Minister of Defense
-
రక్షణ రంగంలో సహకారం బలోపేతం
టోక్యో: రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, జపాన్‌లు నిర్ణయించుకున్నాయి. జపాన్ పర్యటనలో భాగంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆ దేశ రక్షణ మంత్రి యసుకజు హమదాతో చర్చలు జరిపారు. ఇరు దేశాల సైన్యాల సమన్వయం మరింతగా పెరిగేందుకు వీలుగా తొలిసారిగా రెండు దేశాల అధునాతన యుద్ధవిమానాలతో కూడిన సంయుక్త సైనిక విన్యాసాలకూ ఆమోదం తెలుపుతూ మంత్రులిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమ స్వేచ్ఛాయుత, వ్యూహాత్మక ఒప్పందాలు చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తాయని భారత్, జపాన్ భావిస్తున్న తరుణంలో ఇరు దేశాల రక్షణ మంత్రుల భేటీ జరగడం గమనార్హం. ‘రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలై 70 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి’ అని రాజ్‌నాథ్ ట్వీట్‌చేశారు. భారత రక్షణ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పరిశ్రమలను రాజ్‌నాథ్ కోరారు. మరోవైపు, భారత్–జపాన్ 2+2 మంత్రుల భేటీలో భాగంగా జపాన్ విదేశాంగ మంత్రి యొషిమస హయషితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చించారు.‘ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఇతర దేశాలతో విభేదాలను పరిష్కరించుకోవాలని, బెదిరింపులకు, సైనిక చర్యలకు పాల్పడకూడదు. దేశాల మధ్య తగాదాలు, వాతావరణ మార్పులతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమౌతోంది. దీంతో ఇంథన, ఆహార భద్రత సంక్షోభంలో పడుతోంది’ అని జైశంకర్ అన్నారు. -
అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు వక్ర భాష్యాలా?
ముంబై: భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డ్రాగన్ దేశం చైనాపై మరోసారి పరోక్షంగా నిప్పులు చెరిగారు. కొన్ని బాధ్యతారాహిత్యమైన దేశాలు సంకుచిత ప్రయోజనాలే లక్ష్యంగా ఆధిపత్య ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తున్నామని ఆరోపించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు(యూఎన్క్లాస్) వక్ర భాష్యాలు చెబుతూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయని విమర్శించారు. కొన్ని దేశాలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ చట్టాలను బలహీన పరుస్తుండడం ఆందోళనకరమని అన్నారు. దేశీయంగా నిర్మించిన క్షిపణుల విధ్వంసక వాహక నౌక ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ఆదివారం మహారాష్ట్రలోని ముంబై తీరంలో రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా అరేబియాలో సముద్రంలో జల ప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన భారత్ బాధ్యతాయుతంగా పనిచేస్తోందని, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను గౌరవిస్తోందని చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని తాము కోరుకుంటున్నట్లు గుర్తుచేశారు. ఇక్కడ అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలకు రక్షణ లభించాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో దేశాల స్థిరత్వం, ఆర్థిక పురోగతి, ప్రపంచాభివృద్ధి కోసం నిబంధనలతో కూడిన స్వేచ్ఛాయుత నౌకాయానం, సముద్ర మార్గాల రక్షణ చాలా అవసరమని వివరించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు సొంత భాష్యాలు చెబుతూ ఉల్లంఘిస్తుండడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటివి స్వేచ్ఛాయుత నౌకాయానికి అడ్డంకులు సృష్టిస్తాయని చెప్పారు. భారత నావికాదళం పాత్ర కీలకం ఇండో–పసిఫిక్ ప్రాంతం కేవలం ఇక్కడి దేశాలకే కాదు, మొత్తం ప్రపంచానికి చాలా కీలకమని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఈ ప్రాంత భద్రత విషయంలో భారత నావికాదళం తనవంతు కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారతదేశ ప్రయోజనాలు హిందూ మహాసముద్రంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇండో–పసిఫిక్ ప్రాంతం ఒక ఆయువు పట్టు అని ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సైనిక సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. ఆయుధాలు, సైనిక రక్షణ పరికరాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ ఖర్చు 2.1 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. రక్షణ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణంలో భారత్‌ను కేంద్ర స్థానంగా మార్చాలన్నారు. శత్రువుల పాలిట సింహస్వప్నం ఐఎన్ఎస్ విశాఖపట్నం.. హిందూ మహా సముద్ర ప్రాంత రక్షణలో కీలకంగా మారనుంది. సముద్ర ఉపరితలం నుంచి సముద్ర ఉపరితలానికి, సముద్ర ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోసుకెళ్లనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖపట్నం శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. బరువు: 7,400 టన్నులు పొడవు: 163 మీటర్లు వెడల్పు: 17.4 మీటర్లు వేగం: గంటకు 30 నాటికల్ మైళ్లు పరిధి: ఏకధాటిగా 4,000 నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగలదు ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ ర్యాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్లు నాలుగు, రెండు జలాంతర్గామి విధ్వంసక రాకెట్ లాంచర్లు, కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్, రాకెట్ లాంచర్, అటోమేటెడ్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్. – సాక్షి, విశాఖపట్నం -
లద్దాఖ్‌కు చేరుకున్న రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: దేశం పట్ల సైనికులు, మాజీ సైనికుల అంకితభావం అందరికీ ఆదర్శప్రాయమైందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కొనియాడారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం లద్దాఖ్‌కు చేరుకున్న రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణేతో కలిసి మాజీ సైనికులను కలుసుకుని వారి సంక్షేమంతోపాటు దేశభద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ‘మన సైనికబలగాలు, మాజీ సైనికులు దేశం పట్ల చూపే అంకితభావం అందరికీ ఆదర్శప్రాయం. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాజీ సైనికులు ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెస్తాం’ అని మంత్రి రాజ్‌నాథ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం లేహ్‌లో కార్గిల్, లేహ్, లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యులతో అభివృద్ధిపై చర్చించారు.సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించు కునేందుకు మొరాయిస్తున్న నేపథ్యంలో సైనిక బలగాల సన్నద్ధతను స్వయంగా ఆయన పరిశీలించనున్నారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మంత్రి ఎత్తైన పర్వత ప్రాంతాల్లోని వ్యూహాత్మక సైనిక శిబిరాలను సందర్శించి, వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంతోపాటు బలగాల స్థైర్యాన్ని పెంచుతారని చెప్పాయి. -
భారత్‌లో అమెరికా రక్షణ మంత్రి పర్యటన
న్యూఢిల్లీ: అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమెరికా రక్షణ మంత్రి లాయడ్ జే ఆస్టిన్ తొలిసారిగా భారత్‌లో పర్యటనకు వచ్చారు. మూడురోజుల ఈ పర్యటనలో ద్వైపాక్షిక రక్షణను బలోపేతం చేసుకోవడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. యూఎస్ నుంచి 30 మల్టీమిషన్ ఆర్మ్డ్ ప్రెడేటర్ డ్రోన్స్‌ను కొనుగోలు చేసే 300 కోట్ల డాలర్ల డీల్ తాజా పర్యటనలో తుదిదశకు చేరవచ్చని భావిస్తున్నారు. బోయింగ్, లాక్‌హీడ్ నుంచి 1800 కోట్ల విలువైన 114 ఫైటర్ జెట్లను కొనుగోలుపై కూడా చర్చలు జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్యానుంచి భారత్ కొనుగోలు చేయదలిచిన ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థపై చర్చిస్తారని భావిస్తున్నారు. అమెరికా ఈ ఒప్పందం విషయంలో మొదటి నుంచీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి ఆస్టిన్ ప్రధాని మోదీని శుక్రవారం కలిశారు. అనంతరం మాట్లాడుతూ భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రధాని మోదీతో రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చించామన్నారు. -
ఇరాన్‌తో చర్చలు ఫలవంతం
టెహ్రాన్: ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ హటామితో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతతోపాటు అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. పలు అంశాలపై పరస్పరం అభి ప్రాయాలు పంచుకున్నామని, ఈ చర్చలు ఫలవంతమయ్యా యని రాజ్ నాథ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాజ్‌నాథ్ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని అక్కడి నుంచి శనివారం ఇరాన్‌కు వచ్చారు. ఇరాన్ రక్షణ మంత్రి వినతి మేరకే ఈ భేటీ జరిగిందని రక్షణ శాఖ తెలిపింది. ఇరువురు నేతలు సాంస్కృతిక, భాషా, పౌర సంబంధాలు తదితర అంశాలపై సుహృ ద్భావ వాతావరణంలో చర్చలు జరిపారని చెప్పింది. ప్రాంతీయ భద్ర త, శాంతి పరిరక్షణ కోసం ఇరు దేశాల అధికారులు పరస్పరం సం ప్రదింపులు జరుపుతూనే ఉన్నారంది. ‘ఈ రీజియన్‌లోని దేశాలతో భా రత్ స్నేహ సంబంధాలను కోరుకుంటుంది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు , ద్వైపాక్షిక సంబంధాల్లో ఇతరుల జో క్యం నివారణకు కృషి చేస్తాం’అని రాజ్‌నాథ్ చెప్పారు. అంతర్యుద్ధం తో అతలా కుతలమవుతున్న అఫ్గానిస్తాన్‌లో పరిస్థితిపై భారత్ ఆం దోళ న వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్ మంత్రితో భేటీ ప్రాధాన్యం సంత రించుకుంది. తాలిబాన్లు అమెరికాతో శాంతి ఒప్పందం కుదు ర్చు కు న్న తర్వాత రాజకీయ సుస్థిరత ఏర్పాటుపై భారత్ మరింత దృష్టిసారించింది. -
వీరజవాన్లకు సాయం 4రెట్లు
న్యూఢిల్లీ: యుద్ధభూమిలో మరణించే సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. ప్రస్తుతం ఈ మొత్తం రూ.2 లక్షలు మాత్రమే ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచేందుకు మంత్రి అంగీకరించారని శనివారం కొందరు అధికారులు తెలిపారు. యుద్ధాల్లో 60 శాతం కంటే ఎక్కువ వైకల్యం ప్రాప్తించిన వారికీ ఈ మొత్తం చెల్లిస్తారు. పెరిగిన మొత్తాన్ని ఆర్మీ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇస్తారని, సవరించిన పింఛన్ సదుపాయం, ఆర్థిక సాయం, ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, ఎక్స్‌గ్రేషియా మొత్తాలకు ఇది అదనమని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
రాబర్ట్ వాద్రాకు మరో గట్టి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : నగదు అక్రమ చలామణి ద్వారా విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు గట్టి షాక్ తగిలింది. రాబర్ట్ వాద్రా బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి సంస్థ ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఈ గ్రూపు సంస్థలు, ఇతర విభాగాలతో అన్ని వ్యాపార లావాదేవీలను కేంద్రం నిషేధించింది. ఈ మేరకు రక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో (ఫిబ్రవరి 2018)మొట్టమొదటిసారిగా ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్‌తో వ్యాపారాన్ని ఆరునెలలపాటు నిషేధించింది. తాజాగా తదుపరి ఆదేశాల వరకు నిషేధం కొనసాగుతుందని వెల్లడించడం గమనార్హం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక ఒప్పందాలతో (2005లో రక్షణ ఒప్పందం, 2009లో పెట్రోలియం,తదితర) భండారీకి సంబంధం ఉన్నాయని ఆరోపణలు. సంజయ్ భండారీ 2008లో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆఫ్సెట్ ఇండియా సొల్యుషన్స్ కంపెనీ కొన్నేళ్లలో కొన్ని కోట్ల రూపాయలకు ఎలా ఎదిగిందో దర్యాప్తు జరపాల్సిందిగా 2014లో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐబీ అధికారులను ఆదేశించింది. 2012లో భారత ప్రభుత్వంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు శిక్షణ విమానాల ఒప్పందాన్ని చేసుకున్న స్విస్ సంస్థ 'పిలాటస్'తో భండారీకి సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ యాజమాన్యంతో రాబర్ట్ వాద్రా కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఐబీ అధికారులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు 2016 లో ఐటీ దాడుల నేపథ్యంలో డిఫెన్స్ డీలర్ సంజయ్ భండారి లండన్ పారిపోయాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ రాబర్ట్ వాద్రా కస్టోడియల్ రిమాండ్‌ను కోరుతోంది. పెట్రో, రక్షణ వ్యవహారాల్లో భండారి లంచాలు తీసుకున్నారని దర్యాప్తు ఏజెన్సీ పేర్కొంది. అలాగే లండన్ నుంచి భండారిని తిరిగి ఇండియాకు రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
రెండంకెల వృద్ధికి తీవ్రంగా ప్రయత్నించాలి..
న్యూఢిల్లీ: రెండంకెల వృద్ధి రేటు సాధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అవసరమని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) సభ్యురాలు షమికా రవి చెప్పారు. 7 శాతం వృద్ధితో సరిపెట్టుకోకూడదని ఆమె స్పష్టంచేశారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఎదిగే క్రమంలో మధ్యలోనే ఆగిపోయే ‘మధ్యాదాయ చట్రం’లో భారత్ ఇరుక్కుపోతుందంటూ సహచర ఈఏసీ–పీఎం సభ్యుడు రతిన్‌రాయ్ చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. బ్రూకింగ్స్ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ సందర్భంలో రతిన్ రాయ్ మాట్లాడుతూ... ‘‘1991 నుంచి మన ఆర్థిక వ్యవస్థ ఎగుమతులపై ఆధారపడి వృద్ధి చెందడం లేదు. దేశంలోని పది కోట్ల మంది వినియోగం ఆధారంగానే వృద్ధి చెందుతోంది. భారత వృద్ధి ప్రస్థానానికి శక్తినిస్తోంది వీరే. అంటే త్వరలోనే మనం ఓ దక్షిణ కొరియా కాదు, చైనా కూడా కాబోవడం లేదు. బ్రెజిల్, దక్షిణాఫ్రికా కానున్నాం. అధిక సంఖ్యలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారితో మధ్యదాయ దేశంగా మారబోతున్నాం’’అని అన్నారు. దానిపై షమికా ఈ వ్యాఖ్యలు చేశారు . -
స్త్రీలోక సంచారం
ఈ ఏడాది స్త్రీవాదంపై ఏడు ఇంగ్లిష్ పుస్తకాలు విడుదల అవుతున్నాయి. ఇవన్నీ కూడా నాన్ ఫిక్షన్. కల్పన ఉండదు. కవిత్వం ఉండదు. అంటే వీటిని చదివి అర్థం చేసుకోడానికి ఇంగ్లిష్ బాగా వచ్చి ఉండాలనేం లేదు. తేలిగ్గా పేజీలు తిప్పేయొచ్చు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు కదా. ఈ కొత్త పుస్తకాల్లో ఉండేదంతా పవరే అని పబ్లిషర్లు చెబుతున్నారు. జడీ స్మిత్ రాస్తున్న ‘ఫీల్ ఫ్రీ’ ఫిబ్రవరిలో మార్కెట్లోకి వస్తోంది. జడీ బ్రిటన్‌కు ప్రియాతిప్రియమైన రచయిత్రి. ఫిబ్రవరిలోనే ‘రీసిస్టర్స్’ అనే పుస్తకం వస్తోంది. ఇప్పటి వరకు చరిత్ర సృష్టించిన 52 మంది యువతుల సక్సెస్ అండ్ స్ట్రగుల్ స్టోరీలు ఇందులో ఉంటాయి. రాస్తోంది లారెన్ షార్కీ. ఈమెదీ బ్రిటనే. ఫిబ్రవరిలోనే వస్తున్న ఇంకో పుస్తకం ‘ది జెండర్డ్ బ్రెయిన్’. మహిళల మస్తిష్క శక్తిపై ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం ఇది. రచయిత్రి జినా రిప్పన్. బ్రిటన్ జాతీయురాలు. మార్చిలో ‘ది ఉమెన్స్ సఫ్రేజ్ మూవ్మెంట్’ అనే పుస్తకం వస్తోంది. రచన శాలీ రోచ్ వాగ్నర్. ఆమెది న్యూయార్క్. మార్చిలోనే రాబోతున్న ఇంకో పుస్తకం ‘వాయిసెస్ ఆఫ్ పవర్ఫుల్ ఉమెన్’. రాస్తోంది జోయే శాలిస్. 40 మంది ప్రపంచ మహిళల స్ఫూర్తివంతమైన లఘు వ్యాసాలు ఇందులో ఉంటాయి. శాలిస్ భారతీయ సంతతి ఇంగ్లండ్ రచయిత్రి. ఇక జూలైలో నిమ్కో అలీ రాసిన ‘రూడ్’ వస్తోంది. ఇది కొంచెం బోల్డ్‌గా ఉండే పుస్తకంలా అనిపిస్తోంది. దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఓవర్–షేరింగ్ అనే ట్యాగ్‌లైన్ కనిపిస్తుంది పుస్తకం టైటిల్ కింద. ‘ఎక్కువగా చెప్పేయడం అనేది ఉండదు ఏ విషయం కూడా’ అని అర్థం. వ్యక్తిగత విషయాల్లో దాపరికాలు అవసరం లేదని! నిమ్కో అలీ సోమాలియా సోషల్ యాక్టివిస్టు. అలాగే సెప్టెంబర్‌లో ‘మిడిల్ ఈస్ట్రన్ ఉమెన్ అవుట్‌సైడ్ ది స్టీరియోటైప్స్’ అనే పుస్తకం వస్తోంది. రచయిత్రి ఆల్యా మూరో. ఆల్యాది కూడా బ్రిటనే. యంగ్ అండ్ఎనర్జిటిక్ రైటర్. రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూతురు అంటూ ఫొటో ఒకటి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అందులో సీతారామన్ పక్కన ఉన్న యువతి ఒక ఆర్మీ అధికారి తప్ప సీతారామన్ కూతురు కాదని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు ట్విట్టర్లో స్పష్టం చేశారు. ఆ ఉమెన్ ఆఫీసర్ కోరిక మేరకు సీతారామన్ ఆమెతో కలిసి ఫొటో దిగారని తెలిపారు. సీతారామన్ కూతురు వాంగ్మయి అసలు రక్షణశాఖలోనే లేరు. యు.ఎస్.లోని నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీలో జర్నలిజం చేసి సామాజిక వార్తా కథనాల నివేదనను తన కెరీర్‌గా మలుచుకున్నారు. -
‘రక్షణ’ బాధ్యతలు చేపట్టిన నిర్మల
న్యూఢిల్లీ: మిలిటరీ సన్నద్ధత, రక్షణ రంగంలో ‘మేకిన్ ఇండియా’ అమలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, సైనికుల సంక్షేమాలే తన ప్రాథమ్యాలని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత తొలి పూర్తిస్థాయి మహిళా రక్షణ మంత్రిగా ఆమె గురువారం బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి ఆర్థిక మంత్రి, మాజీ రక్షణ మంత్రి జైట్లీ, నిర్మల తల్లిదండ్రులు హాజరయ్యారు. అంతకు ముందు ఆమె చాంబర్లో పూజలు నిర్వహించారు. సైనిక బలగాల సన్నద్ధతకు అధిక ప్రాధాన్యమిస్తానని నిర్మల చెప్పారు. రక్షణ రంగ శక్తి, సామర్థ్యాల పెంపునకు ‘మేకిన్ ఇండియా’ ప్రధాన పాత్ర పోషించాలని, సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి పాటుపడతానని ఆమె అన్నారు. మాజీ సైనికులకు రూ.13 కోట్లు బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్మలా సీతారామన్ సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ నుంచి రూ.13 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ నిధులను 8685 మంది మాజీ సైనికులు, అమరుల భార్యలు, వారి కుటంబ సభ్యుల సంక్షేమానికి వినియోగిస్తారు. రక్షా మంత్రి ఎక్స్–సర్వీస్‌మెన్ ఫండ్ నుంచి కూడా ఆర్థిక సాయం చేయడానికి మంత్రి అంగీకారం తెలిపారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈమెతో సమావేశమయ్యారు.