ప్రస్తుత ప్రపంచంలో మనం ఏరంగంలోనైనా రాణించాలంటే కొత్తదనాన్ని కచ్చితంగా ఆహ్వానించాలని అంటోంది అందాల భామ హెబ్బా పటేల్. కెరీర్ మొదట్లో నటించిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో తన అందం, నటనతో యువతను కట్టిపడేసిన హెబ్బా గత కొన్నాళ్లుగా కాస్త వెనుకపడింది. నితిని ‘భీష్మ’లో అలా తళుక్కున మెరిసి, రామ్ ’రెడ్’ చిత్రంలో ఐటెమ్ పాత్రలో కనిపించడం మినహా పెద్దగా చెప్పకునే పాత్రలేమీ చేయలేదు. దీనికి గతంలో తను చేసిన తప్పులే కారణమని చెప్పుకొచ్చింది.
ఇక ఈ అమ్మడు ఆరంభంలో కుమారి 21 ఎఫ్ , ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా.. చిత్రాలతో మంచి విజయాల్ని అందుకున్నప్పటికీ అనంతరం సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేయడంతో కెరీర్ పరంగా వెనకబడింది. “24 కిస్సెస్’ సినిమా తర్వాత అతిథి పాత్రలు, ప్రత్యేక గీతాల్లో మాత్రమే కనిపించింది. అయితే ఒకానొక సమయంలో తన కెరీర్ గురించి భయమేసిందంటోంది హెబ్బా పటేల్. కానీ లాక్‌డౌన్ విరామ సమయంలో కెరీర్‌లో చేసిన తప్పుల్ని సమీక్షించుకున్నానని, ఇకపై కథల ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ‘ఓదెల రైల్వేస్టేషన్’లో పోషిస్తున్న పల్లెటూరి అమ్మాయి పాత్ర ఎంతో సంతృప్తినిచ్చిందని అంటోంది ఈ ముద్దు గుమ్మ. ఇప్పుడ తను కోరుకున్న పాత్రలు లభిస్తున్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment