
బిగ్‌బాస్ సీజన్ 2కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వ్యాఖ్యాత నేచురల్ స్టార్ నాని శని, ఆది వారాల్లో చెబుతున్న పిట్టకథలు, హౌస్‌మేట్స్‌తో జరుపుతున్న సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నాని ముందుగా చెప్పినట్టుగానే ఏమైనా జరగవచ్చు అన్నది నిజమే అనిపిస్తోంది. బిగ్‌బాస్ హౌజ్‌లో ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా కొత్త సెలబ్రిటీల ఎంట్రీ ఉండటంతో బిగ్ బాస్ హౌస్‌కి రాబోతున్న కంటెస్టెంట్ ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సీజన్ వన్‌లో వైల్డ్‌కార్డు ద్వారా దీక్షా పంత్, నవదీప్‌లు హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హీరోయిన్ హెబ్బా పాటేల్ వస్తుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు బిగ్‌బాస్ హౌస్‌కి లగేజ్‌తో సహా దిగిన ఓ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రదీప్‌ను చూసిన కంటెస్టెంట్‌లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రదీప్ రాగానే అందరూ హత్తుకుని అతనికి ఆహ్వానం పలికారు. ప్రదీప్ నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవులే.. వారం రోజుల్లో పంపించేస్తాం అని ఆటపట్టించగా.. రాగానే మొదలు పెట్టారా అని ప్రదీప్ సమాధానం ఇచ్చారు. మీ వాడిని మీలో ఒడిని కాబట్టి మీలాగ ఇక్కడికి ఖాళీ చేతులతో రాదలచుకోలేదని చెప్పి, ఒక్కొక్కరి గురించి చెబుతుండగా.. కంటెస్టెంట్లు అందరూ కంటతడి పెట్టుకున్నారు. పోను పోను నేను పోకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తానని ప్రదీప్ పేర్కొన్నారు.
అయితే 16 మందితో మొదలైన బిగ్ బాస్ షో ను ఇప్పటికే ఐదు మంది (సంజన, నూతన్ నాయుడు, కిరిటీ, శ్యామల, భానుశ్రీ) హౌజ్ నుంచి ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ప్రదీప్ హౌజ్‌లో ఎన్ని రోజులు ఉంటారో వేచిచూడాల్సిందే. అయితే ఆయన గెస్ట్‌గా మాత్రమే హౌజ్‌లోకి వచ్చారని తెలుస్తోంది.
. @impradeepmachi makes a Grand Entry to the Bigg House 😉#BiggBossTelugu2 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/mXZVXMnjCl
— STAR MAA (@StarMaa) July 19, 2018
Comments
Please login to add a commentAdd a comment