రాజ్‌తరుణ్‌-లావణ్య వివాదం.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు | Ram Gopal Varma Sensational Comments On Raj Tarun, Lavanya Issue | Sakshi
Sakshi News home page

రాజ్‌తరుణ్‌-లావణ్య వివాదం.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

Published Sun, Aug 11 2024 11:32 AM | Last Updated on Sun, Aug 11 2024 12:07 PM

Ram Gopal Varma Sensational Comments On Raj Tarun, Lavanya Issue

హీరో రాజ్‌ తరుణ్‌-లావణ్య వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో  సెన్సేషనల్‌గా మారింది. రాజ్‌ తనతో 11 ఏళ్లుగా సహజీవనం చేసి, ఇప్పుడు వేరే హీరోయిన్‌ మోజులో పడి వదిలేశాడని లావణ్య ఆరోపిస్తుంది. అంతేకాదు తనను పెళ్లి కూడా చేసుకున్నాడని, గర్భం చేసి అబార్షన్‌ చేయించాడని పోలిసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై మీడియా రెండు-మూడు రోజులు పలు కథనాలు ప్రసారం చేసింది. ఇక సోషల్‌ మీడియాలో అయితే ఇప్పటి వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వీడియో వైరల్‌ అవుతూనే ఉంది. ఆర్జే శేఖర్‌ బాషా ఎంట్రీతో ఈ వివాదం మరింత ముదిరింది.  అటు లావణ్య..ఇటు శేఖర్‌ బాషా నిత్యం ఏదో ఒక యూట్యూబ్‌ చానెల్‌కి ఇంటర్వ్యూలు ఇవ్వడం..అవి కాస్త వైరల్‌ కావడం..దీనిపై కొంతమంది విశ్లేషణలు పెట్టడంతో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ కూడా రాజ్‌తరుణ్‌-లావణ్య వివాదంపై తన విశ్లేషణ ఇచ్చేశాడు. ప్రస్తుతం రాజ్‌-లావణ్య వివాదం మీడియా సర్కస్‌గా మారిందని, సోషల్‌ మీడియాలో అయితే ఒక వెబ్‌ సిరీస్‌గా దీన్ని ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. మొత్తంగా లావణ్య వ్యవహారమే తేడాగా ఉందంటూ.. రాజ్‌ తరుణ్‌కి మద్దతుగా మాట్లాడాడు ఆర్జీవీ.

‘రాజ్‌ నాతో 11 ఏళ్లు సహజీవనం చేశాడని.. అతను నాకు కావాలని లావణ్య అంటోంది. రాజ్‌ మాత్రమే కావాలంటే..అది చాక్లెట్‌ కాదు కదా? పెళ్లి చేసుకొని,20-30 ఏళ్లు కలిసి కాపురం చేసిన వాళ్లే విడిపోతున్నారు. ఇక సహజీవనం చేసి విడిపోవడం అసలు పాయింట్‌ కాదు’ అని ఆర్జీవీ అన్నారు.

ఇక లావణ్య వరుసగా ఆడియో క్లిప్స్‌ రిలీజ్‌ చేయడం గురించి మాట్లాడుతూ.. ‘కలిసి కాపురం చేసే వాళ్లకి ఆడియో రికార్డు చేయాలనే ఆలోచన రాదు. క్రిమినల్‌ మైండ్‌ సెట్‌ వాళ్లకే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆడియో క్లిప్స్‌ లీక్‌ చేయడం క్రిమినల్‌ మెంటాలిటీని సూచిస్తుంది. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఉండడం అసంభవం. రాజ్‌ మాత్రమే కావాలని లావణ్య బయటకు చెబుతుంది..కానీ చివరకు ఇదంతా డబ్బుతోనే సెటిల్‌ అవుతుందనే నాకు అనిపిస్తుంది’ అని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement