'అంధగాడు'పై రామ్ గోపాల్ వర్మ రివ్యూ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఓ చిన్న సినిమాపై ప్రశంసలు కురిపించాడు. రాజ్ తరుణ్ హీరో కొత్త దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అంధగాడు సినిమాపై చిన్నపాటి రివ్యూనే ఇచ్చాడు వర్మ. సినిమా చూసిన వర్మ చిత్రయూనిట్ ను ప్రశంసిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. రాజ్ తరుణ్ ను ప్రత్యేకంగా ప్రశంసించిన వర్మ, తరువాత సినిమా జానర్, టేకింగ్ లాంటి విషయాలను ప్రత్యేకంగా ప్రశంసించారు.
గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. అప్పట్లో రాజ్ తరుణ్ ట్విట్టర్ ఎకౌంట్ లో వర్మపై వివాదాస్పద కామెంట్లు కూడా పోస్ట్ అయ్యాయి. తరువాత ఆ కామెంట్లు వర్మనే తన ఫోన్ నుంచి చేశాడని క్లారిటీ ఇచ్చాడు రాజ్ తరుణ్. తరువాత ఈ కాంబినేషన్ లో సినిమా కన్ఫామ్ కాకపోయినా.. వారి పరిచయం మాత్రం అలాగే కొనసాగుతుంది. అందుకే రాజ్ తరుణ్ అంధగాడు కోసం వర్మ స్వయంగా వీడియో రివ్యూ రిలీజ్ చేశాడు.