ఎన్ని కోట్లు పెట్టినా అది ఉంటేనే థియేటర్లకు వస్తారు: టాలీవుడ్ డైరెక్టర్‌ | Hebah Patel and Chaitanya Rao Starrer Honeymoon Express Movie Event | Sakshi
Sakshi News home page

Honeymoon Express: రొమాంటిక్ కామెడీ చిత్రంగా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌'.. రిలీజ్ ఎప్పుడంటే?

Published Thu, Jun 13 2024 7:45 PM | Last Updated on Thu, Jun 13 2024 8:17 PM

Hebah Patel and Chaitanya Rao Starrer Honeymoon Express Movie Event

చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం 'హనీమూన్ ఎక్స్ ప్రెస్;. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ కథాంశంగా దర్శకుడు బాల రాజశేఖరుని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ రచయిత విజయేంద్రప్రసాద్,  ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. 'హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ దర్శకుడు బాల మంచి డైరెక్టర్. హాలీవుడ్ లో మూవీస్ చేశాడు. ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. అతనితో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'అని అన్నారు. కేఎల్ ప్రసాద్ మాట్లాడుతూ..'హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా కంటెంట్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఈతరం ప్రేక్షకులు బాగా ఇష్టపడే సినిమా. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్' చెప్పారు.

దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ..'హనీమూన్ ఎక్స్ ప్రెస్‌ సినిమాకు నాగార్జున  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారివల్లే హనీమూన్ ఎక్స్ ప్రెస్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రసాద్ ల్యాబ్స్‌నే సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా లెగసీని కొనసాగిస్తున్న ప్లేస్. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా రూపొందించాం. ఎన్ని కోట్ల రూపాయల సినిమా అయినా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. థియేటర్‌కు వెళ్లాక ఒక ప్రేక్షకుడిని మెప్పించేది కంటెంట్ మాత్రమే. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మా సినిమాకు మీ ఆదరణ దక్కుతుందని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement