నితిన్
సినిమాల ఎంపిక విషయంలో హీరో నితిన్ స్పీడ్ పెంచినట్లు ఉన్నారు. ఆల్రెడీ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆయన ‘భీష్మ’ అనే చిత్రానికి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కుమారి 21ఎఫ్’ చిత్రం ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని సమాచారం. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తారు. దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే బాధ్యతలు స్వీకరించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తారు. ‘100 పర్సెంట్ లవ్’ సినిమా తర్వాత ‘బన్నీ’ వాసు, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమాలో కథానాయికగా ప్రముఖ హీరోయిన్ల పేర్లతో పాటుగా, కొత్త హీరోయిన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు చిత్రబృందం.
Comments
Please login to add a commentAdd a comment