Black and White
-
చీర అందాలతో గ్లామర్ డోస్ పెంచిన మౌనీరాయ్ (ఫోటోలు)
-
మాటల్లేవ్ అంటున్న ప్రియమణి కిల్లింగ్ లుక్స్ చూశారా? (ఫొటోలు)
-
బ్లాక్ అండ్ వైట్ చీరలో పరిణితి హోయలు..ధర ఎంతంటే?
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటి. ఆమె నటనకు గాను ఫిల్మ్‌ఫేర్, నేషనల్ ఫిల్మ్ ఫేర్ వంటి అవార్డు అందుకుంది. 2013లో ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకుంది. ఇటీవలే ఆమ్ఆద్మీ పార్టీ సభ్యుడు రాఘవ్ చద్దాని పెళ్లి చేసుకుని వివాహం బంధంలో అడుగుపెట్టింది. అయినప్పటికీ కెరీర్ పరంగా దూసుకుపోతుంది పరిణితి. తన మూవీ చమ్కిలా మూవీ ప్రమోషన్లో భాగంగా పరిణితి బ్లాక్ అండ్ వైట్ చీరలో గ్లామరస్ లుక్‌లో సందడి చేసింది. ఎంబ్రాయిడరీతో కూడిన బ్లాక్ అండ్ వైట్ చీరలో సౌందర్యం అంతా ఆమెలోనే దాగుందా అన్నంత ఆకర్షణగా ఉంది. ఆ ఎంబ్రాయిడరీ చీరకు తగ్గట్టు హై నెక్బ్లౌజ్ జత చేయడం ఆమెకు మరింత అందాన్నితెచ్చి పెట్టింది . పూలా ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన బ్లాక్ అండ్ వైట్ ఆరు గజాల చీర ఆమె అందాన్ని రెట్టింపు చేసేలా మరింత అందంగా ఉంది పరిణితి. చాలా సింపుల్‌గా జస్ట్ చెవులకు మాత్రమే డైమెండ్లతో కూడిన చెవిపోగులు పెట్టుకుంది. లైట్ మేకప్‌తో కళ్లను హైలెట్ చేసేలా స్మోకీ ఐషాడో వేసుకుంది. హెయిర్‌ని ప్రీగా వదిలేసింది. ఇక ఇక్కడ పరిణితీ ధరించి చీర ప్రముఖ శ్రియా ఖన్నా బ్రాండ్‌కి చెందింది. ఈ బ్రాండ్ చీరలన్ని సంప్రదాయం ఉట్టిపడేలా చక్కటి ఎంబ్రాయిడర్‌తో హుందాగా ఉంటాయి. వాటి ధర రూ. 30 వేలు దాక పలుతుంది. View this post on Instagram A post shared by @parineetichopra (చదవండి: గ్లామరస్ క్వీన్ దీపిక బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
‘బ్లాక్ అండ్ వైట్’ మూవీ రివ్యూ
టైటిల్: బ్లాక్ అండ్ వైట్ నటి నటులు: హెబ్బా పటేల్, సూర్య శ్రీనివాస్, లహరి శరీ, నవీన్ నేని తదితరులు నిర్మాణ సంస్థలు: ఏ యు & ఐ స్టూడియోస్ నిర్మాత: పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి దర్శకుడు: ఎల్ యెన్. వి సూర్య ప్రకాశ్ సంగీతం: అజయ్ అర్రసాడ సినిమాటోగ్రఫీ: టి.సురేంద్ర రెడ్డి విడుదల తేది: ఏప్రిల్ 14, 2023 తొలి సినిమా (కుమారి 21 ఎఫ్)తోనే సక్సెస్‌ని చూసింది హెబ్బా పటేల్. ఆ క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అయితే ఒకానొక దశలో ఆమె వరుస ఫ్లాపులను ఎదుర్కొంది. ఆ తరువాత కథానాయికగా వెనుకబడిన ఆమె, ఐటమ్ సాంగ్స్ లోను మెరిసింది. ఈ మధ్య కాలంలో తెరపై ఆమె కనిపించలేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు 'బ్లాక్ అండ్ వైట్' సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘బ్లాక్ అండ్ వైట్’ కథేంటంటే... వర్ధన్(సూర్య శ్రీనివాస్), స్వరాంజలి(హెబ్బా పటేల్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. మూడేళ్ల పాటు కలిసి సహజీవనం చేస్తారు. అయితే ఓ రోజు ‘జాను’ అనే అమ్మాయి నుంచి వర్దన్కి మెసేజ్వస్తుంది. అది చూసి స్వరాంజలి అతనితో గొడవ పడుతుంది. కోపంలో అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు జాను ఎవరు? వర్దన్‌కు వచ్చిన మెసేజ్‌లో ఏం ఉంది? వర్ధన్ ని చంపినా స్వరాంజలి జైలు కి వెళ్లిందా? పప్పువా(నవీన్ నేని) ఎందుకు ‘స్వరాంజలి’ హౌస్ చుట్టూ తిరుగుతుంటాడు? అనేది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రేమలో పడటం .. మోసపోవడం .. అందుకు ప్రతీకారం తీర్చుకోవడం..ఇలాంటి కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆ తరహా చిత్రమే. కపోతే, దర్శకుడు ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్ కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న కథ చూపించిన విధానం బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే లో ఇంకాస్త గ్రిప్పింగ్ ఉంటే బాగుండేది. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ టచ్ ఇంకాస్త పెంచితే బాగుండేదేమో. సినిమాలో అక్కడక్కడ ‘వర్ధన్’ భయపెట్టించే కొన్ని సీన్స్ రక్తి కట్టిస్తాయి. సినిమా మొత్తం ఒక ఎత్తు అయ్యితే, క్లైమాక్స్ లో స్టేషన్ దగ్గర వచ్చే ట్విస్ రివీల్ చేసిన విధానం అదిరిపోతుంది. స్వరాంజలి కి ఎంతో ఇష్టమైన పెయింటింగ్ లైవ్ విజ్యువల్స్ బాగుంటాయి. ఎవరెలా చేశారంటే.. మల్టీపుల్ షేడ్స్ ఉన్న స్వరాంజలి పాత్రకు హెబ్బా పటేల్ న్యాయం చేసింది. మునుపెన్నడు చూడని హెబ్బాను చూస్తారు. బిగ్ బాస్ ఫెమ్ ‘లహరి తనదైన యాక్టింగ్ ముద్ర వేసుకుంటూనే ముఖ్య పాత్ర పోషించింది. ‘సూర్య శ్రీనివాస్’ ఫ్లాష్ బ్యాక్ వెర్షన్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తునే ప్రెజెంట్ లో భయపెట్టించిన వేరియేషన్ బాగుంది. నవీన్ నేని పాత్రను సరిగ్గా స్క్రీన్ మీద ఉపయోగించలేకపోయినప్పటికీ యాక్టింగ్ లో బాగానే రాణించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. డైరెక్టర్ ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్ కథ, కాస్టింగ్ ఎంచుకున్న తీరు బాగుంది. కాకపోతే, కథ ని చెప్పడంలో కాస్త ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది. అజయ్ అర్రసాడ నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు పర్వాలేదు. టి.సురేంద్ర రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
హెబ్బా పటేల్ 'బ్లాక్ అండ్ వైట్' టీజర్ అవుట్
కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం బ్లాక్ అండ్ వైట్ (Black and white). ఎన్‌ఎల్‌వీ సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. సూర్య శ్రీనివాస్, లహరి శారి, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లెజెండరీ రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘నో కమిట్మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్‌తో టీజర్ షురూ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
సునయన నుంచి అక్షర హాసన్ వరకూ..
సవ్యంగా సాగుతున్న జీవితాల్లో ఊహించిన మలుపులా దూసుకొచ్చింది కరోనా వైరస్. ఎంతో మంది జీవితాలను ఈ మహమ్మారి అతాలకుతలం చేసింది. కరోనా ధాటికి అనేక పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిలో సినీ పరిశ్రమ ఒకటి. కొన్ని కొత్త సినిమాలు ఆరంభంలోనే ఆగిపోతే మరి కొన్ని షూటింగ్ మధ్యలో నిలిచిపోయాయి. ఇక అనేక సినిమాలు విడుదలకు నోచుకోక వాయిదా పడ్డాయి. పని లేకపోవడంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో కొత్త ఫిట్నెస్, వంటలు, కొత్త వ్యాపకాలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తమ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. (సోనూసూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?) ఈక్రమంలో కొన్ని ఛాలెంజ్‌లను స్వీకరిస్తున్నారు. అలా వచ్చిందే ‘బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్’. ఎప్పుడూ కలర్ ఫుల్ ఫోటోలే కాకుండా నలుపు, తెలుపు రంగులో ఉండే ఫోటోలను womensupportingwomen అనే హ్యష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఈ ఛాలెంజ్. దీని ద్వారా మహిళలు తమలోని ఆత్మ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, మహిళా సాధికారికతను పెంపొందించే ఉద్ధేశ్యంతో ఈ ఛాలెంజ్ నడుస్తోంది. ఈ సవాల్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన కోలీవుడ్ తారలపై ఓ లుక్కేద్దాం. (పెళ్లికి రెడీ అవుతోన్న 'పహిల్వాన్' విలన్) 1... సునయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎంచుకున్న పాత్రల్లో తన అద్భుతమైన నటన నైపుణ్యాలను నిరూపించుకుంది. తన స్నేహితురాలు, నటి మంజిమా మోహన్ ఇచ్చిన సవాలును అంగీకరించిన సునాయన బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని పంచుకుంది. సునైనా సాదా చీరతో, తక్కువ అభరణాల అలంకరణ ఆమెకు సరిగ్గా సరిపోయింది. 2. మంజిమా మోహన్ తమిళ నటుడు శింబు సరసన రొమాంటిక్ థ్రిల్లర్ 'అచ్చం యెన్భాధు మదమైయాడ' చిత్రంలో నటించిన మంజిమా మోహన్ తన నటనకతో ప్రేక్షకులలో మంచి ఆదరణ సంపాదించుకుంది.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలతోపాటు పరిశ్రమలో మంచి స్నేహితులను కూడా సంపాదించింది. నటి వరలక్ష్మి చేసిన సవాలును అంగీకరించిన మంజిమా బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో ఫోటోను షేర్ చేసింది. 3. వరలక్ష్మీ సినీ పరిశ్రమలో ధైర్యవంతులైన నటీమణులలో వరలక్ష్మి ఒకరు. ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టదినట్లు మాట్లడటంలో ఆమె ఎన్నడూ వెనకాడదు. మహిళలపై లైంగిక వేధింపుల కోసం పోరాడటానికి వరలక్ష్మి ఒక ప్రచారాన్ని కూడా నడుపుతుంది. తాజాగా ఈ సవాలను స్వీకరించిన వరలక్ష్మీ బ్లాక్ అండ్ వైట్‌లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేగాక లాక్ డౌన్ సమయంలో ఆమె బరువు తగ్గినట్లు తెలుస్తోంది. 4. నివేధిత సతీష్ 'మాగలీర్ మాట్టం', 'సిల్లు కరుపట్టి' వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాలలో నివేదిత సతీష్ తన పాత్రలతో అబ్బురపరిచింది. బోల్డ్ పాత్రలు స్వీకరించే నటీమణులలో నివేదిత ఒకరు. ఆమెకున్న పెద్ద కళ్ళు తనకు ప్లాస్ పాయింట్‌గా చెప్పుకుంటారు. ఆమెకు బాగా సరిపోయే చీరతో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను అభిమానులతో పంచుకుంది. 5. సుజా వరుణీ సుజా వరుణీ 2018లో శివ కుమార్‌ను వివాహం చేసుకున్నారు, ఈ జంటకు గత ఏడాది (2019) ఆగస్టులో పండంటి మగబిడ్డ జన్మించాడు. సుజా వరుణీ అనేక పాపులర్ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించింది, అయితే టెలివిజన్ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు ఈ నటికి మరింత ఖ్యాతి వచ్చింది. మహిళల ఛాలెంజ్‌కు మద్దతు ఇచ్చే మహిళల్లో సుజా వరుణీ ఒకరు. ఈ ఛాలెంజ్‌ను అంగీకరించిన, ఆమెతన గతంలో దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పంచుకున్నారు. 6.. అక్షర హాసన్ విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్. అయితే వారసత్వ నటిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం నవీన్ దర్శకత్వం వహించే 'అగ్ని సిరగుగల్' చిత్రంలో అక్షర ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం తమిళ సినిమా పరిశ్రమలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇక ఈ సవాలును స్వీకరించిన అక్షర బ్లాక్ అండ్ వైట్‌లో ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. -
చారడేసి అందం
చెట్టు మీద కాయ సముద్రంలో ఉప్పు వేరు వేరు అయినా కలిపితే వచ్చే రుచి వేరు తెలుపు, నలుపు ఎదురెదురు రంగులయినా కలిపితే వచ్చే సొగసు వేరు తెలుపు, నలుపులకు నాలుగు చారలు వేసి చారడేసి అందంతో వనితలను మెరిపిస్తున్నారు ఈ జంట డిజైనర్లు. అబ్రహమ్, ఠాకూర్ల ఎక్స్‌క్లూజివ్ డిజైన్స్ ఇవి.ప్రత్యేక డిజైన్లు ఫ్యాషనబుల్ దుస్తులతో పాటు బ్యాగ్, షూ, బెల్ట్.. వంటి ఇతర అలంకరణ వస్తువుల డిజైనింగ్‌లోనూ డేవిడ్ అబ్రహం, రాకేష్ ఠాకోర్లది విజయవంతమైన ప్రయాణం. దాదాపు పాతికేళ్లుగా వీళ్లు ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్నారు. అహ్మదాబాద్ ఫ్యాషన్ ఇన్ట్సిట్యూట్‌లో పట్టభద్రులైన ఈ డిజైనర్లు న్యూఢిల్లీలో అ–ఖీ బ్రాండ్‌ను ప్రారంభించారు. వీరి డిజైన్లు ప్రముఖంగా యూరప్‌లో పేరు గడించాయి. అంతర్జాతీయ డిజైన్లు అయినప్పటికీ భారతీయ మూలాలు వీరి వస్త్రశైలులో కనువిందు చేయడం విశేషం. లగ్జరియస్‌గా కనిపించే వీరి డిజైన్లు పదేళ్ల కిందట ఇండియా ఫ్యాషన్ వీక్‌లో మొదటిసారి మెరిసాయి. నలుపురంగు హ్లాండ్లూమ్ శారీని మోకాళ్ల కిందవరకు కట్టి, పైన బెల్ట్‌తో అలంకరించారు. ‘భారతీయ సంప్రదాయ వస్త్రధారణను ప్రపంచ వేదికపైన ప్రదర్శించి ఒక కొత్త ఆత్మస్థైర్యాన్ని చూపాలనుకున్నాం. ఆ డిజైన్ చూసి మొదట చాలా మంది ఆశ్చర్యపోయారు ఫ్యాషన్ షోలో శారీ ఏంటని’ అంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు ఈ జంట డిజైనర్లు. ప్రతియేటా ప్రఖ్యాత ఫ్యాషన్‌షోలలో పాల్గొంటూ తమ వస్త్ర శైలులను ప్రదర్శిస్తున్నారు. ఈ సంవత్సరం లాక్మే ఫ్యాషన్ వీక్ 2019లో నలుపు, తెలుపు, చారల కాంబినేషన్లో తమ స్టైల్ డిజైన్ దుస్తులను ప్రదర్శించారు అబ్రహమ్, ఠాకోర్‌లు. అయితే, వీరి చారల డిజైన్లు ప్రఖ్యాత డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్స్‌ను పోలి ఉంటాయి అనే విమర్శ కూడా ఉంది. అందుకు అబ్రహం మాట్లాడుతూ ‘ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది. అందులో నుంచి ప్రతి డిజైనర్ స్ఫూర్తి పొందుతారు. కానీ, ఎవరి ప్రత్యేకత వారిదే’ అని వివరణ ఇస్తారు.నిర్వహణ– నిర్మలారెడ్డి ఏ దేశంలోనైనా వినియోగదారుడి ఫ్యాషన్ ఆలోచనలు అతి వేగవంతంగా మారుతుంటాయి. అయినా వారి కళ్లను కట్టడి చేసే డిజైన్లను సృష్టించడంలో డిజైనర్లు ఎప్పుడూ ముందుండాలి. ఆ ప్రత్యేకత కోసం చాలా వర్క్ చేశాం. దాంట్లో ఈ నలుపు, తెలుపు, చారల కాంబినేషన్ ఫ్యాషన్‌లో గిరిగీసుకున్న హద్దులను చెరిపేసింది. అంతర్జాతీయంగా మంచి మార్కెట్‌ను తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో భారత ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఎలాంటి హద్దులు లేవు అని నిరూపించింది.– అబ్రహమ్, ఠాకూర్, ఫ్యాషన్ డిజైనర్లు -
బ్లాక్ అండ్ వైట్ దందాలో బ్యాంకర్లు
బ్లాక్ అండ్ వైట్ దందాలో బ్యాంకర్లు గుర్తించిన రిజర్వ్‌బ్యాంక్ రంగంలోకి దిగిన సీబీఐ అనుమానిత బ్యాంకుల జాబితాలో జిల్లా పేరు సాక్షి, సూర్యాపేట : అందరూ అనుకున్నట్లే బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకోవడంలో బ్యాంక్ ఉద్యోగు లు, అధికారుల పాత్ర ఉందని రిజర్వ్‌బ్యాంక్ అధికారులు గుర్తించారు. పెద్దనోట్లకు చిల్లర ఇచ్చి కమీష న్లు దండుకున్న వ్యవహారంలో బ్యాంకులే కీలక పా త్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఈ దందాను నడిపిన వారిపై చర్యలు తీసుకునేం దుకు ఆర్బీఐ కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో జిల్లాలోని పలువురు బ్యాంకర్లకు దడ పుడుతోంది. నల్లకుబేరుల వద్ద ఉన్న పాత రూ. 500, వెయి నోట్లను తీసుకుని 20 నుంచి 30 శాతం కమీషన్‌తో కొత్త నోట్లను అందించిన వ్యవహారంలో సూర్యాపేట జిల్లా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ రకాల బ్యాంకులు 34 ఉండగా.. వాటి అనుబంధ బ్రాంచీలు 436 ఉన్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 209, సూ ర్యాపేట జిల్లాలో 136, యాదాద్రి భువనగిరి జిల్లాలో 94 బ్యాంకులు ఉన్నాయి. అయితే నేషనల్ హైవేపై ఉన్న సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో, నల్లగొండ, యాదాద్రి జిల్లాల కంటే ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. వ్యాపారవేత్తలు, ఇతర సంపన్నులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు ప్ర చారం. ఈ నేపథ్యంలో నల్లధనం ఇక్కడే ఎక్కువగా ఉండే అవకాశముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. తమకు బ్యాంకర్లతో ఉన్న పరిచయాలను అనువుగా తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా తమ నల్లడబ్బును మార్పిడి చేరుుంచుకునేందుకు ప్రయత్నించారని.. ఇందుకు బ్యాంకర్లు కూడా కమీషన్లు తీసుకొని సై అని ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. లింగాల ఘటనతో జిల్లాపై నిఘా... నల్లడబ్బును వైట్‌మనీగా మార్చేందుకు కమీషన్లు తీసుకుని కొత్త నోట్లు అందజేస్తూ ఈనెల 22వ తేదీన పెన్‌పహాడ్ మండలం లింగాల పెట్రోల్ బంకు సంఘటనతో జిల్లాలోని బ్లాక్‌మనీ భారీగా వైట్‌మనీగా మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఈ సంఘటనలో 12 మంది నేరస్తులు ఉండగా.. అందు లో ముగ్గురు బ్యాంకర్లతో సంబంధాలున్నవారు కావడం గమనార్హం. ఒకరికి బ్యాంకులో డ్రైవర్‌గా పనిచేసిన అనుభవం.. మరో ఇద్దరు బ్యాంకు మిత్రలుగా పనిచేసిన వారు కావడం.. బ్యాంకర్లు తమ అనుచరులతో బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చారనే ప్రచారం జరుగుతోంది. డబ్బుల మార్పిడికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. సదరు వ్యక్తి ఆధార్ లేదా.. ఓటర్ ఐడీ కార్డు జిరాక్స్ తీసుకుని మొదటి రెండుమూడు రోజుల్లో రూ. 4 వేలు ఆతర్వాత రూ. 10 వేలు అందజేశారు. అయితే మొదటి రోజు ఇచ్చిన గుర్తింపు, ఆధార్ కార్డు జిరాక్సులను తమ దగ్గరే ఉంచుకున్న బ్యాంకర్లు పలువురు వాటిని జిరాక్స్‌లు తీసి వారి పేరుమీద డబ్బులను మార్చినట్లు రికార్డులు చూపించినట్లు ప్రచారం. ఈ దందాకు సహకరించిన బ్యాంకు అధికారులపై సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఏ అధికారి చిక్కుతాడోనన్న విషయంపై జిల్లాలో చర్చ జరుగుతోంది. బ్యాంకర్ల పాత్రపై ఆరా పెద్ద నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని నోట్ల మార్పిడిని గుట్టురట్టు చేసింది సూర్యాపేట జిల్లా పోలీసులే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పని లో ఇప్పటికే మా యంత్రాంగం నిమగ్నమైంది. పెన్‌పహాడ్ మండలం లింగాల పెట్రోల్ బంక్ సమీపంలో నోట్లను మార్పిడి చేస్తున్న ముఠాను పట్టుకున్నాం.12 మందిని అరెస్టు చేసి రిమాండ్లోఉంచాం. వారిలో ముగ్గురు బ్యాంకులతో సంబంధం ఉన్నవారు కావడంతో బ్యాంకు అధికారుల పాత్ర ఉండి ఉంటుందనే అనుమాని స్తున్నాం. జిల్లాలోని అనుమానం ఉన్న బ్యాం కుల లావాదేవీల వివరాలు.. సీసీ కెమెరాలఫుటేజీలను సేకరించే పనిలో ఉన్నాం. - పరిమళహననూతన్, ఎస్పీ -
బ్యూటీ
గులాబీలతో... కప్పు గులాబీ రేకలను పేస్ట్ చేసి, ఇందులో కొద్దిగా పాలు, కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. తరచు ఈ విధంగా చేస్తుంటే చేతులు మృదువుగా, కాంతిమంతంగా తయారవుతాయి. కప్పు నీళ్లలో పది గులాబీ రేకలు వేసి మరిగించి చల్లారనివ్వాలి. తర్వాత వడపోసి దీంట్లో టీ స్పూన్ రోజ్ వాటర్ కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయం, సాయంత్రం రోజూ ఈ నీటిలో దూది ఉండను ముంచి ముఖాన్ని శుభ్రంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రాత్రి పడుకునేముందు గులాబీల పేస్ట్‌లో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి. ఈ విధంగా చే స్తే పెదవులకు గులాబీల అందం వస్తుంది. పొడిబారిన జుట్టుకు... చర్మానికి లాగే జుట్టుకు కూడా మాయిశ్చరైజర్ అవసరం. ఎందుకంటే పొడిబారిన చర్మంలాగే జుట్టు కూడా నిస్తేజంగా కనిపిస్తుంది. వారానికి రెండు సార్లు పెరుగును మాడుకు, వెంట్రుకలంతా పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. అలాగే షాంపూ వాడిన తర్వాత తప్పనిసరిగా కండిషనర్‌ని ఉపయోగించాలి. తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, బాదంపప్పు, పాల ఉత్పత్తులు, తాజా కాయగూరలను చేర్చాలి. ఈ జాగ్రత్తలు పొడిబారిన జుట్టుకు జీవం తీసుకువస్తాయి. బ్లాక్ అండ్ వైట్ హెడ్స్... చాలా పార్లర్ లలో స్వేదరంధ్రాలలో పొడవాటి ఇనుప పుల్లను గుచ్చి, బ్లాక్‌హెడ్స్ తీస్తుంటారు. దీనివల్ల స్వేదరంధ్రాలు మరీ సున్నితమవుతాయి. పోర్స్ ఓపెన్ అయితే చర్మం కళ తప్పుతుంది. అలాకాకుండా, మార్కెట్లో బ్లాక్‌హెడ్స్ రిమూవల్ ఫోమ్ లభిస్తుంది. దీనిని రాసి బ్లాక్, వైట్ హెడ్స్‌ను తొలగించుకోవచ్చు. కమిలిన చర్మానికి చాకొలెట్! చర్మం మృదువుగా మారడానికి, ఎండవల్ల నల్లబడిన చర్మం తిరిగి సహజరంగుకు రావడానికి చాకొలెట్ ఫేషియల్ సహాయపడుతుంది. చాకొలెట్ క్రీమ్‌లు, స్క్రబ్ దీనిలో ఉపయోగిస్తారు. అన్ని చర్మతత్వాలకు సరిపోయే ఫేషియల్ ఇది. ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవాలంటే- ముందుగా క్లెన్సింగ్ చేసి, రోజ్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రపరచాలి. బ్రౌన్ కలర్ షుగర్, కాఫీ గింజలను కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచాలి. తరువాత ముఖం మీద కొద్దిగా నీళ్లు చిలకరించి, మృదువుగా రుద్ది, నీటితో కడగాలి. తరువాత చాకొలెట్ మసాజ్ క్రీమ్‌ను ముఖానికి రాసి, మరొకసారి మృదువుగా రాసి, శుభ్రపరిచాలి. చాకొలెట్ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి వేసి, 20 నిమిషాలు ఉంచి, చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.