Andhagadu
-
'అంధగాడు'పై రామ్ గోపాల్ వర్మ రివ్యూ
-
'అంధగాడు'పై రామ్ గోపాల్ వర్మ రివ్యూ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఓ చిన్న సినిమాపై ప్రశంసలు కురిపించాడు. రాజ్ తరుణ్ హీరో కొత్త దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అంధగాడు సినిమాపై చిన్నపాటి రివ్యూనే ఇచ్చాడు వర్మ. సినిమా చూసిన వర్మ చిత్రయూనిట్ ను ప్రశంసిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. రాజ్ తరుణ్ ను ప్రత్యేకంగా ప్రశంసించిన వర్మ, తరువాత సినిమా జానర్, టేకింగ్ లాంటి విషయాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. అప్పట్లో రాజ్ తరుణ్ ట్విట్టర్ ఎకౌంట్ లో వర్మపై వివాదాస్పద కామెంట్లు కూడా పోస్ట్ అయ్యాయి. తరువాత ఆ కామెంట్లు వర్మనే తన ఫోన్ నుంచి చేశాడని క్లారిటీ ఇచ్చాడు రాజ్ తరుణ్. తరువాత ఈ కాంబినేషన్ లో సినిమా కన్ఫామ్ కాకపోయినా.. వారి పరిచయం మాత్రం అలాగే కొనసాగుతుంది. అందుకే రాజ్ తరుణ్ అంధగాడు కోసం వర్మ స్వయంగా వీడియో రివ్యూ రిలీజ్ చేశాడు. -
'అంధగాడు' మూవీ రివ్యూ
టైటిల్ : అంధగాడు జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్రప్రసాద్, ఆశిష్ విద్యార్థి, శియాజీ షిండే సంగీతం : శేఖర్ చంద్ర దర్శకత్వం : వలిగొండ శ్రీనివాస్ నిర్మాత : సుంకర రామబ్రహ్మం డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్స్తో వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఇంట్రస్టింగ్ ఎంటర్టైనర్ అంధగాడు. దాదాపు నలబై నిమిషాలు పాటు గుడ్డివాడిగా కనిపించే పాత్రలో నటించేందుకు అంగీకరించిన రాజ్ తరుణ్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి ప్రయోగం చేసిన ఈ యంగ్ హీరో ఎంత వరకు సక్సెస్ సాధించాడు.?రాజ్ తరుణ్, హెబ్బా పటేల్‌ల జోడి మరోసారి హిట్ పెయిర్ అనిపించుకుందా..? కథ : గౌతమ్( రాజ్ తరుణ్) ఈ శారదాదేవి అంధుల ఆశ్రమంలో తనలాంటి గుడ్డివారితో కలిసి పెరిగే పిల్లాడు. తను ఎంతో ఇష్టపడే ఫ్రెండ్స్‌కు కళ్లు వస్తున్నాయంటే ఆనందంగా వారిని హాస్పిటల్‌కు పంపిస్తాడు. అలా వెళ్లిన ఫ్రెండ్స్ తరువాత తనకు ఒక్క ఉత్తరం కూడా రాయకపోవటంతో వాళ్లను మర్చి పోవాలనే ఉద్దేశంతో ఆశ్రమం నుంచి వెళ్లిపోతాడు. విశాఖపట్నంలో ఓ ఎఫ్ఎమ్ చానల్లో ఆర్జేగా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా కళ్లు వస్తాయని ఎదురుచూస్తున్న గౌతమ్‌కు డాక్టర్ నేత్ర పరిచయం అవుతుంది. ఎలాగైనా నేత్రకు దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో కళ్లున్నవాడిగా నటిస్తూ ఆమెను ప్రేమిస్తాడు. నేత్ర తన ప్రేమను చెప్పే టైంలో గౌతమ్ గుడ్డివాడన్న నిజం నేత్రకు తెలిసి అతన్ని వదిలి వెళ్లిపోతుంది. తరువాత తనే దగ్గరుండి గౌతమ్‌కు ఆపరేషన్ చేయించి కళ్లు వచ్చేలా చేస్తుంది. గౌతమ్‌కు కళ్లు వచ్చిన దగ్గర నుంచి అసలు సమస్య మొదలవుతుంది. ఓ ఆత్మ గౌతమ్‌కు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు గౌతమ్‌తో హత్యలు కూడా చేయిస్తుంది. నిజంగానే గౌతమ్‌కు ఆత్మ కనిపిస్తుందా.? దుర్మార్గుడైన పంతం బాబ్జీకి గౌతమ్‌కు ఉన్న సంబంధం ఏంటి..? చివరకు గౌతమ్‌తో మాట్లాడుతున్న ఆత్మ కథ ఏమైంది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించాడు. ముఖ్యంగా ఫస్ట్‌లో గుడ్డివాడిగా రాజ్ తరుణ్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయ్యింది. హెబ్బా పటేల్ గ్లామర్‌తో ఆకట్టుకున్న నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ఈ సినిమాలో కూడా చాన్స్ రాలేదు. కానీ రాజ్ తరుణ్‌కు పర్ఫెక్ట్ జోడిగా మరోసారి ప్రూవ్ చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ సినిమాలకు హెల్ప్ అయ్యింది. మెయిన్ విలన్‌గా రాజా రవీంద్ర ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లుక్, బాడీ లాంగ్వేజ్‌తో మంచి విలనీ పండించాడు. ఇతర పాత్రల్లో శియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, సత్య తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : రచయితగా మంచి పేరున్న వెలిగొండ శ్రీనివాస్.. అంధగాడు సినిమాతో దర్శకుడిగానూ మంచి మార్కులు సాధించాడు. అయితే ఈ సినిమాలోనూ శ్రీనివాస్‌లోని రచయిత.. దర్శకుడిని డామినేట్ చేయటం విశేషం. రెగ్యులర్ రివేంజ్ డ్రామానే చివరి వరకు ఆసక్తికరంగా తెరకెక్కించటంలో వెలిగొండ శ్రీనివాస్ సక్సెస్ సాధించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ తోనూ డైరెక్టర్ మెప్పించాడు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో ఆకట్టుకున్న శ్రీనివాస్, సినిమా ప్రీ క్లైమాక్స్‌కు చేరుతున్న దశలో కాస్త తడబడ్డాడు. అనవరమైన సీన్స్‌తో బోర్ కొట్టించాడు. అయితే క్లైమాక్స్ విషయంలో దర్శకుడు తీసుకున్న కేర్ సినిమాలో లోపాలన్ని మరిచిపోయేలా చేస్తుంది. శేఖర్ చంద్ర అందించిన సంగీతం పరవాలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఏకె ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి. ప్లస్ పాయింట్స్ : స్క్రీన్ ప్లే కామెడీ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ లెంగ్త్ ప్రీ క్లైమాక్స్‌కు ముందు బోరింగ్ సన్నివేశాలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
'అంధగాడు' మూవీ స్టిల్స్
-
అలా కనిపించేది 30 నిమిషాలే..!
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అంధగాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే 2 గంటల 12 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడిగా కనిపించేది కేవలం 30 నిమిషాలు మాత్రమేనట. పక్క కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో వెడిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలతో పాటు సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 2న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. శేఖర్ చంద్ర అందించిన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాజ్ తరుణ్ సరసన హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. -
కుమారి ఖాతాలో మరో ప్రాజెక్ట్
కుమారి 21ఎఫ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన క్యూట్ హీరోయిన్ హెబ్బా పటేల్ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇటీవల నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ సినిమాలు నిరాశపరిచినా హెబ్బా జోరు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పింది. పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండకు జోడిగా నటించనుంది హెబ్బా. యంగ్ డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాకు అంగీకరించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన హెబ్బా హీరోయిన్గా నటించనుంది. ప్రియాంక లీడ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన మరో హీరోయిన్ పాత్రకు హెబ్బాను ఫైనల్ చేశారట. ప్రస్తుతం ఏంజెల్, అంధగాడు సినిమాల రిలీజ్‌ల కోసం వెయిట్ చేస్తున్న హెబ్బా తర్వలోనే విజయ్ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టనుంది. -
నితిన్ డైరెక్టర్‌తో రాజ్ తరుణ్
నితిన్ హీరోగా తెరకెక్కిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో పరిచయం అయిన దర్శకుడు కొండా విజయ్ కుమార్. ఆ తరువాత నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం సినిమాతో యావరేజ్ హిట్ కొట్టిన ఈ యువ దర్శకుడు త్వరలో ఓ యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో సినిమా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో మరో హిట్ అందుకున్న రాజ్ తరుణ్, అంధగాడు సినిమాతోపాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నిర్మిస్తున్న మరో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాను పీవీపీ సంస్థ నిర్మించే అవకాశం ఉంది. -
'అంధగాడు' రిలీజ్ డేట్ ఫిక్స్
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్, ప్రస్తుతం మరో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం చివరిదశలో ఉంది. అంధగాడు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 26 రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో దాదాపు ఇంటర్వెల్ వరకు రాజ్ తరుణ్ గుడ్డివాడిగా నటిస్తున్నాడు. హేబా పటేల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉగాది సందర్భంగా అంధగాడు పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది. గతంలో రిలీజ్ అయిన పోస్టర్లలో రాజ్ తరుణ్ ను అంధుడిగానే చూపించిన యూనిట్ ఉగాది పోస్టర్ ను మాత్రం మాస్ లుక్ లో డిజైన్ చేశారు. -
ఒకటోసారి రెండోసారి మూడోసారి !
-
ఒకటోసారి రెండోసారి మూడోసారి !
ఏదైనా వేలం పాట నిర్వహిస్తున్నప్పుడు ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి అంటుంటారు. కానీ, ఇక్కడ వేలం పాట కాదు. యంగ్ హీరో రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ ముచ్చటగా మూడోసారి జతకడుతున్నారు. ‘కుమారి 21ఎఫ్’, ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాలతో హిట్ పెయిర్‌గా నిలిచిన వీరు తాజాగా ‘అంధగాడు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్ర మిది. నెక్ట్స్ ఏం జరగబోతోంది? అనే ఆత్రుత ప్రేక్షకుల్లో కలిగేలా కథ ఉంటుంది. కథ వినగానే రాజ్ తరుణ్ ఒప్పుకున్నారు. మంచి టీమ్ కుదిరింది. వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, సత్య, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర.