navin
-
నవీన్ ఫ్లోరైన్- రూట్ మొబైల్స్.. దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో డిజిటల్ కమ్యూనికేషన్ సేవల కంపెనీ రూట్ మొబైల్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ నికర లాభం 43 శాతం ఎగసి రూ. 68 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 17 శాతం పుంజుకుని రూ. 319 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 3.23 శాతం బలపడి 24.9 శాతానికి ఎగశాయి. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు నవంబర్ 11 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నవీన్ ఫ్లోరైన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.5 శాతం దూసుకెళ్లి రూ. 2,260 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2,268 సమీపానికి చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. రూట్ మొబైల్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో రూట్ మొబైల్స్ నికర లాభం రెట్టింపునకుపైగా పెరిగి రూ. 33 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 77 శాతం జంప్‌చేసి రూ. 349 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 2.3 శాతం బలపడి 13.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో రూట్ మొబైల్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 964 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం లాభపడి రూ. 990 సమీపానికి చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. కాగా.. గత మూడు రోజుల్లో ఈ షేరు 25 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
అమ్మాయే అబ్బాయి అయితే!
ఓ అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన తర్వాత అబ్బాయికి తెలిసిందేంటంటే తను పెళ్లి చేసుకున్న అమ్మాయి లింగ మార్పిడి చేసుకున్న అబ్బాయి అని. అప్పుడు పెళ్లి కొడుకు ఏం చేశాడన్నదే చిత్రకథ. దర్శకుడు అభిర్ సేన్ గుప్తా తెరకెక్కిస్తున్న ‘మ్యాన్ టు మ్యాన్’ కథ ఇది. విచిత్రంగా ఉంది కదూ. ఇందులో అదా శర్మ, నవీన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అదా శర్మ అబ్బాయి పాత్రలో నటించడం విశేషం. లింగ మార్పిడి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కామెడీ చిత్రమిది. ఇందులో అబ్బాయి పాత్రలో నటించడం గురించి అదా మాట్లాడుతూ – ‘‘నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా విభిన్న పాత్రలు ఎంపిక చేసుకోవడం మీదే ఎక్కువ దృష్టి పెట్టాను. ఫస్ట్ టైమ్ అబ్బాయిగా నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఓ మెసేజ్ కూడా ఇందులో చెప్పబోతున్నాం’’ అన్నారు దర్శకుడు అభిర్ సేన్‌గుప్తా. -
కమర్షియల్ టెంపర్
నవీన్, షాలినీ చౌహాన్ , శుభాంగి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘షార్ట్ టెంపర్’. ప్రవీణా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాఘవ దర్శకత్వంలో ఎన్.ఆర్.ఆర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తం హైదరాబాద్‌లో జరిగింది. ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ మాట్లాడుతూ – ‘‘నేను ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా ఉన్నాను. రైటర్, డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలు చేశాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. హీరోగారు జిమ్‌లో 8 గంటలు కష్టపడుతున్నారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. కామెడీ టచ్ ఉన్న సినిమాలంటే నాకు ఇష్టం. ఇందులో అలీగారు, ఆదిత్యా ఓమ్ కీలక పాత్రలు చేస్తున్నారు. రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. బ్యాంకాక్‌లో షూట్ చేయనున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘రాఘవగారు కథ చెబుతున్నప్పుడే సినిమా చూసినట్టు అనిపించింది. బాగా డిజైన్ చే శారు’’ అన్నారు నవీన్. -
మాస్ మెచ్చేలా ఫైట్స్
నవీన్, పల్లవి జంటగా కె. కృష్ణప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డేర్’. యన్. కరణ్‌రెడ్డి సమర్పణలో యన్. రామారావు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా యన్. కరణ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకుల ఊహకందని సన్నివేశాలు చాలా ఉన్నాయి. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి. నవీన్ కొత్త కుర్రాడైనా చక్కగా నటించాడు. తను చేసిన ఫైట్స్ మాస్ ప్రేక్షకులకు నచ్చుతాయి. జి.ఆర్. నరేన్ స్వరపరచిన ఈ సినిమా పాటలు ఇప్పటికే శ్రోతలకు బాగా చేరువయ్యాయి. మా సినిమా తప్పకుండా ప్రేక్షలకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకట్, నిర్మాణం: యన్. వరలక్ష్మి. -
స్నేహితుడి నివాసంలో శవమై..
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థిని తన స్నేహితుడి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతి ఇప్పుడు సంచలనం రేకిత్తిస్తోంది. ప్రస్తుతం చనిపోయిన ఆ అమ్మాయి గత రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిందని, ఇప్పుడామె చనిపోయిందని తెలియడం తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అర్జూ సింగ్ అనే యువతి థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు రెండు రోజులగా కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఢిల్లీలోని శక్తినగర్ లో ఆమె విగత జీవి తన స్నేహితుడు నవీన్ నివాసంలో కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నవీన్ ను అరెస్టు చేశారు. దీంతో నవీన్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోవాలని, వారి తమ కూతురు ఏదో చేసి ఉండొచ్చని అర్జూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.