చివరకు రాజ్ తరుణ్తో హేబా పెళ్లి..!
అలా ఎలా మూవీతో టాలీవుడ్కు పరిచయం అయిన హేబా పటేల్. రాజ్ తరుణ్ సరసన నటించిన కుమారి 21 ఎఫ్ సినిమాతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ జోడి అనిపించుకున్న రాజ్ తరుణ్ హేబాలు తరువాత ఈడో రకం ఆడో రకం సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ రెండు సినిమాల్లో వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి.
తాజాగా మరో సినిమాలో కలిసి నటించారు రాజ్ తరుణ్ హేబా పటేల్. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' సినిమాలో గెస్ట్ రోల్లో అలరించనున్నాడు రాజ్ తరుణ్. అశ్విన్, పార్వతీషం, నోయల్లు హేబా బాయ్ ఫ్రెండ్స్గా నటిస్తుండగా, క్లైమాక్స్లో హేబాను పెళ్లిచేసుకునే వరుడి పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నాడు. ఈ సినిమాతో ఈ జోడికి హ్యాట్రిక్ సక్సెస్ అందుతుందేమో చూడాలి.