగ్జాండర్, సెర్గీ నారిష్కిన్లకు లెనిన్గ్రాడ్ ట్రయో అన్న పేరు ఉంది. ఎప్పుడూ పుతిన్‌కు నీడలా ఉంటారు. పుతిన్ విమర్శకులపై రష్యా వెలుపల విష ప్రయోగం చేయించి ప్రాణాలు తీస్తారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగడానికి ముందు జరిగిన సమావేశంలో పశ్చిమ దేశాలకు లాస్ట్ చాన్స్ ఇవ్వాలని పుతిన్‌కు సలహా ఇచ్చారు. ఆ తర్వాతే పుతిన్ ఉక్రెయిన్‌లోని తిరుగుబాటు దారుల అధీనంలో ఉన్న రెండు ప్రాంతాలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ అధ్యక్షుడి హోదాలో ఉత్తర్వులు జారీ చేశారు. సెర్గీ లావరోవ్ విదేశాంగ మంత్రి, వయసు 71 పుతిన్ కేబినెట్లో సీనియర్ నాయకుడు. 2004 నుంచి విదేశాంగ మంత్రిగా ఉంటూ అంతర్జాతీయ వేదికలపై పుతిన్ గళం వినిపిస్తూ ఉంటారు.పుతిన్‌కు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఉక్రెయిన్ సమస్యని దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని ఆయన పలుమార్లు చెప్పినప్పటికీ పుతిన్ ఖాతరు చేయలేదని అంటారు. ఉక్రెయిన్‌పై దాడిలో ప్రత్యక్షంగా ఎలాంటి పాత్ర లేకపోయినప్పటికీ యుద్ధాన్ని సమర్థించుకుంటూ మాట్లాడాల్సిన బాధ్యత లావ్రావ్పైనే ఉంది. అందుకే తన వాదనను బలంగా వినిపిస్తారు. యూఎన్ భద్రతా మండలి సమావేశంలో ఆయన ప్రసంగాన్ని ఇతర దేశాల ప్రతినిధులు బహిష్కరించినప్పటికీ పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్నది చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
యుద్ధభూమిలో ఉన్నాం... నిబంధనలను అతిక్రమిస్తే ప్రాణాలకే ముప్పు
సాక్షి హైదరాబాద్: ‘ఉక్రెయిన్ పౌరులపై రష్యా ప్రస్తుతం అత్యంత దారుణంగా యుద్ధానికి పాల్ప డుతోంది. ఈ దురాక్రమణను గట్టిగా ప్రతిఘటిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కొందరు భార తీయ విద్యార్థులు నిబంధనలకు అతిక్రమించి బంకర్ల నుంచి బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బాధగా ఉంది’ అని ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, నృత్యకారిణి, అత్యవసర సేవల విభాగంలో పనిచేస్తున్న లీదియా జురావ్వోలా లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ, చెన్నైలలో చదువుకున్న ఆమె భారతీయ సంస్కృతి, కళల పట్ల మక్కువ పెంచుకున్నారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి నృత్యాలను నేర్చుకున్నారు. లీదియా ప్రస్తుత పరిణామాలపై ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. కర్ణాటక విద్యార్థి నగరంలోని ఫ్రీడమ్ స్క్వేర్ భవనం వద్ద బాంబు దాడిలో మృతి చెందిన సంఘటన తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు.. రష్యన్ బలగాలు ఏ వైపు నుంచి విరుచుకుపడతాయో తెలియదు. కొందరు విద్యార్థులు ఉక్రెయిన్ ప్రభుత్వం, ఇండియన్ ఎంబసీ ఆదేశాలను బేఖాతరు చేసి రోడ్ల మీదకు వస్తున్నారు. ఏజెంట్లను నమ్మి సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ప్రభుత్వం అనుమతించే వరకు తప్పనిసరిగా బంకర్లలోనే ఉండాలి. ప్రతి విదేశీ విద్యార్థి పట్ల ఉక్రెయిన్ ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. మా వలంటీర్లు బంకర్ల వద్దకు వెళ్లి ఆహారం, మందులు ఇస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ముందే ఫిబ్రవరి 15న భారత ప్రభుత్వం తమ వాళ్లను స్వదేశానికి రావాలని సూచించింది. కానీ చాలా మంది విద్యార్థులు ఫిబ్రవరి 24 వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. చివరకు అంతర్జాతీయ రాకపోకలు స్తంభించడంతో చిక్కుల్లో పడ్డారు. స్థానిక రేడియోలు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఎవరైనా సరే కర్ఫ్యూ సడలించినప్పుడే బంకర్ల నుంచి బయటకు రావాలి. ఉక్రెయిన్‌లో 180 దేశాలకు చెందిన విదేశీయులు ఉన్నారు. యుద్ధం కారణంగా అందరూ కష్టాల్లోనే ఉన్నారు. వారికి బంకర్లే సురక్షిత స్థావరాలు. ఆయా దేశాల ఎంబసీలు, ఉక్రెయిన్ ప్రభుత్వం అనుమతించే వరకు తప్పనిసరిగా అక్కడే ఉండాలి. భారతీయ సంస్కృతిపై ప్రేమతో.. వినితియా నగరానికి చెందిన లీదియాను చిన్నప్పటి నుంచే విషాదం వెంటాడుతోంది. చెర్నోబిల్ అణు ధార్మికత ప్రభావంతో ఆమె వెన్నెముక దెబ్బతిన్నది. నాలుగుసార్లు సర్జరీలు జరిగాయి. కానీ యోగ, ధ్యానం, ప్రాణాయామంతో ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 2014లో జరిగిన యుద్ధంలో ఆమె తల్లిదండ్రులను, కుటుంబాన్ని కోల్పోయారు. అంతకుముందే 2011లోనే ఆమె భారత్‌కు వచ్చారు. నాట్యశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ‘బెల్ నాట్యం కథా కల్పం’ అనే నూతన నృత్యరీతిని పరిచయం చేశారు. ఆమెకు భారతీయ సంస్కృతి అంటే ఎంతో ప్రేమ. ఆ కోణంలోనే తన పేరులో చివరకు ‘లక్ష్మి’ వచ్చేలా పెట్టుకున్నట్లు లీదియా జురావ్వోలా లక్ష్మి పేర్కొన్నారు. అత్యవసర సేవల్లో లీదియా.. ఆపదలో ఉన్న వారి నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను అందుకొని అవసరమైన సహాయ సహకారాలను అందజేసే విధి నిర్వహణలో లీదియా ఉన్నారు. ఉక్రెయిన్ లోని ఏ మూల నుంచైనా ఇలాంటి అత్యవసర ఫోన్‌కాల్స్ రావచ్చు. వెంటనే వలంటీర్లను అక్కడికి తరలిస్తారు. లీదియాకు మాతృభాష ఉక్రెయిన్‌తో పాటు రష్యన్ భాష కూడా తెలుసు. అందుకే ఎస్ఓఎస్ విధులు అప్పగించారు. విభిన్న రంగాలకు చెందిన మేమంతా ఇప్పుడు మా దేశాన్ని కాపాడుకొనే పనిలో ఉన్నాం. సైనికులు, పోలీసులు, సాధారణ పౌరులు అందరం ప్రాణాలొడ్డి పోరాడుతున్నాం.మాకు ప్రపంచం మద్దతు కావాలి అని ఆమె చెప్పారు. (చదవండి: రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్ నగరం) -
ప్రాణాలు దక్కితే చాలు
సాక్షి, నేషనల్ డెస్క్: అందరిలోనూ ఒకటే ఆరాటం.. ఒకటే ఆకాంక్ష. ఈ క్షణం ప్రాణాలు దక్కించుకుంటే చాలు. ఈ యుద్ధభూమి దూరంగా వెళ్లిపోయి క్షేమంగా మిగిలితే అదే పదివేలు. అందుకే వాహనాలన్నీ రోడ్లపై బారులు తీరాయి. పెట్రోల్ బంకులు, ఏటీఎం కేంద్రాలు జనం రద్దీతో కిటకిటలాడాయి. అండర్‌గ్రౌండ్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో గురువారం ఉదయమే కనిపించిన దృశ్యాలివీ.. రష్యా సైన్యం అకస్మాత్తుగా దాడులు ప్రారంభించడంతో ఉక్రెయిన్ ప్రజలు కకావికలమయ్యారు. బాంబుల మోతలు, ఎయిర్ సైరన్లు భీకర స్థాయిలో వినిపిస్తుండడంతో తొలుత ఏం జరుగుతోందో అర్థంకాక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విస్ఫోటన శబ్దాలు విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రష్యా సైన్యం విరుచుకుపడుతోందని తెలిశాక సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నారు. పిల్లా పాపలు, కుటుంబ సభ్యులతో కలిసి సొంత వాహనాల్లో పయనమయ్యారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టాయి. పెట్రోల్ కోసం చాలా సమయం వేచి చూడాల్సి వచ్చింది. రోడ్లపై తరచుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరం వెలుపలకు దారితీసే రోడ్లన్నీ వ్యక్తిగత వాహనాలతో నిండిపోయాయి. కొందరైతే అండర్‌గ్రౌండ్ స్టేషన్లకు పరుగులు తీశారు. రోజంతా అక్కడే తలదాచుకున్నారు. అన్నపానీయాలు సైతం ఇచ్చేవారు లేక ఆకలితో అలమటించారు. పిల్లల రోదనలు, పెద్దల కన్నీళ్లతో అండర్‌గ్రౌండ్ స్టేషన్లలో దృశ్యాలు హృదయాలను బరువెక్కించాయి. డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాలకు ప్రజలు పోటెత్తారు. కొద్దిసేపట్లోనే ఏటీఎం యంత్రాలు ఖాళీ కావడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వచ్చిందని, రేపటి రోజు ఎలా గడుస్తుందో తెలియడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల కోసం దుకాణాల్లో జనం ఎగబడ్డారు. కీవ్‌లోని ఓ ఏటీఎం వద్ద నగదు కోసం బారులు తీరిన ప్రజలు విద్యాసంస్థలు మూసివేత ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, బయటకు రావొద్దని అధికారులు పదేపదే అభ్యర్థించారు. అయినప్పటికీ జనం ప్రాణభయంతో నగరం విడిచి వెళ్లేందుకే మొగ్గుచూపారు. చాలామంది మెట్రో స్టేషన్లకు చేరుకున్నారు. బంధు మిత్రులకు ఫోన్లు చేస్తూ క్షేమ సమాచారాలు ఇచ్చిపుచ్చుకున్నారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు వెల్లడించారు. మెట్రో రైళ్లు, బస్సులు యథావిధిగా నడిచాయని చెప్పారు. ఇక పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ముందు జాగ్రత్తగా మూసివేశారు. ప్రభుత్వం మార్షల్ లా విధించడంతో ఆసుపత్రుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రష్యా దాడులతో తూర్పు సరిహద్దుకు చాలా దూరంగా ఉన్న నగరాల నుండి కూడా పొగలు వచ్చాయి. కీవ్‌లోని ప్రధాన వీధి క్రేష్చాటిక్లో ఆందోళనతో నిండిన ప్రజలు కనిపించారు. చాలా మంది పాత్రికేయులు బస చేసిన హోటల్‌ను 30 నిమిషాల్లో ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు. ఖార్కివ్‌లో పిల్లల ఆట స్థలంలో మిలటరీ శకలాలు పడ్డాయి. నగరంలో ప్రతి ఒక్కరూ వారికి అవసరమైన ఔషధాలు, గుర్తింపు పత్రాలతో సిద్ధంగా ఉండాలని కీవ్ మేయర్ సూచించారు. ‘ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. తక్షణ సాయం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియట్లేదు’’ అని కీవ్ నివాసి ఎలిజవేటా మెల్నిక్ వాపోయారు. ఇది నా జీవితంలో అత్యంత దారుణమైన సూర్యోదయం అని ఖార్వివ్ నగరానికి చెందిన సాశా అనే మహిళ వాపోయారు. బాంబుల శబ్దాలతోనే నిద్ర నుంచి మేల్కొన్నానని చెప్పారు. -
యుద్ధ క్షేత్రాల్లో ఆర్మీకి కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: యుద్ధక్షేత్రాల్లో సైనిక బలగాలకు మరింత తేలికైన, మన్నికైన యూనిఫాం సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి భారత ఆర్మీకి ఈ కొత్త యూనిఫామ్‌ను అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండేలా దీనిని తయారుచేశారు. మంచు, అటవీ ప్రాంతాల పరిసరాల రంగుల్లో కలిసిపోయేలా ఉండే రంగులను యూనిఫామ్ కోసం ఎంపికచేశారు. బలగాలను కాస్త దూరం నుంచి చూస్తే పసిగట్టకుండా ఉండేందుకు ఆయా రంగుల్లో డిజైన్‌ను ఎంపికచేశారు. ఆలివ్, మృణ్మయ రంగుల కలబోతగా ‘డిజిటల్ డిస్ట్రర్బ్’ డిజైన్‌లో ఈ యూనిఫామ్‌ను రూపొందించారు. వచ్చే ఏడాది జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్‌లో తొలిసారిగా అధికారికంగా దీనిని ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సైనికులకు యుద్ధక్షేత్రాల్లో వినియోగిస్తున్న వేర్వేరు డిజైన్ల ఆర్మీ యూనిఫామ్‌లను పరిశీలించి, పలు చర్చల అనంతరం ఈ యూనిఫామ్‌కు తుదిరూపునిచ్చారు. -
యుద్ధభూమికి వెళ్లినట్లుంది!
‘‘షూటింగ్ కోసం సెట్లోకి వెళ్తుంటే యుద్ధభూమిలోకి వెళ్తున్న భావన కలుగుతోంది’’ అంటున్నారు హీరోయిన్ అదా శర్మ. లాక్డౌన్ తర్వాత తొలిసారి షూటింగ్లో పాల్గొంటున్నారామె. ఈ విషయం గురించి అదా మాట్లాడుతూ – ‘‘బ్యాక్ టు సెట్. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నేను తొలిసారి సెట్లోకి అడుగుపెట్టాను. ఓ వాణిజ్య ప్రకటన కోసం ఒక్కరోజు షూటింగ్ చేయాలి. సెట్లో ఇరవైమంది మాత్రమే ఉన్నారు. అందరూ మాస్క్‌లు ధరించారు. శానిటైజ్ అయ్యారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని సెట్లోకి అడుగుపెడుతుంటే యుద్ధభూమిలోకి వెళ్తున్నట్లు ఉంది. లాక్డౌన్ తర్వాత షూటింగ్‌కు వెళ్తున్న అతికొద్ది నటీనటుల జాబితాలో నా పేరు కూడా ఉంటుందనుకుంటున్నాను’’ అని అన్నారు. ∙సెట్లో అదా శర్మ -
వీరజవాన్లకు సాయం 4రెట్లు
న్యూఢిల్లీ: యుద్ధభూమిలో మరణించే సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. ప్రస్తుతం ఈ మొత్తం రూ.2 లక్షలు మాత్రమే ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచేందుకు మంత్రి అంగీకరించారని శనివారం కొందరు అధికారులు తెలిపారు. యుద్ధాల్లో 60 శాతం కంటే ఎక్కువ వైకల్యం ప్రాప్తించిన వారికీ ఈ మొత్తం చెల్లిస్తారు. పెరిగిన మొత్తాన్ని ఆర్మీ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇస్తారని, సవరించిన పింఛన్ సదుపాయం, ఆర్థిక సాయం, ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, ఎక్స్‌గ్రేషియా మొత్తాలకు ఇది అదనమని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
యుద్ధభూమిలో బాల్యం
పాఠశాలల్లో, ఆట మైదానాల్లో హాయిగా గడవాల్సిన బాల్యం కొన్ని దేశాల్లో యుద్ధోన్మాదుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోతోంది. ఉద్రిక్తతలు ఉండే కొన్ని ప్రాంతాల్లోని చిన్నారులు యుద్ధ సమస్యల్లో చిక్కుకుని నలిగిపోతున్నారు. తీవ్రవాదులు, సైనిక పక్షాలు పిల్లలను బాల సైనికులుగా, ఆత్మాహుతిదళ సభ్యులుగా, మానవకవచాలుగా మారుస్తున్నాయి. ఆడపిల్లలు తీవ్రమైన లైంగిక దాడులను, పీడనను ఎదుర్కొంటు న్నారు. చిన్నవయసులోనే వారంతా లైంగిక బానిసలుగా మారుతున్నారు. ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాల్లోని సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్రవాద గ్రూపుల కబంధహస్తాల్లో చిక్కుకున్న కొందరు పిల్లలు అక్కడి నుంచి బయటపడ్డాక భద్రతా బలగాల చేతుల్లో పడి మరోసారి అణచివేతకు, వేధింపులకు గురవుతున్నారు. యుద్ధ ఛాయలు కనిపిస్తున్న మరికొన్ని ప్రదేశాల్లోని చిన్నారులు తిండి, నీళ్లు, పారిశుధ్యం వంటి కనీస సౌకర్యాలకు నోచుకోక పోషకాహార లోపంతో రోగాల బారిన పడుతున్నారు. ఈ పిల్లల పాలిట 2017 క్రూరమైన ఏడాదిగా నిలుస్తోందని యూనిసెఫ్ తాజా నివేదిక ఆందోళన వెలిబుచ్చింది. అంతర్జాతీయ మానవ తా విలువలు, పిల్లల హక్కులకు ఏమాత్రం విలువనివ్వ కుండా ఒకవైపు సైన్యం, మరోవైపు సాయుధ సైనిక ముఠాలు వ్యవహరిస్తున్న తీరును యూనిసెఫ్ తప్పుబట్టింది. యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాదాపు మూడుకోట్ల మంది పిల్లలు బలవంతంగా బడులకు దూరమైనట్లు తెలిపింది. ‘ఈ దేశాల్లోని పిల్లలు ఇళ్లు, పాఠశాలలు, ఆటస్థలాలు ఇలా అన్ని చోట్ల దాడులకు, క్రూరమైన హింసకు గురవుతున్నారు. ప్రతి ఏడాదీ ఈ దాడులు పెరగడం. ఇది ఎంతమాత్రం మంచిది కాదు’ అని యూనిసెఫ్ అత్యవసర కార్యక్రమా ల డైరెక్టర్ మాన్యువల్ చెప్పారు. దారుణాలివీ... ► నైజీరియా, ఛాద్, నైజర్, కేమరూన్‌లలో విస్తరించి ఉన్న ‘బోకో హరం’ ఉగ్రవాద సంస్థ 2016 కంటే 2017లో అయిదు రెట్లు ఎక్కువగా పిల్లలను ఆత్మాహుతి దళాలుగా మార్చింది. ► తిరుగుబాటు ద్వారా సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్లో బోకోహరం ఆధిపత్యంపెరిగాక ఎంతోమంది పిల్లలు హత్యాచారాలకు గురయ్యారు. బలవంతంగా సాయుధ ముఠాల్లో చేర్చారు. ► కాంగోలో రాజకీయ, సాయుధ హింస కారణంగా 8.5 లక్షల మంది పిల్లలు ఇళ్లకు దూరమయ్యారు. ► సోమాలియాలో 2017 అక్టోబర్ కల్లా 1800 మంది పిల్లలను సాయుధగ్రూపుల్లో చేర్చుకున్నారు. దక్షిణ సూడాన్‌లో 19 వేల మంది పిల్లలు కూడా ఈ జాబితాలో భాగంగా ఉన్నారు. ► మూడేళ్ల అంతర్గత సంక్షోభం కారణంగా యెమెన్‌లో 5,000 మంది అమాయక చిన్నారులు మరణించారు. 18 లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ► ఇరాక్, సిరియాలో పిల్లలు మానవకవచాలుగా ఉపయోగపడుతున్నారు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌లో 700 మంది పిల్లలు చనిపోయారు ► రోహింగ్యాల పిల్లలను ఒక క్రమపద్ధతిలో మయన్మార్ నుంచి బయటకు తరిమేస్తున్నారు. ఆ దేశంలోని సగానికి పైగా రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయేలా అక్కడి ప్రభుత్వం దాడులు, హింసాకాండకు దిగింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
యుద్ధట్యాంక్‌నుంచే క్షిపణి ప్రయోగం
సాక్షి, న్యూఢిల్లీ : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అర్జున్ యుద్ధ ట్యాంక్‌కును మరింత శక్తివంతంగా డీఆర్డీఓ రూపొందిస్తోంది. అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంక్‌గా ఇప్పటికే గుర్తింపు దీనికి గుర్తింపు లభించింది. వచ్చే ఏడాది నాటికి ఈ యుద్ధ ట్యాంక్‌కు క్షిపణులు ప్రయోగించే సామర్థ్యాన్ని అందించనున్నట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఉన్నతాధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉందని డీఆర్డీఓ అధికారులు తెలిపారు. అర్జున్ ఎంకే2 ట్యాంక్ సైనిక అవసరాలకు అద్వితీయంగా ఉపయోగ పడుతుందని వారు చెబుతున్నారు. అర్జున్ ట్యాంక్‌నుంచి 1200 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం చేధించేలా.. రూపొందించామని అధికారులు తెలిపారు. మొదట 500 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల పరిధి సైన్యానికి సరిపోతుందని భావించినా.. తరువాత దానిని 1200 మీటర్లకు పొడిగించినట్లు డీఆర్డీఓ అధికారులు తెలిపారు. అర్జున్ ఎంకే-1తో పోలిస్తే.. అర్జున్ ఎంకే-2 యుద్ధట్యాంక్ అత్యంత అధునాతనమైందని, అందులో పలు ఫీచర్లను అప్డేట్ చేసినట్లు వారు చెప్పారు. ఇదిలావుండగా ఇప్పటికే సైన్యం దగ్గర అర్జున్ ఎంకే-1 యుద్ధట్యాంకులు 119 ఉండగా.. అందులో 80 యుద్ధట్యాంకులను పూర్తిగా ఆధునీకరించారు. -
యుద్ధక్షేత్రంలో శాంతి సందేశం
సందర్భం- 14 న బుద్ధపూర్ణిమ మానవుడు తన శక్తియుక్తుల్ని సమసమాజాల కోసం, శాంతి సుఖాల కోసం వెచ్చించాలి అనే అహింసా సందేశాన్ని ఈ అవనికి అందించిన అజరామరుడు గౌతమబుద్ధుడు. బుద్ధుడు ఒక శాంతి ప్రదాతే కాదు! శాంతి దూత కూడా. అహింస, శాంతి అనే మానవీయ విలువల్ని ప్రపంచానికి అందించిన దేశం మనది. సాటి మనుషుల్ని మనుషులుగా చూడడమొక్కటే ‘మానవీయం’ కాదని; సమస్త జీవకోటిని, చరాచర ప్రపంచాన్ని ప్రకృతినీ ప్రేమతో చూసినప్పుడే అది మానవీయత అవుతుందని ప్రపంచానికి చాటిన బుద్ధ భగవానుడు పుట్టిన పుణ్యభూమి ఇది. సంపదల కోసం, అధికారం కోసం మానవ రక్తాన్ని ఏరుల్లా పాలించిన ఈ ప్రపంచానికి మనిషి మనిషిగా బ్రతకడానికి, ఈ సృష్టిలో ఒక ‘మంచి’ జీవిగా మనుగడ సాగించడానికి బుద్ధుడు ప్రబోధించిన శాంతి సందేశం ఒక వరం. ‘‘రణరక్తం కాని చోటు భూస్థలమంతా వెదకినా దొరకదు.. గతమంతా తడిసె రక్తమున.. కాకుంటే కన్నీరులతో....’’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఒక వ్యక్తి మరోవ్యక్తిని, ఒక జాతి మరో జాతిని, ఒక దేశం మరో దేశాన్ని... ఇలా చంపుకుతిన్న దాఖలాలు చరిత్ర నిండా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిల నరమేధం తర్వాత అణుబాంబు ఫార్ములా సృష్టికర్త అయిన ఐన్‌స్టీన్‌ని ఒక విలేకరి ఇలా అడిగాడు - ‘‘సర్, ఇప్పుడే ఇలా ఉంది. ఇక, మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎంత వినాశనం జరుగుతుంది?’’ అని. దానికి ఐన్‌స్టీన్, ‘‘మూడో ప్రపంచ యుద్ధం సంగతి అయితే నాకు తెలియదు. నాలుగో ప్రపంచ యుద్ధాన్ని మాత్రం ఆటవిక మానవులు కర్రల్తో చేసుకుంటారు’’ అన్నాడు. అంటే ప్రపంచం యుద్ధో న్మాదంతో సర్వనాశనం అవుతుందని ఆయన ఉద్దేశం. యుద్ధాలకి మానవుని పచ్చి ‘దురాశే’ కారణమని బుద్ధుని అభిప్రాయం. ‘ఆశ’ వల్లే మానవ జాతి దుఃఖసాగరంలో పడి మునిగి పోతోందనేది బుద్ధుని ఆలోచన. ఈ ఆశ, దురాశలు దూరం చేసుకుంటే సమాజంలో శాంతి జీవనం నెలకొంటుందని ఆయన ప్రబోధించాడు. ప్రజలు శాంతియుత జీవనం సాగించాలంటే పంచశీలతను పాటిస్తూ ‘అష్టాంగ మార్గం’ అవలంబించాలని సూచించాడు. బుద్ధుడు గొప్ప ధర్మ ప్రవక్త. ఈర్ష్యలు, ద్వేషాలు, మోహాలు, మత్సరాలు, అహంకారాలు, అణచివేతలు లేని సమ సమాజం కోసం కుటుంబాన్ని, రాజ్యాన్నీ, రాజ్యాధికారాన్నీ, అన్నింటినీ త్యజించి, నలభై ఏళ్లపాటు కాలినడకన దేశం మొత్తం తిరిగి తన శాంతి సందేశాన్ని గ్రామ గ్రామాన వినిపించాడు. బుద్ధుడు కేవలం బోధనలతో సరిపెట్టుకున్న ప్రవక్త మాత్రమే కాదు. అహింస, శాంతి, సమత నెలకొల్పడానికి అహరహం కృషి చేశాడు. ఎన్నో హింసల్ని నిలువరించాడు. ఎన్నో యుద్ధాల్ని జరక్కుండా చూశాడు. బుద్ధుడు స్వయంగా యుద్ధ క్షేత్రాల మధ్య నిలబడి అడ్డుకున్న యుద్ధాలూ ఉన్నాయి! యుద్ధాలను నివారించాక గౌతముడు సర్వాన్నీ త్యజించి, ధ్యానం చేసి, జ్ఞానం పొంది, బుద్ధునిగా మారాడు. మరలా ఎనిమిదేళ్ల తర్వాత ఆ రెండు రాజ్యాల మధ్య అదే సమస్యలవల్ల యుద్ధం ఖాయం అయ్యింది. ఈ విషయం బుద్ధునికి తెలిసింది. అప్పుడు బుద్ధుడు రాజగృహలో ఉంటున్నాడు. విషయం తెలిసి హుటాహుటిన బయలు దేరాడు. అప్పటికే యుద్ధం మొదలైంది. ఇరు రాజ్యాల సైనికులు లుంబిని ప్రాంతంలో కలబడ్డారు. బుద్ధుడు నిస్సంకోచంగా యుద్ధ క్షేత్రం మధ్యలోకి వెళ్లి నిలబడ్డాడు. ఇరు సైనికుల్ని శాంతింప చేశాడు. ఆయనకి ఒక వైపు తన తండ్రి వంశం వారు. మరోవైపు తన తల్లి వంశం వారు. ఇరు గణనాయకుల్ని పిలిపించాడు. ‘‘ఓ! గణవీరులారా! మీరెందుకిలా చీటికి మాటికి యుద్ధానికి తలపడుతున్నారు. పెద్దలందరూ కూర్చొని, నీటి పంపక విషయంలో కొన్ని విధివిధానాలు ఏర్పాటు చేసుకోవచ్చుగదా! ఆ నియమాల్ని ఏ ఒక్కరూ అతిక్రమించకుండా నడచుకుంటే ఇరు రాజ్యాలు క్షేమంగా, శాంతంగా, సుఖంగా ఉంటాయి గదా! ఈ పని చేయకుండా నీటికోసం, రక్తాన్ని ధారపోస్తున్నారా? మీకు నీరు ముఖ్యమా! రక్తం ముఖ్యమా! మీ వీరత్వాన్ని ప్రజలందరూ సుఖంగా బ్రతకడం కోసం వినియోగించండి. ప్రకృతి కల్గించే ఇబ్బందుల పరిష్కారం కోసం ఎంతో విలువైన మీ ప్రాణాల్ని, రక్తాన్నీ ధారపోయకండి. రాజ్యాన్ని శోకజలంతో నింపకండి. శాంతించండి. శాంతి చర్చలు జరపండి. యుద్ధాన్ని ఆపండి. ఆయుధాలు పడేయండి. ఆనకట్టలు కట్టి వరద జలాన్ని వృధా చేయకుండా రక్షించుకోండి. మీ శక్తి యుక్తులు ‘నిర్మాణానికి’ ఉపయోగించండి. వినాశకానికీ, విధ్వంసానికీ కాదు-’’ అని గొప్ప సందేశం ఇచ్చాడు. శాంతి ఉపదేశం ప్రబోధించాడు. అదే విధంగా మగధరాజు అజాతశత్రువు, కోసలరాజు ప్రసిద్ధ జిత్తుల చేత ఎన్నో యుద్ధాల్ని ఆపించాడు. ఈ ప్రపంచం అనవసరపు యుద్ధాల ద్వారా ఎన్నో కోట్ల మానవుల్ని బలి తీసుకుంది. అంటే ఎంత ‘మానవసంపద’ హరింపబడిందో కదా. - బొర్రా గోవర్ధన్ బుద్ధుని వల్లే ఆ యుద్ధం ఆగిపోయింది! బుద్ధుని కాలంలో మన దేశంలో పదహారు రాజ్యాలుండేవి. వీటిని షోడశ మహా జనపథాలు అనేవారు. వీటిలో చాలా రాజ్యాలు గణతంత్ర రాజ్యాలు. కోసల, మగధలు మాత్రమే రాచరిక రాజ్యాలు. బుద్ధుడు శాక్యవంశం వాడు. బుద్ధుని తల్లి మాయాదేవి ‘కొలియ’ వంశం ఆడపడుచు. శాక్యులవీ, కొలియులవీ వేరు వేరు గణ రాజ్యాలు. ఈ రెండు రాజ్యాల మధ్యగా రోహిణి నది ప్రవహిస్తుంది. ఈ నదికి ఎగువన కొలియ రాజ్యం, దిగువన శాక్య రాజ్యం ఉండేవి. వర్షాలు బాగా పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ నీరంతా లోతట్టుకు ప్రవహించి శాక్యరాజ్యం వరదల పాలయ్యేది. అలాగే వర్షాభావం ఏర్పడినప్పుడు కొలియులు కిందికి నీరు రానిచ్చేవారు కాదు. దానితో శాక్యుల పంటపొలాలన్నీ ఎండిపోయేవి. ఈ విషయం మీద వాగ్వివాదాలు పెరిగి ఇరు రాజ్యాలకీ యుద్ధం వచ్చింది. ‘చర్చల’ ద్వారా పరిష్కరించుకునే ఈ సమస్యను యుద్ధందాకా లాక్కెళ్లడం బుద్ధునికి ఇష్టం లేదు. ఒక యువరాజుగా సైన్యాన్ని నడిపించాల్సిన వాడే యుద్ధాన్ని వ్యతిరేకించాడు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందా మన్నాడు. అలాగని, బుద్ధుడు పిరికివాడు కాదు. యుద్ధ కళలన్నింటిలో, అన్ని గణరాజ్యాల యువకులందరి కంటే మేటిగా నిలచిన వాడే! యుద్ధం వద్దన్న విషయంపై సొంత గణం వారు బుద్ధుణ్ణి ఎంతో నిందించారు. అయినా, ఆయన మనస్సు యుద్ధాన్ని వ్యతిరేకించింది. ఇంతలో వర్షాలు పడ్డాయి. దానితో యుద్ధం ఆగిపోయింది.