'అందగాడు' ఎవరంటే..?
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాలో నటిస్తున్న రాజ్ తరుణ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. కొత్త దర్శకుడితో రాజుగాడు యమ డేంజర్ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు.
ఈ రెండు సినిమాలతో పాటు మరో ఇంట్రస్టింగ్ సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోగా నటించేందుకు అంగీకరించాడు రాజ్ తరుణ్. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడిగా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. హేబా పటేల్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాకు అందగాడు అనే టైటిల్ను ఫైనల్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న అందగాడు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.