న్యూఢిల్లీ: యుద్ధభూమిలో మరణించే సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. ప్రస్తుతం ఈ మొత్తం రూ.2 లక్షలు మాత్రమే ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచేందుకు మంత్రి అంగీకరించారని శనివారం కొందరు అధికారులు తెలిపారు. యుద్ధాల్లో 60 శాతం కంటే ఎక్కువ వైకల్యం ప్రాప్తించిన వారికీ ఈ మొత్తం చెల్లిస్తారు. పెరిగిన మొత్తాన్ని ఆర్మీ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇస్తారని, సవరించిన పింఛన్ సదుపాయం, ఆర్థిక సాయం, ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, ఎక్స్‌గ్రేషియా మొత్తాలకు ఇది అదనమని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment