భిన్న పార్శ్వాలున్న పాత్రలో... | kumari 21 f movie shooting Started | Sakshi
Sakshi News home page

భిన్న పార్శ్వాలున్న పాత్రలో...

Published Sun, Mar 15 2015 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

భిన్న పార్శ్వాలున్న పాత్రలో...

భిన్న పార్శ్వాలున్న పాత్రలో...

‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ యువహీరో నటిస్తున్న మూడో చిత్రం ఆదివారం ప్రారంభమైంది. రచయిత శ్రీనివాస్ గవిరెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శైలేంద్రబాబు, శ్రీధర్‌రెడ్డి, హరీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి బేబి గౌతమి కెమెరా స్విచాన్ చేయగా, ఐపీఎస్ అధికారి రావులపాటి సీతారామారావు క్లాప్ ఇచ్చారు. యువదర్శకుడు విరించి వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత తల్లిదండ్రులు స్క్రిప్ట్ అందించారు. ఈ వేడుకలో దర్శకులు ఎన్. శంకర్, మారుతి, మదన్, హీరో ఆది అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో రాజ్ తరుణ్‌ది భిన్న పార్శ్వాలున్న పాత్ర’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: విశ్వ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement