అలా కనిపించేది 30 నిమిషాలే..! | Raj Tarun is going to be seen as blind for only 30 minutes | Sakshi
Sakshi News home page

అలా కనిపించేది 30 నిమిషాలే..!

Published Sun, May 28 2017 11:26 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

అలా కనిపించేది 30 నిమిషాలే..! - Sakshi

అలా కనిపించేది 30 నిమిషాలే..!

వరుస హిట్స్తో దూసుకుపోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అంధగాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే 2 గంటల 12 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడిగా కనిపించేది కేవలం 30 నిమిషాలు మాత్రమేనట. పక్క కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో వెడిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలతో పాటు సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 2న గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోంది. శేఖర్ చంద్ర అందించిన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాజ్ తరుణ్ సరసన హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement