అలా ఎలా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ హెబ్బా పటేల్. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ సినిమాతో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఈడో రకం ఆడో రకం, ఎక్కడి పోతావు చిన్నవాడ సినిమాలతో సక్సెస్‌లు వచ్చినా.. తరువాత హెబ్బా కెరీర్ ఇబ్బందుల్లో పడింది.
వరుసగా నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్ సినిమాలో బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. దీంతో హెబ్బాకు అవకాశలు కరువయ్యాయి. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాటో హాట్ ఫోటోషూట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు హెబ్బా. తాజాగా ఈ భామ నితిన్ హీరోగా తెరకెక్కుతున్న భీష్మ సినిమాలో నటించేందుకు అంగీకరించారు.
వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో హెబ్బా నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నారట. నటనకు అవకాశం ఉన్న పాత్ర కావటంతో తనకు మరోసారి బ్రేక్ వస్తుందన్న నమ్మకంతో హెబ్బా ఉన్నట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment