బిగ్‌బాస్‌ : తేజస్వీ సంచలన వ్యాఖ్యలు | Tejaswi Madivada Sensational Comments Against Bigg Boss Show | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : తేజస్వీ సంచలన వ్యాఖ్యలు!

Jul 23 2018 7:26 PM | Updated on Jul 18 2019 1:45 PM

Tejaswi Madivada Sensational Comments Against Bigg Boss Show - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి తాజాగా ఎలిమినేట్‌ అయిన తేజస్వీకి, కౌశల్‌ ఆర్మీకి మళ్లీ రచ్చ మొదలైంది. 

సాక్షి, హైదరాబాద్‌ : నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా చేస్తున్న తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-2 హౌస్‌ నుంచి తాజాగా ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ తేజస్వీ మడివాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్‌లో కంటెస్టెంట్లు ఏం చేస్తారన్నది కేవలం గంటసమయం చూపిస్తారని, అందులో తన గురించి చూపించింది నిజాలు కాదని ఆరోపించారు. అది చూసిన అభిమానులు తాను తప్పు చేసినట్లుగా భావించమే తన ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమన్నారు. కేవలం తాను అరిచిన విషయాలే బిగ్‌బాస్‌లో చూపించారని, ఎన్నోసార్లు కౌశల్‌కు సారీ చెప్పినా ఎందుకు చూపించలేదో అర్థం కావడం లేదన్నారు. అసలు కౌశల్‌తో తాను గొడవ పడలేదని, కౌశల్‌ వేరు అమ్మాయిపై చెయ్యి వేస్తే తాను అడిగానని, అందుకే కౌశల్‌ ఆర్మీ తనను టార్గెట్‌ చేసిందన్నారు. ఈ మేరకు నటి తేజస్వి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

నన్ను మిస్‌ జడ్జ్‌ చేశారు
నా లైఫ్‌లోనే బిగ్‌బాస్‌ హౌస్‌ లాంటి ఎక్స్‌పీరియన్స్‌ చేస్తా అనుకోలేదు. బిగ్‌బాస్‌ ఇంటికి హ్యాపీగా వెళ్లాను. తొలుత ఇంట్లో ఎవరూ నచ్చలేరు. కాస్త డిఫరెంట్‌గా ఉన్నారు. తనీష్‌, సామ్రాట్‌ నాకు ఫ్రెండ్స్‌ అయ్యారు. నిన్న బయటకు వచ్చే వరకు చాలా ఎంజాయ్‌ చేశా. బయటకు వచ్చి చూస్తే నాకు కౌశల్‌ ఆర్మీ హేటింగ్‌ గురించి తెలిసింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో 24 గంటలు ఉంటే.. కేవలం మీరు గంట చూసి నాపై నిర్ణయాన్ని తీసుకోకూడదు. మొత్తం 24 గంటలు చూస్తే మీకు తెలుస్తుంది. ఏదైనా జరిగితే నేను కౌశల్‌ మీద అరిచి ఉంటాను. కానీ ముందు జరిగినది బిగ్‌బాస్‌ వాళ్లు చూపించలేదు. తలాలోకా లేనివి టీవీల్లో చూసి కౌశల్ ఆర్మీ నాపై విరుచుకు పడుతోంది. కౌశల్‌ ఆర్మీ ఒకవేళ 24 గంటలు హౌస్‌ లోపల ఉంటే మీరే అతడిని చంపి బటయకు తీసుకొస్తారు. నాకు సపోర్టు చేసిన హౌస్‌లోని లేడీస్‌ అందరికీ థ్యాంక్స్‌.

24 గంటలు ప్రసారం చేస్తే..
కౌశల్‌ ఆర్మీ వల్ల నాకు మంచే జరిగింది. వారి కోపం వల్ల వేరే వైపు నుంచి నాకు మద్దతు లభిస్తోంది. మీ కౌశల్‌ అన్నను ఎవ్వరూ ఏం అనలేదు. మీ అన్న అందరూ నిద్రపోయాక లేచి మొత్తం ఫుడ్‌ తినేస్తాడు.  హౌస్‌ నుంచి బయటకొచ్చాక చూస్తే గీతా అక్క, దీప్తి, రోల్‌రైడా.. ఇలా అందరు లోపల నేను ఉన్నప్పుడు ఉన్నట్లు బయటకు వచ్చాక వాళ్లు అలా లేరు. 24 గంటలు షో ప్రసారం చేస్తే కౌశల్‌ ఏం చేస్తున్నాడో అందరికీ తెలుస్తుంది. బూతులు మాట్లాడుతున్నారు.. ఎందుకండీ. నేను ఒక్క బూతు మాట అన్నందుకు మీరు వంద అంటున్నారు. అలా అయితే మీకు నాకు తేడా ఏంటీ.

హౌస్‌లోకి మళ్లీ పంపించండి.. ప్లీజ్‌!
నేనేంటో మీకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నాకు ప్రేమను ఇస్తే.. నేనేం చేయగలనో మీకు తెలియాలంటే నాకు మరో అవకాశం ఇవ్వండి. నన్ను మళ్లీ చూడాలనుకుంటే నాకు ఓటింగ్ చేయండి. కేవలం షోలో చూపించింది చూసి ఏమాత్రం ఆలోచించకుండా ఓట్లు వేయడం వల్లే నేను ఎలిమినేట్‌ అయ్యాను. మీరు ఇప్పుడైనా విశ్లేషించుకోండి. అక్కా, చెల్లి, ఫ్రెండ్‌ ఇలా ఏమనుకున్నా సరే.. నాకు ఓటింగ్ చేయండి. నేను పైకి రావాలన్నా, ఏం సాధించాలన్నా అభిమానుల మద్దతు తప్పకుండా కావాలి. ఈరోజు రాత్రి షో చూడండీ. ఎలిమినేట్‌ అయిన ఏ కంటెస్టెంట్‌ అయినా మళ్లీ ఎంట్రీ ఇవ్వొచ్చు.

మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి : నెటిజన్ల ట్రోలింగ్‌
తనకు మరో అవకాశం ఇవ్వాలని తేజస్వీ కోరగా.. నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘నీ మనసు గెలిచింది సామ్రాట్‌, తనీష్‌.. కానీ కౌశల్‌కు ఆర్మీ ఉంది’, ‘మీ యాటిట్యూడ్‌ మాకు నచ్చదు. కౌశల్‌ని చాలా బాధపెట్టారు. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు’, ‘మేడం.. మీ బూతులు సోషల్‌ మీడియాలో చాలా ఫేమస్‌ అయ్యాయి. మీరు లేనిలోటు తెలుస్తోంది. మళ్లీ హౌస్‌లోకి వెళ్లాలి’, ‘అక్కా.. ఎందుకక్కా మాపై కక్ష .. మళ్లీ బిగ్ బాస్ కి వెళ్లకు.. మమ్మల్ని హ్యాపీగా బిగ్ బాస్ ని చూడనివ్వు అక్క..’, అని, ‘ఇప్పుడు హౌస్‌ చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు హౌస్‌లో ఉంటే మేం కుటుంబం మొత్తం కలిసి ఇన్ని రోజులు షో చూడలేకపోయాం’, అంటూ నెటిజన్లు తేజస్వీనిని ట్రోల్‌ చేశారు.

తేజస్వీ వీడియోకు వచ్చిన కామెంట్లు స్క్రీన్‌షాట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement