
బిగ్‌బాస్ సీజన్ 2కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. హోస్ట్ నాని శని, ఆది వారాల్లో బెబుతున్న పిట్టకథలు, హౌస్‌మేట్స్‌తో జరుపుతున్న సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముందుగా చెప్పినట్టుగానే ఏమైనా జరగవచ్చు అనేలా ఉంది హౌస్‌లో పరిస్థితి. సీజన్ వన్‌లో వైల్డ్‌కార్డు ద్వారా దీక్షా పంత్, నవదీప్‌లు హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరి ఈసారి ప్రముఖ హీరోయిన్, కుమారి 21 ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
తాజాగా ఈ వార్తలపై హెబ్బా స్పందించారు. దీనిపై ఆమె ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడారు. తను ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. తనకు అటువంటి ఆలోచన లేదని.. తనను దీనిపై ఎవరు సంప్రదించలేదని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఆశ్చర్యమేస్తుందన్నారు. ప్రస్తుతం తను చేయాల్సిన సినిమాలతో బిజీగా ఉన్నానని హెబ్బా తెలిపారు. ఇక బిగ్‌బాస్ హౌస్ విషయానికి వస్తే ఇప్పటివరకు సంజన, నూతన నాయుడు, కిరిటీ దామరాజు, యాంకర్ శ్యామల, భాను ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్‌కు సామ్రాట్, తేజస్వీ, రోల్‌రైడా, దీప్తి, తనీష్‌లు నామినేట్ అయ్యారు. సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో కామన్‌మ్యాన్ గణేశ్ కంటతడి పెట్టడం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment