
అదా శర్మ
హీరోయిన్లు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తుంటారు. ఒక సెట్ నుంచి మరో సెట్‌కు వెళ్తూ సినిమాలు త్వరగా పూర్తి చేయగలుగుతారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఒక సెట్ నుంచి ఇంకో సెట్‌కి వెళ్లడం అంటే కొంచెం రిస్కే. అందుకే ఒక సినిమా యూనిట్ నుంచి మరో యూనిట్‌లో జాయిన్ అయ్యే మధ్యలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు అదా శర్మ. తన స్టాఫ్ మొత్తాన్ని కూడా క్వారంటైన్‌లో ఉంచుతున్నారామె.
ఇటీవలే రెండు తెలుగు సినిమాలు అంగీకరించారు అదా. ఆల్రెడీ ఈ సినిమాల చిత్రీకరణ ప్రారంభం అయింది. ఒక సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. మరో సినిమా చిత్రీకరణ నీలగిరి అడవుల్లో జరగనుంది. ఈ అడవుల్లోనే ఓ మేన్షన్‌లో ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు అదా. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నీలగిరి అడవులు భలే అందంగా ఉన్నాయి.
మేం ఉండే బంగ్లా అడవి మధ్యలో ఉంది. ఇది భయంకరమైన ప్రదేశమని చాలా మంది చెప్పారు. కానీ చాలా అందంగా ఉంది. ఒక యూనిట్ నుంచి మరో యూనిట్‌తో కలసి పని చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సెట్లో భౌతిక దూరం పాటించడం కొంచెం కష్టం. కానీ ముందే ఇలా క్వారంటైన్‌లో ఉండి చిత్రీకరణ ప్రారంభిస్తే ఇబ్బంది ఉండదని మా అభిప్రాయం’’ అన్నారు అదా. ఈ రెండు సినిమాలే కాకుండా ‘కమాండో 4, మ్యాన్ టూ మ్యాన్’ అనే హిందీ సినిమాల్లో అదా కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment