surya prathap
-
స్పీడ్ పెరిగింది
సినిమాల ఎంపిక విషయంలో హీరో నితిన్ స్పీడ్ పెంచినట్లు ఉన్నారు. ఆల్రెడీ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆయన ‘భీష్మ’ అనే చిత్రానికి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కుమారి 21ఎఫ్’ చిత్రం ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని సమాచారం. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తారు. దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే బాధ్యతలు స్వీకరించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తారు. ‘100 పర్సెంట్ లవ్’ సినిమా తర్వాత ‘బన్నీ’ వాసు, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమాలో కథానాయికగా ప్రముఖ హీరోయిన్ల పేర్లతో పాటుగా, కొత్త హీరోయిన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు చిత్రబృందం. -
21ఎఫ్కి మించి
హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వటం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ‘కుమారి 21ఎఫ్’ వంటి యూత్‌ఫుల్ హిట్ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్ – దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఎస్.ఆర్.టి ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి ఈ హిట్ కాంబినేషన్ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘దర్శకుడు చెప్పిన కథ విని బాగా ఎగై్జట్ అయ్యాను. ‘కుమారి 21ఎఫ్’ లాగే యూత్‌ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. 21ఎఫ్ మించిన స్థాయిలో ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు. రామ్ తాళ్ళూరి ఇటీవలే రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ నటించిన ‘రాజుగాడు’ ఈ సంక్రాంతికి విడుదల కానుందట. -
కుమారి దర్శకుడితో మరో సినిమా
‘కుమారి 21ఎఫ్’ లాంటి యూత్ ఫుల్ & సెన్సేషనల్ హిట్ తరువాత ఆ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, కథానాయకుడు రాజ్ తరుణ్ ల క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా రామ్ తాళ్ళూరి ఈ క్రేజీ ప్రొజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ‘కుమారి 21ఎఫ్’ తరహాలోనే యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలో ప్రారంభం కానున్న ఈసినిమా విశేషాలను చిత్రయూనిట్ వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. ‘హిట్ కాంబినేషన్ పల్నాటి సూర్య ప్రతాప్-రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.2గా రూపొందించనుండడం ఆనందంగా ఉంది. సూర్యప్రతాప్ చెప్పిన కథ విని ఎంతగానో ఎగ్జైట్ అయ్యాను, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ‘కుమారి 21ఎఫ్’ను మించిన స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది’ అన్నారు. రామ్ తళ్లూరి ఇప్పటికే రవితేజ, కళ్యాణ్ కృష్ణల కాంబినేషన్ లో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. -
కుమారి లేకుండా మరో సినిమా..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా కుమారి 21 ఎఫ్. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. సూర్య ప్రతాప్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాతో హీరోయిన్ హెబ్బా పటేల్, హీరో రాజ్ తరుణ్ లు బిజీ ఆర్టిస్ట్ లుగా మారిపోయారు. సుకుమార్ కు కూడా నిర్మాతగా మరిన్ని సినిమాలు చేసే ధైర్యాన్నిచ్చింది కుమారి 21ఎఫ్. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. సుకుమార్ నిర్మాణంలో సూర్య ప్రతాప్ దర్శకుడిగా రాజ్ తరుణ్ హీరోగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ నే తీసుకుంటున్నారు. పూర్తిగా కుమారి 21 ఎఫ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను మాత్రం మారుస్తున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ ల కాంబినేషన్ చాలా సార్లు రిపీట్ అవ్వటంతో కొత్త సినిమా కోసం మరో హీరో హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.