అమ్మాయే అబ్బాయి అయితే! | Adah Sharma To Play The Role Of A Man | Sakshi
Sakshi News home page

అమ్మాయే అబ్బాయి అయితే!

Apr 23 2019 12:32 AM | Updated on Apr 23 2019 12:32 AM

Adah Sharma To Play The Role Of A Man - Sakshi

అదా శర్మ

ఓ అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన తర్వాత అబ్బాయికి తెలిసిందేంటంటే తను పెళ్లి చేసుకున్న అమ్మాయి లింగ మార్పిడి చేసుకున్న అబ్బాయి అని. అప్పుడు పెళ్లి కొడుకు ఏం చేశాడన్నదే చిత్రకథ. దర్శకుడు అభిర్‌ సేన్‌ గుప్తా తెరకెక్కిస్తున్న ‘మ్యాన్‌ టు మ్యాన్‌’ కథ ఇది. విచిత్రంగా ఉంది కదూ. ఇందులో అదా శర్మ, నవీన్‌ జంటగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో అదా శర్మ అబ్బాయి పాత్రలో నటించడం విశేషం. లింగ మార్పిడి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కామెడీ చిత్రమిది. ఇందులో అబ్బాయి పాత్రలో నటించడం గురించి అదా మాట్లాడుతూ – ‘‘నా కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి కూడా విభిన్న పాత్రలు ఎంపిక చేసుకోవడం మీదే ఎక్కువ దృష్టి పెట్టాను. ఫస్ట్‌ టైమ్‌ అబ్బాయిగా నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాకుండా ఓ మెసేజ్‌ కూడా ఇందులో చెప్పబోతున్నాం’’ అన్నారు దర్శకుడు అభిర్‌ సేన్‌గుప్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement