'అంధగాడు' మూవీ రివ్యూ | Andhagadu Movie Review | Sakshi
Sakshi News home page

'అంధగాడు' మూవీ రివ్యూ

Published Fri, Jun 2 2017 11:54 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

Andhagadu Movie Review

టైటిల్ : అంధగాడు
జానర్ : కామెడీ ఎంటర్టైనర్
తారాగణం : రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్రప్రసాద్, ఆశిష్ విద్యార్థి, శియాజీ షిండే
సంగీతం : శేఖర్ చంద్ర
దర్శకత్వం : వలిగొండ శ్రీనివాస్
నిర్మాత : సుంకర రామబ్రహ్మం

డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్స్తో వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఇంట్రస్టింగ్ ఎంటర్టైనర్ అంధగాడు. దాదాపు నలబై నిమిషాలు పాటు గుడ్డివాడిగా కనిపించే పాత్రలో నటించేందుకు అంగీకరించిన రాజ్ తరుణ్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి ప్రయోగం చేసిన ఈ యంగ్ హీరో ఎంత వరకు సక్సెస్ సాధించాడు.?రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ల జోడి మరోసారి హిట్ పెయిర్ అనిపించుకుందా..?


కథ :
గౌతమ్( రాజ్ తరుణ్) ఈ శారదాదేవి అంధుల ఆశ్రమంలో తనలాంటి గుడ్డివారితో కలిసి పెరిగే పిల్లాడు. తను ఎంతో ఇష్టపడే ఫ్రెండ్స్కు కళ్లు వస్తున్నాయంటే ఆనందంగా వారిని హాస్పిటల్కు పంపిస్తాడు. అలా వెళ్లిన ఫ్రెండ్స్ తరువాత తనకు ఒక్క ఉత్తరం కూడా రాయకపోవటంతో వాళ్లను మర్చి పోవాలనే ఉద్దేశంతో ఆశ్రమం నుంచి వెళ్లిపోతాడు. విశాఖపట్నంలో ఓ ఎఫ్ఎమ్ చానల్లో ఆర్జేగా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా కళ్లు వస్తాయని ఎదురుచూస్తున్న గౌతమ్కు డాక్టర్ నేత్ర పరిచయం అవుతుంది. ఎలాగైనా నేత్రకు దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో కళ్లున్నవాడిగా నటిస్తూ ఆమెను ప్రేమిస్తాడు. నేత్ర తన ప్రేమను చెప్పే టైంలో గౌతమ్ గుడ్డివాడన్న నిజం నేత్రకు తెలిసి అతన్ని వదిలి వెళ్లిపోతుంది.

తరువాత తనే దగ్గరుండి గౌతమ్కు ఆపరేషన్ చేయించి కళ్లు వచ్చేలా చేస్తుంది. గౌతమ్కు కళ్లు వచ్చిన దగ్గర నుంచి అసలు సమస్య మొదలవుతుంది. ఓ ఆత్మ గౌతమ్కు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు గౌతమ్తో హత్యలు కూడా చేయిస్తుంది. నిజంగానే గౌతమ్కు ఆత్మ కనిపిస్తుందా.? దుర్మార్గుడైన పంతం బాబ్జీకి గౌతమ్కు ఉన్న సంబంధం ఏంటి..? చివరకు గౌతమ్తో మాట్లాడుతున్న ఆత్మ కథ ఏమైంది..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
యంగ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించాడు. ముఖ్యంగా ఫస్ట్లో గుడ్డివాడిగా రాజ్ తరుణ్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయ్యింది. హెబ్బా పటేల్ గ్లామర్తో ఆకట్టుకున్న నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ఈ సినిమాలో కూడా చాన్స్ రాలేదు. కానీ రాజ్ తరుణ్కు పర్ఫెక్ట్ జోడిగా మరోసారి ప్రూవ్ చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ సినిమాలకు హెల్ప్ అయ్యింది. మెయిన్ విలన్గా రాజా రవీంద్ర ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లుక్, బాడీ లాంగ్వేజ్తో మంచి విలనీ పండించాడు. ఇతర పాత్రల్లో శియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, సత్య తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
రచయితగా మంచి పేరున్న వెలిగొండ శ్రీనివాస్.. అంధగాడు సినిమాతో దర్శకుడిగానూ మంచి మార్కులు సాధించాడు. అయితే ఈ సినిమాలోనూ శ్రీనివాస్లోని రచయిత.. దర్శకుడిని డామినేట్ చేయటం విశేషం. రెగ్యులర్ రివేంజ్ డ్రామానే చివరి వరకు ఆసక్తికరంగా తెరకెక్కించటంలో వెలిగొండ శ్రీనివాస్ సక్సెస్ సాధించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ తోనూ డైరెక్టర్ మెప్పించాడు. ఫస్ట్ హాఫ్లో కామెడీ, ఎమోషనల్ సీన్స్తో ఆకట్టుకున్న శ్రీనివాస్, సినిమా ప్రీ క్లైమాక్స్కు చేరుతున్న దశలో కాస్త తడబడ్డాడు. అనవరమైన సీన్స్తో బోర్ కొట్టించాడు. అయితే క్లైమాక్స్ విషయంలో దర్శకుడు తీసుకున్న కేర్ సినిమాలో లోపాలన్ని మరిచిపోయేలా చేస్తుంది. శేఖర్ చంద్ర అందించిన సంగీతం పరవాలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఏకె ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.


ప్లస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
కామెడీ
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ లెంగ్త్
ప్రీ క్లైమాక్స్కు ముందు బోరింగ్ సన్నివేశాలు

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement