సాక్షి, న్యూఢిల్లీ : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అర్జున్ యుద్ధ ట్యాంక్‌కును మరింత శక్తివంతంగా డీఆర్‌డీఓ రూపొందిస్తోంది. అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంక్‌గా ఇప్పటికే గుర్తింపు దీనికి గుర్తింపు లభించింది. వచ్చే ఏడాది నాటికి ఈ యుద్ధ ట్యాంక్‌కు క్షిపణులు ప్రయోగించే సామర్థ్యాన్ని అందించనున్నట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఉన్నతాధికారులు ప్రకటించారు.
ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉందని డీఆర్‌డీఓ అధికారులు తెలిపారు. అర్జున్ ఎంకే2 ట్యాంక్ సైనిక అవసరాలకు అద్వితీయంగా ఉపయోగ పడుతుందని వారు చెబుతున్నారు. అర్జున్ ట్యాంక్‌నుంచి 1200 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం చేధించేలా.. రూపొందించామని అధికారులు తెలిపారు. మొదట 500 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల పరిధి సైన్యానికి సరిపోతుందని భావించినా.. తరువాత దానిని 1200 మీటర్లకు పొడిగించినట్లు డీఆర్‌డీఓ అధికారులు తెలిపారు.
అర్జున్ ఎంకే-1తో పోలిస్తే.. అర్జున్ ఎంకే-2 యుద్ధట్యాంక్ అత్యంత అధునాతనమైందని, అందులో పలు ఫీచర్లను అప్‌డేట్ చేసినట్లు వారు చెప్పారు. ఇదిలావుండగా ఇప్పటికే సైన్యం దగ్గర అర్జున్ ఎంకే-1 యుద్ధట్యాంకులు 119 ఉండగా.. అందులో 80 యుద్ధట్యాంకులను పూర్తిగా ఆధునీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment