స్నేహితుడి నివాసంలో శవమై.. | Delhi University Student Found Dead At Friend's House | Sakshi

స్నేహితుడి నివాసంలో శవమై..

Feb 7 2016 2:10 PM | Updated on Sep 28 2018 3:41 PM

స్నేహితుడి నివాసంలో శవమై.. - Sakshi

స్నేహితుడి నివాసంలో శవమై..

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థిని తన స్నేహితుడి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతి ఇప్పుడు సంచలనం రేకిత్తిస్తోంది.

న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థిని తన స్నేహితుడి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతి ఇప్పుడు సంచలనం రేకిత్తిస్తోంది. ప్రస్తుతం చనిపోయిన ఆ అమ్మాయి గత రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిందని, ఇప్పుడామె చనిపోయిందని తెలియడం తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసిందని కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అర్జూ సింగ్ అనే యువతి థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు రెండు రోజులగా కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఢిల్లీలోని శక్తినగర్ లో ఆమె విగత జీవి తన స్నేహితుడు నవీన్ నివాసంలో కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నవీన్ ను అరెస్టు చేశారు. దీంతో నవీన్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోవాలని, వారి తమ కూతురు ఏదో చేసి ఉండొచ్చని అర్జూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement