ఈ ఏడాది స్త్రీవాదంపై ఏడు ఇంగ్లిష్ పుస్తకాలు విడుదల అవుతున్నాయి. ఇవన్నీ కూడా నాన్ ఫిక్షన్. కల్పన ఉండదు. కవిత్వం ఉండదు. అంటే వీటిని చదివి అర్థం చేసుకోడానికి ఇంగ్లిష్ బాగా వచ్చి ఉండాలనేం లేదు. తేలిగ్గా పేజీలు తిప్పేయొచ్చు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు కదా. ఈ కొత్త పుస్తకాల్లో ఉండేదంతా పవరే అని పబ్లిషర్‌లు చెబుతున్నారు. జడీ స్మిత్ రాస్తున్న ‘ఫీల్ ఫ్రీ’ ఫిబ్రవరిలో మార్కెట్‌లోకి వస్తోంది. జడీ బ్రిటన్‌కు ప్రియాతిప్రియమైన రచయిత్రి. ఫిబ్రవరిలోనే ‘రీసిస్టర్స్’ అనే పుస్తకం వస్తోంది. ఇప్పటి వరకు చరిత్ర సృష్టించిన 52 మంది యువతుల సక్సెస్ అండ్ స్ట్రగుల్ స్టోరీలు ఇందులో ఉంటాయి. రాస్తోంది లారెన్ షార్కీ. ఈమెదీ బ్రిటనే. ఫిబ్రవరిలోనే వస్తున్న ఇంకో పుస్తకం ‘ది జెండర్డ్ బ్రెయిన్’. మహిళల మస్తిష్క శక్తిపై ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం ఇది.
రచయిత్రి జినా రిప్పన్. బ్రిటన్ జాతీయురాలు. మార్చిలో ‘ది ఉమెన్స్ సఫ్రేజ్ మూవ్‌మెంట్’ అనే పుస్తకం వస్తోంది. రచన శాలీ రోచ్ వాగ్నర్. ఆమెది న్యూయార్క్. మార్చిలోనే రాబోతున్న ఇంకో పుస్తకం ‘వాయిసెస్ ఆఫ్ పవర్‌ఫుల్ ఉమెన్’. రాస్తోంది జోయే శాలిస్. 40 మంది ప్రపంచ మహిళల స్ఫూర్తివంతమైన లఘు వ్యాసాలు ఇందులో ఉంటాయి. శాలిస్ భారతీయ సంతతి ఇంగ్లండ్ రచయిత్రి. ఇక జూలైలో నిమ్‌కో అలీ రాసిన ‘రూడ్’ వస్తోంది. ఇది కొంచెం బోల్డ్‌గా ఉండే పుస్తకంలా అనిపిస్తోంది. దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఓవర్–షేరింగ్ అనే ట్యాగ్‌లైన్ కనిపిస్తుంది పుస్తకం టైటిల్ కింద. ‘ఎక్కువగా చెప్పేయడం అనేది ఉండదు ఏ విషయం కూడా’ అని అర్థం. వ్యక్తిగత విషయాల్లో దాపరికాలు అవసరం లేదని! నిమ్‌కో అలీ సోమాలియా సోషల్ యాక్టివిస్టు.
అలాగే సెప్టెంబర్‌లో ‘మిడిల్ ఈస్ట్రన్ ఉమెన్ అవుట్‌సైడ్ ది స్టీరియోటైప్స్’ అనే పుస్తకం వస్తోంది. రచయిత్రి ఆల్యా మూరో. ఆల్యాది కూడా బ్రిటనే. యంగ్ అండ్‌ఎనర్జిటిక్ రైటర్. రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూతురు అంటూ ఫొటో ఒకటి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అందులో సీతారామన్ పక్కన ఉన్న యువతి ఒక ఆర్మీ అధికారి తప్ప సీతారామన్ కూతురు కాదని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. ఆ ఉమెన్ ఆఫీసర్ కోరిక మేరకు సీతారామన్ ఆమెతో కలిసి ఫొటో దిగారని తెలిపారు. సీతారామన్ కూతురు వాంగ్మయి అసలు రక్షణశాఖలోనే లేరు. యు.ఎస్.లోని నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీలో జర్నలిజం చేసి సామాజిక వార్తా కథనాల నివేదనను తన కెరీర్‌గా మలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment