
చైతన్యా రావు, హెబ్బా పటేల్ ‘క్యూట్‌గా... స్వీట్‌గా...’ అంటూ పాట పాడుకున్నారు. ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రం కోసమే ఇలా పాడుకున్నారు. చైతన్యా రావు, హెబ్బా పటేల్ జంటగా రూపొందిన చిత్రం ఇది. ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలోని ‘క్యూట్‌గా... స్వీట్‌గా...’ అంటూ సాగే పాటను హీరో అడివి శేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాట స్వీట్‌గా ఉంది. సినిమా హిట్టవ్వాలన్నారు. చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరిచిన ఈ సాంగ్‌కు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించగా దీపు పాడారు. ‘‘ఇదొక మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ’’ అని బాల రాజశేఖరుని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment