వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడం ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండింగ్‌గా మారింది. ప్రేక్షకులు కూడా ఆ తరహా సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు. దానికి కారణం.. ఆ సంఘటన జరిగినప్పుడు మనకు ఎవ్వరికీ తెలియని నిజాలను థియేటర్ లో చూపిస్తారని. ఇక ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అని తెలియడంతోనే వివాదాలు చుట్టుముడతాయి. సాధారణంగా జరిగిన ఒక హత్యపై బయోపిక్ తీస్తేనే.. ఇలాంటివి ప్రేక్షకులకు ఎలా చూపిస్తారు అని కొంతమంది మీడియా ముందే నిగ్గుతీసి అడుగుతున్నారు. అలాంటింది దేశాలు మొత్తం హడలిపోయే టాపిక్ ను సినిమాగా తీస్తే వివాదాలను ఆపడం ఎవరి వల్ల కాదు.
(చదవండి: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు )
కానీ కొంతమంది ధైర్యంగల దర్శకులు.. నిజాలను ప్రేక్షకులకు చూపించడమే పనిగా పెట్టుకున్నారు. అలా నిజాన్ని బయట పెట్టిన సినిమాల్లో ఒకటి ది కాశ్మీర్ ఫైల్స్.. కాశ్మీర్ లో పండితులు ఎలాంటి ఊచకోతకు గురయ్యారో.. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఈ వివాదం ఇప్పటికీ హాట్ టాపిక్ గా ఉంది అంటే .. అందులో ఎలాంటి కథను చూపించి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంకా ఈ హీట్ తగ్గనే లేదు.. మరో బాలీవుడ్ డైరెక్టర్ మరో సంచలన ఘటనను తెరమీదకు తీసుకొచ్చాడు. అదే ది కేరళ స్టోరీ.
‘కేరళ స్టోరీ’లో చూపించేది ఏంటి?
మూడేళ్ళ క్రితం అనగా 2018- 2019 లో కేరళనే కాదు భారతదేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసిన కథ ఇది. దాదాపు 32, 000 మంది అమ్మాయిలు కనపడకుండా పోతే.. వారు ఎక్కడ ఉన్నారు..? ఏమైపోయారు..? అని అడిగినవారు లేరు అంటే నమ్ముతారా..? ఇక ఆ కథనే డైరెక్టర్ సుదీప్తోసేన్.. ది కేరళ స్టోరీగా తెరకెక్కించాడు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వివాదాలు ఒక్కొక్కటిగా ముసురుతున్నాయి.
టీజర్‌లో ఏంముంది?
కేరళకు చెందిన నలుగురు అమ్మాయిలు నర్సింగ్ కాలేజ్ లో చేరతారు. అక్కడ వారిని ట్రాప్ చేయడానికి ఐసీసీ ఎన్నో పధకాలు వేసి వారిని ఇస్లాం మతంలోకి రప్పిస్తుంది. అందుకోసం ఎంతటి నీచమైన పనికి అయిన సిద్ధమవుతుంది. ఆ అమ్మాయిలను ప్రేమ పేరుతో లొంగదీసుకుని, వారిని పెళ్లి వరకు తీసుకొచ్చి.. పెళ్లి చేసుకొనే సమయంలో వారి పేర్లు మార్చాలని చెప్పి వారిని బలవంతంగా ఇస్లాంమతంలోకి దింపుతారు. ఇక పెళ్లి తరువాత వారిని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులుగా మారుస్తారు. ఏడాదిలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తారు. చూచాయగా చెప్పుకోవాలంటే ఇది కథ. ఇలాంటి కథను చూపించాలంటే డైరెక్టర్ కు ఘట్స్ ఉండాలి. సుదీప్తోసేన్ లో ఆ ఘట్స్ కనిపిస్తున్నాయి.
వివాదం ఏంటి?
ఇక ఇందులో వివాదం ఏంటి.. అంటే .. ఈ విషయంపై కొంతమంది మాజీ ముఖ్యమంత్రికి చెప్పడం, వారు పట్టించుకోలేదని టీజర్ లో చెప్పుకొచ్చారు. ఇలాగే చేస్తే కేరళ ఇస్లామిక్ స్టేట్ గా మారిపోతుంది అని ఒక జర్నలిస్ట్ చెప్పడాన్ని టీజర్ లో చూపించారు. అదే ఇప్పుడు రాజకీయ వివాదానికి పునాది వేసింది. అసలు ఇలాంటి ఘటన కేరళలో జరగలేదని రాజకీయ నేతలు అంటున్నారు. భావ స్వేచ్ఛ ఉంటే మాత్రం ఇలాంటి సినిమాలు తీయొచ్చా అని ప్రశ్నిస్తున్నారు.
సీఎం పినరయి ఆగ్రహం
ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళను తీవ్రవాదులకు హెల్ప్ చేసే రాష్ట్రంగా చూపిస్తున్నారు.. ప్రపంచం ముందు మమ్మల్ని దోషులుగా నిలబెడుతున్నారు. విద్వేషాన్ని రగల్చడమే ధ్యేయంగా రూపొందిచిన ఈ చిత్రాన్ని నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు.
మొత్తనికి ది కేరళ స్టోరీ ఎన్నో వివాదాలకు నెలవుగా మారింది. ఇంకోపక్క ఈ సినిమను తెరకెక్కించిన సుదీప్తో మాట్లాడుతూ.. ‘నేను ఈ కథ కోసం దాదాపు ఏడేళ్లు రీసెర్చ్ చేశాను.. కేరళ ప్రజలు నిరక్ష్యరాసులు అయితే కాదు. విద్య సహనాన్ని ఇస్తుంది.. టీజర్ కే ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు.. సినిమా చూడండి .. చూశాకా మాట్లాడండి’ అని చెప్పుకొచ్చాడు. ఇక హీరోయిన్ అదా సైతం.. ఈ కథ నిజమైంది అని, తాను కూడా ఆబాధిత యువతులతో మాట్లాడానని, సినిమా చూశాక అందరు కంటతడి పెడతారని చెప్పుకొచ్చింది . ఇన్ని వివాదాలు రేకెత్తించిన ఈ సినిమా మే 5 అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో..? ఎంతమంది రాజకీయ నాయకులకు చెమటలు పట్టిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment