బ్లాక్ అండ్ వైట్ దందాలో బ్యాంకర్లు
Published Thu, Dec 1 2016 2:26 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
బ్లాక్ అండ్ వైట్ దందాలో బ్యాంకర్లు
గుర్తించిన రిజర్వ్‌బ్యాంక్
రంగంలోకి దిగిన సీబీఐ
అనుమానిత బ్యాంకుల జాబితాలో జిల్లా పేరు
సాక్షి, సూర్యాపేట : అందరూ అనుకున్నట్లే బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకోవడంలో బ్యాంక్ ఉద్యోగు లు, అధికారుల పాత్ర ఉందని రిజర్వ్‌బ్యాంక్ అధికారులు గుర్తించారు. పెద్దనోట్లకు చిల్లర ఇచ్చి కమీష న్లు దండుకున్న వ్యవహారంలో బ్యాంకులే కీలక పా త్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఈ దందాను నడిపిన వారిపై చర్యలు తీసుకునేం దుకు ఆర్‌బీఐ కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో జిల్లాలోని పలువురు బ్యాంకర్లకు దడ పుడుతోంది.
నల్లకుబేరుల వద్ద ఉన్న పాత రూ. 500, వెయి నోట్లను తీసుకుని 20 నుంచి 30 శాతం కమీషన్‌తో కొత్త నోట్లను అందించిన వ్యవహారంలో సూర్యాపేట జిల్లా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ రకాల బ్యాంకులు 34 ఉండగా.. వాటి అనుబంధ బ్రాంచీలు 436 ఉన్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 209, సూ ర్యాపేట జిల్లాలో 136, యాదాద్రి భువనగిరి జిల్లాలో 94 బ్యాంకులు ఉన్నాయి. అయితే నేషనల్ హైవేపై ఉన్న సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో, నల్లగొండ, యాదాద్రి జిల్లాల కంటే ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. వ్యాపారవేత్తలు, ఇతర సంపన్నులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు ప్ర చారం. ఈ నేపథ్యంలో నల్లధనం ఇక్కడే ఎక్కువగా ఉండే అవకాశముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. తమకు బ్యాంకర్లతో ఉన్న పరిచయాలను అనువుగా తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా తమ నల్లడబ్బును మార్పిడి చేరుుంచుకునేందుకు ప్రయత్నించారని.. ఇందుకు బ్యాంకర్లు కూడా కమీషన్లు తీసుకొని సై అని ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.
లింగాల ఘటనతో జిల్లాపై నిఘా...
నల్లడబ్బును వైట్‌మనీగా మార్చేందుకు కమీషన్లు తీసుకుని కొత్త నోట్లు అందజేస్తూ ఈనెల 22వ తేదీన పెన్‌పహాడ్ మండలం లింగాల పెట్రోల్ బంకు సంఘటనతో జిల్లాలోని బ్లాక్‌మనీ భారీగా వైట్‌మనీగా మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఈ సంఘటనలో 12 మంది నేరస్తులు ఉండగా.. అందు లో ముగ్గురు బ్యాంకర్లతో సంబంధాలున్నవారు కావడం గమనార్హం. ఒకరికి బ్యాంకులో డ్రైవర్‌గా పనిచేసిన అనుభవం.. మరో ఇద్దరు బ్యాంకు మిత్రలుగా పనిచేసిన వారు కావడం.. బ్యాంకర్లు తమ అనుచరులతో బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చారనే ప్రచారం జరుగుతోంది. డబ్బుల మార్పిడికి ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. సదరు వ్యక్తి ఆధార్ లేదా.. ఓటర్ ఐడీ కార్డు జిరాక్స్ తీసుకుని మొదటి రెండుమూడు రోజుల్లో రూ. 4 వేలు ఆతర్వాత రూ. 10 వేలు అందజేశారు. అయితే మొదటి రోజు ఇచ్చిన గుర్తింపు, ఆధార్ కార్డు జిరాక్సులను తమ దగ్గరే ఉంచుకున్న బ్యాంకర్లు పలువురు వాటిని జిరాక్స్‌లు తీసి వారి పేరుమీద డబ్బులను మార్చినట్లు రికార్డులు చూపించినట్లు ప్రచారం. ఈ దందాకు సహకరించిన బ్యాంకు అధికారులపై సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఏ అధికారి చిక్కుతాడోనన్న విషయంపై జిల్లాలో చర్చ జరుగుతోంది.
బ్యాంకర్ల పాత్రపై ఆరా
పెద్ద నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని నోట్ల మార్పిడిని గుట్టురట్టు చేసింది సూర్యాపేట జిల్లా పోలీసులే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పని లో ఇప్పటికే మా యంత్రాంగం నిమగ్నమైంది. పెన్‌పహాడ్ మండలం లింగాల పెట్రోల్ బంక్ సమీపంలో నోట్లను మార్పిడి చేస్తున్న ముఠాను పట్టుకున్నాం.12 మందిని అరెస్టు చేసి రిమాండ్‌లోఉంచాం. వారిలో ముగ్గురు బ్యాంకులతో సంబంధం ఉన్నవారు కావడంతో బ్యాంకు అధికారుల పాత్ర ఉండి ఉంటుందనే అనుమాని స్తున్నాం. జిల్లాలోని అనుమానం ఉన్న బ్యాం కుల లావాదేవీల వివరాలు.. సీసీ కెమెరాలఫుటేజీలను సేకరించే పనిలో ఉన్నాం.
- పరిమళహననూతన్, ఎస్పీ
Advertisement
Advertisement