'అంధగాడు' రిలీజ్ డేట్ ఫిక్స్
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్, ప్రస్తుతం మరో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం చివరిదశలో ఉంది. అంధగాడు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 26 రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమాలో దాదాపు ఇంటర్వెల్ వరకు రాజ్ తరుణ్ గుడ్డివాడిగా నటిస్తున్నాడు. హేబా పటేల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉగాది సందర్భంగా అంధగాడు పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది. గతంలో రిలీజ్ అయిన పోస్టర్లలో రాజ్ తరుణ్ ను అంధుడిగానే చూపించిన యూనిట్ ఉగాది పోస్టర్ ను మాత్రం మాస్ లుక్ లో డిజైన్ చేశారు.