మరో మెగా హీరోతో కుమారి | Hebah Patel In Sai Dharam Tej And Gopi Chand Mallineni Movie | Sakshi
Sakshi News home page

మరో మెగా హీరోతో కుమారి

Published Fri, Jul 15 2016 10:30 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

మరో మెగా హీరోతో కుమారి - Sakshi

మరో మెగా హీరోతో కుమారి

కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించిన హీరోయిన్ హేబా పటేల్.  అందంతో పాటు తన బోల్డ్ యాక్టింగ్తో  మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటి. ఆ ఇమేజే ఇప్పుడు ఈ అమ్మడికి వరుస అవకాశాలను తెచ్చిపెడుతుంది. స్టార్ హీరోయిన్లు కాదన్న ఛాన్స్లు కూడా హేబా తలుపు తడుతున్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కాదన్న ఓ క్రేజీ ఆఫర్ను కొట్టేసింది హేబా.

ఇప్పటికే మెగా హీరో వరుణ్ తేజ్ సరసన మిస్టర్ సినిమాలోనటిస్తుంది హేబా. ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమా లైన్లో ఉండగానే మరో మెగా హీరో నుంచి పిలుపు వచ్చింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు రకుల్ ప్రీత్ను హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు. అయితే మహేష్ బాబు సినిమా కోసం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది రకుల్. దీంతో ఈ సినిమాలో హేబా పటేల్ హీరోయిన్గా తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement