21ఎఫ్‌కి మించి | Young actor Raj Tarun teams up with Kumari 21F’s director Palnati Surya Pratap | Sakshi
Sakshi News home page

21ఎఫ్‌కి మించి

Published Fri, Dec 22 2017 12:20 AM | Last Updated on Fri, Dec 22 2017 12:20 AM

Young actor Raj Tarun teams up with Kumari 21F’s director Palnati Surya Pratap - Sakshi

హిట్‌ కాంబినేషన్స్‌ రిపీట్‌ అవ్వటం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ‘కుమారి 21ఎఫ్‌’ వంటి యూత్‌ఫుల్‌ హిట్‌ ఇచ్చిన హీరో రాజ్‌ తరుణ్‌ – దర్శకుడు సూర్య ప్రతాప్‌ పల్నాటి మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఎస్‌.ఆర్‌.టి ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌ తాళ్ళూరి ఈ హిట్‌ కాంబినేషన్‌ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘దర్శకుడు చెప్పిన కథ విని బాగా ఎగై్జట్‌ అయ్యాను.  ‘కుమారి 21ఎఫ్‌’ లాగే యూత్‌ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. 21ఎఫ్‌ మించిన స్థాయిలో ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు. రామ్‌ తాళ్ళూరి ఇటీవలే రవితేజ హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని కూడా అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. రాజ్‌ తరుణ్‌ నటించిన ‘రాజుగాడు’ ఈ సంక్రాంతికి విడుదల కానుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement