చైతన్యరావు, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ఆర్ఐ ఎంటర్‌టైన్మెంట్స్ (USA) పతాకంపై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రం మొదటి పోస్టర్‌ని కింగ్ నాగార్జున విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..దర్శకుడు బాల నాకు సుపరిచితుడు. అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి డీన్ గా వ్యవహరించి, హాలీవుడ్ సినీ నిర్మాణ పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు పంచి ఇచ్చారు. అంతేకాక, మా విద్యార్థులకు, అధ్యాపకులకు 'హనీమూన్ ఎక్సప్రెస్' చిత్రం లో అవకాశాలు ఇచ్చాడు. ఈ చిత్ర కథ వినోదాత్మకంగా సమాజానికి చక్కని సందేశం కలిగి ఉంది. కళ్యాణి మాలిక్ గారి పాటలు అద్భుతంగా రొమాంటిక్ గా వచ్చాయి. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలి’అని అన్నారు.
‘‘హనీమూన్ ఎక్సప్రెస్' ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. చైతన్య రావు, హెబ్బా పటేల్ అద్భుతంగా నటించారు. తనికెళ్ల భరణి మరియు సుహాసిని గార్ల క్యారెక్టర్లు మా చిత్రానికి హైలైట్ గా ఉంటాయి. యూత్ కి, ప్రేమికుల కి మా చిత్రం అద్భుతంగా నచ్చుతుంది. త్వరలో రిలీజ్ వివరాలతో మీ ముందుకు వస్తాం" అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment