పట్టరాని సంతోషం... ఆ వెంటనే తెలియని దిగులు.. | Adah Sharma to play bipolar character in Chuha Billi | Sakshi
Sakshi News home page

పట్టరాని సంతోషం... ఆ వెంటనే తెలియని దిగులు..

Published Sun, Feb 7 2021 12:34 AM | Last Updated on Sun, Feb 7 2021 12:36 AM

Adah Sharma to play bipolar character in Chuha Billi - Sakshi

అదా శర్మ

కాసేపు పట్టరాని సంతోషం... ఆ వెంటనే తెలియని దిగులు. బైపోలార్‌ డిజార్డర్‌ సమస్యకు సంబంధించిన లక్షణం ఇది. తాజా సినిమాలో బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతున్న అమ్మాయిలా కనిపించనున్నారు అదా శర్మ. ‘చుహా బిల్లీ’ అనే హిందీ సినిమా చేస్తున్నారీ బ్యూటీ. ప్రసాద్‌ కడమ్‌ దర్శకుడు. ఈ సినిమాలో మానసికంగా బాధపడుతూ, డిప్రెషన్‌లో ఉండే పాత్రలో కనిపిస్తారామె. ‘‘ఈ పాత్ర నాకో చాలెంజ్‌’’ అంటున్నారు అదా. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ –‘‘చుహా బిల్లీ’ అనేది చాలా డార్క్‌ కథాంశం. ఈ సినిమాలో పాత్ర స్వభావానికి నేను పూర్తి విరుద్ధంగా ఉంటాను. అందుకే చేయాలనుకున్నాను. ఈ పాత్ర కోసం చాలా వర్క్‌షాప్స్‌ చేస్తున్నాం. నేనిప్పటివరకూ చేసిన సినిమాల్లో ఇది చాలా భిన్నంగా ఉంటుంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement