'పీకే' గెటప్లో బ్రహ్మానందం | Brahmanandam to emulate Aamir's 'PK' look in 'Garam' | Sakshi
Sakshi News home page

'పీకే' గెటప్లో బ్రహ్మానందం

Published Mon, Sep 14 2015 2:01 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

Brahmanandam to emulate Aamir's 'PK' look in 'Garam'

చెన్నై: బాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీ 'పీకే' విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. రైల్వే ట్రాక్ మధ్యలో ట్రాన్సిస్టర్ అడ్డంపెట్టుకుని, నగ్నంగా నిలబడ్డ ఆమీర్ ఖాన్ పోస్టర్ చర్చనీయాంశమైంది. తెలుగు సినీ అభిమానులు కామెడీ కింగ్ బ్రహ్మానందాన్ని 'పీకే' లుక్లో చూడవచ్చు. మన బ్రహ్మానందం ఆమీర్లా నగ్నంగా కాదు కానీ విభిన్న గెటప్లో దర్శనమిస్తారు.

'గరం' సినిమాలో బ్రహ్మానందంపై ఇలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు ఈ సినిమా వర్గాలు తెలిపాయి. బ్రహ్మానందం స్కర్ట్ ధరించి ట్రాన్సిస్టర్ చేతపట్టుకుని.. ఆమీర్ ఖాన్ను అనుకరిస్తూ ఓ సన్నివేశంలో నటించినట్టు వెల్లడించాయి. ఈ సీన్ తీసినపుడు కడుపుబ్బ నవ్వుకున్నామని, థియేటర్లలో ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేసినట్లు తెలిపాయి. 'పీకే'లో ఆమీర్ ఖాన్ గెటప్లో ఉన్న బ్రహ్మానందం పోస్టర్ను ఆదివారం రాత్రి విడుదల చేశారు. మదన్ దర్శకత్వం వహిస్తున్న గరం సినిమాలో ఆది, ఆదాశర్మ నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement