నిఖిల్ తో జోడీ కట్టనున్న 'కుమారి' | Hebah Patel to team up with Nikhil Siddhartha | Sakshi
Sakshi News home page

నిఖిల్ తో జోడీ కట్టనున్న 'కుమారి'

Published Thu, Jan 7 2016 3:36 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

నిఖిల్ తో జోడీ కట్టనున్న 'కుమారి'

నిఖిల్ తో జోడీ కట్టనున్న 'కుమారి'

'కుమారి 21 ఎఫ్' సినిమాతో హిట్ సాధించిన హీరోయిన్ హేబా పటేల్ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.

చెన్నై: 'కుమారి 21 ఎఫ్' సినిమాతో హిట్ సాధించిన హీరోయిన్ హేబా పటేల్ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా నిఖిల్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. నిఖిల్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ హేబా ఎంపికైంది. ఫస్ట్ హీరోయిన్ గా అవికా గోర్ నటిస్తోంది. మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సివుందని దర్శకుడు ఆనంద్ తెలిపారు. రొమాంటిక్ ఫాంటసీగా తెరకెక్కనున్న ఈ సినిమాను వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. జనవరి 20 నుంచి షూటింగ్ మొదలుకానుంది.

కాగా, రాజ్ తరుణ్ తో మరో సినిమాలో నటించేందుకు హేబా పటేల్ ఇప్పటికే అంగీకరించింది. మంచు విష్ణు హీరోగా తనే నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరోగా రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్కు జోడీగా తొలుత అవికా గోర్ను తీసుకున్నారు. అయితే కుమారి 21 ఎఫ్ సక్సెస్ తరువాత మనసు మార్చుకున్న చిత్రయూనిట్, అవికా ప్లేస్లో హేబాను సెలెక్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement