కొరియోగ్రాఫర్గా దేవీశ్రీ ప్రసాద్ | music director devi sri prasad composing steps for kumari 21f song | Sakshi
Sakshi News home page

కొరియోగ్రాఫర్గా దేవీశ్రీ ప్రసాద్

Published Sat, Oct 3 2015 1:38 PM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM

కొరియోగ్రాఫర్గా దేవీశ్రీ ప్రసాద్

కొరియోగ్రాఫర్గా దేవీశ్రీ ప్రసాద్

సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి ఫాంలో ఉన్న దేవీ శ్రీ ప్రసాద్ మరో కొత్త అవతారం ఎత్తుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోలకు సంగీతం అదించటంతో పాటు అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా మెరుస్తున్న దేవీ తాజాగా కొరియోగ్రాఫర్గా మారాడు.

రెగ్యులర్గా తన సినిమాల ఆడియో ఫంక్షన్స్తో పాటు, ప్రమోషనల్ వీడియోస్లో కూడా తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ చూపిస్తున్న ఈ సంగీత తరంగం.. 'కుమారి 21 ఎఫ్' సినిమా కోసం నృత్య దర్శకుడిగా మారాడు. తనే సంగీతం అందించిన ఓ ఫంకీ సాంగ్ కోసం స్టెప్స్ కూడా కంపోజ్ చేస్తున్నాడు.

దేవీ శ్రీ ప్రసాద్ మిత్రుడు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న 'కుమారి 21 ఎఫ్' సినిమాలో రాజ్ తరుణ్, హేభ పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కథ స్క్రీన్ ప్లే మాటలు సుకుమార్ అందిస్తుండగా, ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement