టైటిల్: బ్లాక్ అండ్ వైట్
నటి నటులు: హెబ్బా పటేల్, సూర్య శ్రీనివాస్, లహరి శరీ, నవీన్ నేని తదితరులు
నిర్మాణ సంస్థలు: ఏ యు & ఐ స్టూడియోస్
నిర్మాత: పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి
దర్శకుడు: ఎల్ యెన్. వి సూర్య ప్రకాశ్
సంగీతం: అజయ్ అర్రసాడ
సినిమాటోగ్రఫీ: టి.సురేంద్ర రెడ్డి
విడుదల తేది: ఏప్రిల్ 14, 2023
తొలి సినిమా (కుమారి 21 ఎఫ్)తోనే సక్సెస్‌ని చూసింది హెబ్బా పటేల్. ఆ క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అయితే ఒకానొక దశలో ఆమె వరుస ఫ్లాపులను ఎదుర్కొంది. ఆ తరువాత కథానాయికగా వెనుకబడిన ఆమె, ఐటమ్ సాంగ్స్ లోను మెరిసింది. ఈ మధ్య కాలంలో తెరపై ఆమె కనిపించలేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు 'బ్లాక్ అండ్ వైట్' సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘బ్లాక్ అండ్ వైట్’ కథేంటంటే...
వర్ధన్(సూర్య శ్రీనివాస్), స్వరాంజలి(హెబ్బా పటేల్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. మూడేళ్ల పాటు కలిసి సహజీవనం చేస్తారు. అయితే ఓ రోజు ‘జాను’ అనే అమ్మాయి నుంచి వర్దన్‌కి మెసేజ్‌వస్తుంది. అది చూసి స్వరాంజలి అతనితో గొడవ పడుతుంది. కోపంలో అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు జాను ఎవరు? వర్దన్‌కు వచ్చిన మెసేజ్‌లో ఏం ఉంది? వర్ధన్ ని చంపినా స్వరాంజలి జైలు కి వెళ్లిందా? పప్పువా(నవీన్ నేని) ఎందుకు ‘స్వరాంజలి’ హౌస్ చుట్టూ తిరుగుతుంటాడు? అనేది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ప్రేమలో పడటం .. మోసపోవడం .. అందుకు ప్రతీకారం తీర్చుకోవడం..ఇలాంటి కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆ తరహా చిత్రమే. కపోతే, దర్శకుడు ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్ కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న కథ చూపించిన విధానం బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే లో ఇంకాస్త గ్రిప్పింగ్ ఉంటే బాగుండేది. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ టచ్ ఇంకాస్త పెంచితే బాగుండేదేమో.
సినిమాలో అక్కడక్కడ ‘వర్ధన్’ భయపెట్టించే కొన్ని సీన్స్ రక్తి కట్టిస్తాయి. సినిమా మొత్తం ఒక ఎత్తు అయ్యితే, క్లైమాక్స్ లో స్టేషన్ దగ్గర వచ్చే ట్విస్ రివీల్ చేసిన విధానం అదిరిపోతుంది. స్వరాంజలి కి ఎంతో ఇష్టమైన పెయింటింగ్ లైవ్ విజ్యువల్స్ బాగుంటాయి.
ఎవరెలా చేశారంటే..
మల్టీపుల్ షేడ్స్ ఉన్న స్వరాంజలి పాత్రకు హెబ్బా పటేల్ న్యాయం చేసింది. మునుపెన్నడు చూడని హెబ్బాను చూస్తారు. బిగ్ బాస్ ఫెమ్ ‘లహరి తనదైన యాక్టింగ్ ముద్ర వేసుకుంటూనే ముఖ్య పాత్ర పోషించింది. ‘సూర్య శ్రీనివాస్’ ఫ్లాష్ బ్యాక్ వెర్షన్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తునే ప్రెజెంట్ లో భయపెట్టించిన వేరియేషన్ బాగుంది. నవీన్ నేని పాత్రను సరిగ్గా స్క్రీన్ మీద ఉపయోగించలేకపోయినప్పటికీ యాక్టింగ్ లో బాగానే రాణించారు.
ఇక సాంకేతిక విషయానికొస్తే.. డైరెక్టర్ ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్ కథ, కాస్టింగ్ ఎంచుకున్న తీరు బాగుంది. కాకపోతే, కథ ని చెప్పడంలో కాస్త ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది. అజయ్ అర్రసాడ నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు పర్వాలేదు. టి.సురేంద్ర రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment